itel Mobile
-
ఐటెల్ బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్
ముంబై: ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ మొబైల్ ఇండియా కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నటుడైన హృతిక్‌తో భాగస్వామ్యం.. టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవాలన్న తమ లక్ష్యానికి తోడ్పడగలదని ట్రాన్షన్ (ఐటెల్) ఇండియా సీఈవో అరిజిత్ తాళపత్ర తెలిపారు. రూ. 8,000 లోపు ఫోన్ల సెగ్మెంట్లో ఇప్పటికే ఫేవరెట్‌గా ఉన్న తమ బ్రాండ్ స్థానా న్ని మరింత పటిష్టపర్చుకోగలమని చెప్పారు. అత్యుత్తమ మొబైల్స్‌ను అందుబాటు ధరల్లో ఐటెల్ అందిస్తోందని హృతిక్ తెలిపారు. -
ఐటెల్ నుంచి బడ్జెట్ ఫోన్ విజన్–1
న్యూఢిల్లీ: ట్రాన్సియాన్ ఇండియా ఐటెల్ బ్రాండ్‌పై విజన్–1 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. 6.088 అంగుళాల హెచ్డీ ప్లస్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లేతో కూడిన ఈ ఫోన్ధర రూ.5,499. ఫోన్‌తో పాటు రూ.799 విలువ చేసే ఐటెల్ బ్లూటూత్ హెడ్సెట్ కూడా ఉచితంగా లభిస్తుంది. దీనికి అదనంగా ఇన్‌స్టంట్‌గా రూ.2,000 వరకు క్యాష్ బ్యాక్, 25జీబీ జియో డేటా ఆఫర్లు ఉన్నట్టు కంపెనీ తెలిపింది. 2.5డీ కర్వ్డ్ లామినెటెడ్ డిస్ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఏఐ డ్యుయల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 1.6 గిగాహెర్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ సామర్థ్యాలున్నాయి. గ్రాడేషన్ బ్లూ, పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. -
డ్యూయల్ సెల్ఫీ కెమెరా, చౌక ధర: కొత్త మొబైల్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ట్రాన్సిషన్ హోల్డింగ్స్ తన బ్రాండ్ ఐటెల్ మొబైల్స్ ద్వారా బడ్జెట్ ధరలో ఓ సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. డ్యూయల్ సెల్ఫీ కెమెరా స్పెషల్ అట్రాక్షన్‌గా ఎస్ 21 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇండియాలో దీని ధరను రూ .5,990 గా నిర్ణయించింది. భారతదేశం అంతటా మూన్లైట్ సిల్వర్, షాంపైన్ గోల్డ్, బ్లాక్ కలర్ అప్షన్స్లో ఇది లభ్యం కానుంది. ఎస్ 21 ఫీచర్లు 5 అంగుళాల డిస్ప్లే క్వాడ్‌కోర్ మీడియా టెక్ చిప్సెట్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ 1జీబీ ర్యామ్ 16 జీబి ఇంటర్నల్ మెమెరీ 32జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 2ఎంపీ+5ఎంపీ సెల్ఫీ కెమెరా ఆటో-ఫోకస్, ఫేస్ రికగ్నిషన్ 8 ఎంపీ రియర్‌కెమెరా 2,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మార్కెట్లో విఘాతం కలిగించే టెక్నాలజీలను నిర్మించడంపై తాము విస్తృతంగా దృష్టి సారించామనీ, వినియోగదారులకు కావాల్సిన టెక్నాలజీ అందించే తమ ప్రయత్నానికి ఇదొక ఉదారహరణ అని ఐటెల్ మొబైల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ ఒక ప్రకటనలో చెప్పారు. ఆప్టిమైజేషన్ టెక్నాలజీ మద్దతుతో తమ బ్యాటరీ 350 గంటల సుదీర్ఘకాలంపాటు స్టాంబ్‌బై ఇస్తుందని తెలిపారు. -
విపణిలోకి ఐటెల్ 4జీ స్మార్ట్ ఫోన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఐటెల్ మొబైల్ విపణిలోకి కొత్త శ్రేణి 4జీ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. రూ.5,840కి విష్ ఏ41, రూ.5,390కి విష్ ఏ21 పేరిట ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 4జీ పోర్ట్ ఫోలియోను, కేటరింగ్ ను మరింత బలోపేతం చేయడానికి కంపెనీ ఈ ఫోన్లు మార్కెట్లోకి తీసుకొచ్చింది. 1.3 జీహెచ్‌జెడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్, 32జీబీ వరకు విస్తరణ మెమరీతో ఈ ఏ41 ఫోన్ ను కంపెనీ రూపొందించింది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ, 5ఎంపీ ఆటోఫోకస్ రియర్, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఈ ఫోన్ కు ఉన్నాయి. విష్ ఏ21 ఫోన్ కి కూడా ఇదేమాదిరి ఫీచర్లు కలిగి ఉన్నాయి. చైనాకు చెందిన ఈ ట్రాన్సిషన్ హోల్డింగ్స్ మన దేశంతో పాటు చైనా, ఆఫ్రికా వంటి 46 దేశాల్లో ఐటెల్ బ్రాండ్ తో స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తోంది. ఇప్పటివరకు 120 మిలియన్ ఫోన్లను ఈ కంపెనీ విక్రయించింది.