Airtel 5G Available On These Phones: Check If Your Smartphone Is In The List - Sakshi
Sakshi News home page

Airtel 5G : ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌ వర్క్‌ పనిచేసే స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే!

Published Fri, Oct 7 2022 1:01 PM | Last Updated on Fri, Oct 7 2022 1:59 PM

Airtel 5g Available On These Phones, Check If Your Smartphone Is In The List - Sakshi

టెలికం కంపెనీ ఎయిర్‌టెల్‌ నెక్ట్స్‌ జనరేషన్‌ నెట్‌ వర్క్‌ 5జీని హైదరాబాద్‌ సహా ఎనిమిది నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. కానీ ఈ లెటెస్ట్‌ టెక్నాలజీ నెట్‌ వర్క్‌ ఐఫోన్‌, శాంసంగ్‌, వన్‌ ప్లస్‌తో పాటు మరికొన్ని ఫోన్‌లలో పనిచేయకపోవడంతో యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లలో మాత్రమే 5జీ పనిచేస్తుంటూ ఓ జాబితా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు 5జీ పనిచేసే ఫోన్‌లు ఏమిటో తెలుసుకునే ముందు టారిఫ్‌ ధరలతో పాటు, సిమ్‌ కార్డ్‌లపై ఎయిర్‌టెల్‌ అందించిన వివరాల ప్రకారం.. 

4జీ ఛార్జీలకే ఎయిర్‌టెల్‌ 5జీ
5జీ నెట్‌ వర్క్‌ను వినియోగంలోకి తెచ్చినా ఎయిర్‌టెల్‌ టారిఫ్‌ ధరల్ని ప్రకటించలేదు. ఈ తరుణంలో ప్రస్తుత 4జీ ప్లాన్‌లోనే 5జీ సేవల్ని కస్టమర్లు పొందవచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది. 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ఏదైనా కస్టమర్లు వినియోగిస్తున్న ప్రస్తుత సిమ్‌లోనే 5జీ పని చేస్తుందని భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈవో గోపాల్‌ విఠల్‌ తెలిపారు. 

అంతా మీ ఇష్టం
5జీ సిగ్నల్స్‌ అందుకున్న వినియోగదారులు 5జీకి మళ్లవచ్చు. డేటా వినియోగం ఎక్కువగా అవుతోందని భావిస్తే తిరిగి 4జీకి బదిలీ కావొచ్చు. 5జీ సర్వీసులను అందుకోవాలా వద్దా అన్నది కస్టమర్ల అభీష్టం మేరకేనని కంపెనీ పేర్కొంది. మార్చి 2024 లోపు దేశ వ్యాప్తంగా ఈ లేటెస్ట్‌ కనెక్టివిటీని అందిస్తామని, ప్రస్తుతానికి దశల వారీగా ఎంపిక చేసిన కస్టమర్లకు 5జీ సపోర్టెడ్‌ స్మార్ట్‌ ఫోన్‌లలో 5జీ నెట్‌ వర్క్‌ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. 

మీ ఫోన్‌ 5జీకి సపోర్ట్‌ చేస్తుందో, లేదా అని తెలుసుకోవాలంటే కింద జాబితాను చూడండి 

శాంసంగ్‌
శాంసంగ్‌ గెలాక్సీ ఏ53 5జీ, శాంసంగ్‌ ఏ33 5జీ, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 21 ఎఫ్‌ఈ, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా, శాంసంగ్‌ గెలాక్సీ ఎం 33, శాంసంగ్‌ ఫ్లిప్‌4, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 22 ప్లస్‌, శాంసంగ్‌ ఫోల్డ్‌4

రియల్‌ మీ
రియల్‌మీ 8ఎస్‌ 5జీ , రియల్‌మీ ఎక్స్‌ 7 మ్యాక్స్‌ 5జీ, రియల్‌ మీ నార్జో 30 ప్రో 56, రియల్‌ మీ ఎక్స్‌7 5జీ, రియల్‌మీ ఎక్స్‌ 7 ప్రో 50, రియల్‌ మీ 850, రియల్‌ మీ ఎక్స్‌ 50 ప్రో, రియల్‌ మీ జీటీ 5జీ, రియల్‌మీ జీటీ ఎంఈ, రియల్‌ మీ జీటీ నియో2, రియల్‌మీ 95జీ, రియల్‌ మీ 9ప్రో, రియల్‌ మీ 9 ప్రో ప్లస్‌, రియల్‌మీ నార్జో 30 5జీ, రియల్‌మీ 9 ఎస్‌ఈ, రియల్‌మీ జీటీ2, రియల్‌మీ జీటీ 21ప్రో, రియల్‌మీ జీటీ నియో3, రియల్‌మీ నార్జో 50 50,  రియల్‌మీ నార్జో 50 ప్రో 

వన్‌ ప్లస్‌
వన్‌ప్లస్‌ నార్డ్‌, వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9ప్రో, వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ, వన్‌ప్లస్‌ నార్డ్‌, వన్‌ప్లస్‌ 10 ప్రో 56,వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ లైట్‌2, వన్‌ప్లస్‌ ఎక్స్‌డీఆర్‌, వన్‌ప్లస్‌ నార్డ్‌ 27,వన్‌ప్లస్‌ 10టీ

షావోమీ
షావోమీ ఎంఐ10, షావోమీ ఎంఐ ఎల్‌ఓటీ, షావోమీ ఎంఐ 10టీప్రో, షావోమీ ఎంఐ 11 ఆల్ట్రా(కే1), షావోమీ ఎంఐ 11ఎక్స్‌ ప్రో, షావోమీ ఎంఐ 11ఎక్స్‌, షావోమీ పోకో ఎం3 ప్రో 5జీ, షావోమీ పోకో ఎఫ్‌3 జీటీ, షావోమీ ఎంఐ 11 లైట్‌ ఎన్‌ఈ( కే9డీ), షావోమీ కిగా రెడ్‌మీ నోట్‌ ఐఐటీఎస్‌జీ (Xiaomi KIGA Redmi Note IITSG), షావోమీ కే3ఎస్‌ షావోమీ 11టీ ప్రో, షావోమీ కే 16 షాఓమీ 111 హైపర్‌ ఛార్జ్‌, షావోమీ రెడ్‌మీ నోట్‌ 10టీ, షావోమీ కే6ఎస్‌ (రెడ్‌మీ నోట్‌ 11 ప్రో ప్లస్‌), షావోమీ పోకో ఎం4 5జీ, షావోమీ 12 ప్రో, షావోమీ 111, షావోమీ రెడ్‌మీ 11 ప్రైమ్‌ 5జీ (ఎల్‌ 19), షావోమీ పోకో ఎఫ్‌4 5జీ, షావోమీ పోకో ఎక్స్‌4 ప్రో, షావోమీ రెడ్‌మీ కే50ఐ

ఒప్పో 
ఒప్పో రెనో5జీ ప్రో, ఒప్పో రెనో 6, ఒప్పో రెనో 6 ప్రో, ఒప్పో ఎఫ్‌19ప్రో ప్లస్‌, ఒప్పో ఏ53 ఎస్‌, ఒప్పో ఏ53 ఎస్‌, ఒప్పో ఏ74, ఒప్పో రెనో 7 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్‌21 ప్రో 5జీ, ఒప్పో రెనో7, ఒప్పో రెనో8, ఒప్పో రెనో 8 ప్రో, ఒప్పో ఫైండ్‌2, ఒప్పో కే10 5జీ, ఒప్పో ఎస్‌21 ప్రో 5జీ

వివో 
వివో ఎక్స్‌ 50 ప్రో, వీ20 ప్రో, ఎక్స్‌ 60 ప్రో ప్లస్‌, ఎక్స్‌60, ఎక్స్‌60 ప్రో ప్లస్‌, ఎక్స్‌70 ప్రో, ఎక్స్‌70 ప్రోప్లస్‌, ఎక్స్‌80, ఎక్స్‌ 80 ఫ్లాగ్‌షిప్‌ ఫోన్స్‌, వి20 ప్రో, వి21 5జీ, వి21ఈ, వై72 5జీ, వీ23 5జీ, వీ23 ప్రో 5జీ, వీ23ఈ 5జీ, టీ1 5జీ, టీ1 ప్రో 5జీ,వై 75 5జీ,వీ 25, వీ25ప్రో,వై55,వై55ఎస్‌

చదవండి👉 ఈ ఫోన్‌లలో 5జీ పనిచేయడం లేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement