వారికి బంపర్‌ ఆఫర్‌: రూ.2వేలకే స్మార్ట్‌ఫోన్‌ | Swipe Elite Dual brings dual rear cameras, 3000mAh battery for Rs 3,999 | Sakshi
Sakshi News home page

వారికి బంపర్‌ ఆఫర్‌: రూ.2వేలకే స్మార్ట్‌ఫోన్‌

Published Sat, Mar 10 2018 3:50 PM | Last Updated on Fri, May 25 2018 6:09 PM

Swipe Elite Dual brings dual rear cameras, 3000mAh battery for Rs 3,999 - Sakshi

మొబైల్స్ తయారీదారు స్వైప్ టెక్నాలజీస్   బడ్జెట్‌ ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్  రిలీజ్‌ చేసింది.  కేవలం రూ.3,999 ధరకే ఈ ఎలైట్ డ్యుయల్‌ను తాజాగా విడుదల చేసింది.  డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఈ  ఫోన్‌ ప్రధాన ఆకర్షణగా నిలిస్తున్నాయి.   అంతేకాదు  ఈ ఫోన్‌ను కొన్న యూజర్లకు రూ.2200 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.  అంటే వినియోగదారులు 1,799 రూపాయలకే (రూ .3,999 - రూ .2,200) వద్ద ఫోన్ కొనుగోలు చేసే అవకాశం అన్నమాట. అయితే జియో కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందనేది గమనార్హం.  జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న స్వైప్‌ టెక్నాలజీస్‌ జియో ఫుట్‌బాల్‌ఆఫర్‌ కింద జియో (పాత,కొత్త) ఈ ఆఫర్‌ అందిస్తోంది.  బ్లాక్, వైట్, గోల్డ్ మూడు రంగుల్లో   లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా   షాప్‌క్లూస్  ద్వారా  వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.


స్వైప్ ఎలైట్ డ్యుయల్ ఫీచర్లు

  • 5 ఇంచ్ డిస్‌ప్లే
  • 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
  • 1 జీబీ ర్యామ్
  • 8 జీబీ స్టోరేజ్
  • 64జీబీ దాకా విస్తరించుకనే అవకాశం
  • 8+ 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్‌ కెమెరాలు విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
  • 5మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement