ఈ తరహా ఫస్ట్‌ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ ఇదేనట! | Galaxy C7 (2017) support page is now live on Samsung | Sakshi
Sakshi News home page

ఈ తరహా ఫస్ట్‌ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ ఇదేనట!

Published Tue, Aug 1 2017 4:50 PM | Last Updated on Fri, May 25 2018 6:09 PM

ఈ తరహా ఫస్ట్‌ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ ఇదేనట! - Sakshi

ఈ తరహా ఫస్ట్‌ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ ఇదేనట!

బీజింగ్‌: కొరియా మొబైల్‌ శాంసంగ్  కూడా డబుల్‌ రియర్‌ కెమెరాల  కేటగిరీలోకి ఎంట్రీ ఇస్తోంది.  తన తాజా   'గెలాక్సీ సి7' స్మార్ట్‌ఫోన్‌ను  రెండు ప్రధాన కెమెరాలతో లాంచ్‌ చేయనుంది.   గెలాక్సీ  సీ 7 2017 వేరియెంట్‌ను త్వరలో  మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది.  శాంసంగ్‌ చైనా  అధికారిక వెబ్‌సైట్‌ లో  లైవ్‌ లో ఇది ప్రత్యక్షమైంది.  దీని  సమాచారం ప్రకారం ఇది సమీప భవిష్యత్తులో ప్రారంభమవుతుంది.   శాంసంగ్‌ గెలాక్సీ సి 7 (2017), బ్లూటూత్ సర్టిఫికేషన్ , టెనా సర్టిఫికేషన్‌ పొందిన  శాంసంగ్‌  ఈ స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే సంస్థ విడుదల చేస్తుందని వెబ్‌ సైట్‌ సూచించింది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్,  3జీబీ  ర్యామ్‌, 32 జీబీ మొమరీ, 4 జీబీ, 64జీబీ మొమరీ రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది.


శాంసంగ్ గెలాక్సీ సి7 (2017) ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
 2.39 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్
 3/4 జీబీ ర్యామ్
 32/64 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13, 5 మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
 2850 ఎంఏహెచ్ బ్యాటరీ,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement