ఈ తరహా ఫస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఇదేనట!
బీజింగ్: కొరియా మొబైల్ శాంసంగ్ కూడా డబుల్ రియర్ కెమెరాల కేటగిరీలోకి ఎంట్రీ ఇస్తోంది. తన తాజా 'గెలాక్సీ సి7' స్మార్ట్‌ఫోన్‌ను రెండు ప్రధాన కెమెరాలతో లాంచ్ చేయనుంది. గెలాక్సీ సీ 7 2017 వేరియెంట్‌ను త్వరలో మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. శాంసంగ్ చైనా అధికారిక వెబ్సైట్ లో లైవ్ లో ఇది ప్రత్యక్షమైంది. దీని సమాచారం ప్రకారం ఇది సమీప భవిష్యత్తులో ప్రారంభమవుతుంది. శాంసంగ్ గెలాక్సీ సి 7 (2017), బ్లూటూత్ సర్టిఫికేషన్ , టెనా సర్టిఫికేషన్ పొందిన శాంసంగ్ ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే సంస్థ విడుదల చేస్తుందని వెబ్ సైట్ సూచించింది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3జీబీ ర్యామ్, 32 జీబీ మొమరీ, 4 జీబీ, 64జీబీ మొమరీ రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది.
శాంసంగ్ గెలాక్సీ సి7 (2017) ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
2.39 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్
3/4 జీబీ ర్యామ్
32/64 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13, 5 మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
2850 ఎంఏహెచ్ బ్యాటరీ,