ముంబై: ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ మొబైల్ ఇండియా కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నటుడైన హృతిక్‌తో భాగస్వామ్యం.. టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవాలన్న తమ లక్ష్యానికి తోడ్పడగలదని ట్రాన్షన్ (ఐటెల్) ఇండియా సీఈవో అరిజిత్ తాళపత్ర తెలిపారు.
రూ. 8,000 లోపు ఫోన్ల సెగ్మెంట్‌లో ఇప్పటికే ఫేవరెట్‌గా ఉన్న తమ బ్రాండ్ స్థానా న్ని మరింత పటిష్టపర్చుకోగలమని చెప్పారు. అత్యుత్తమ మొబైల్స్‌ను అందుబాటు ధరల్లో ఐటెల్ అందిస్తోందని హృతిక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment