Swipe Technology
-
వారికి బంపర్ ఆఫర్: రూ.2వేలకే స్మార్ట్‌ఫోన్
మొబైల్స్ తయారీదారు స్వైప్ టెక్నాలజీస్ బడ్జెట్ ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. కేవలం రూ.3,999 ధరకే ఈ ఎలైట్ డ్యుయల్‌ను తాజాగా విడుదల చేసింది. డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలిస్తున్నాయి. అంతేకాదు ఈ ఫోన్‌ను కొన్న యూజర్లకు రూ.2200 వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అంటే వినియోగదారులు 1,799 రూపాయలకే (రూ .3,999 - రూ .2,200) వద్ద ఫోన్ కొనుగోలు చేసే అవకాశం అన్నమాట. అయితే జియో కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందనేది గమనార్హం. జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న స్వైప్ టెక్నాలజీస్ జియో ఫుట్‌బాల్‌ఆఫర్ కింద జియో (పాత,కొత్త) ఈ ఆఫర్ అందిస్తోంది. బ్లాక్, వైట్, గోల్డ్ మూడు రంగుల్లో లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా షాప్‌క్లూస్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. స్వైప్ ఎలైట్ డ్యుయల్ ఫీచర్లు 5 ఇంచ్ డిస్ప్లే 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 1 జీబీ ర్యామ్ 8 జీబీ స్టోరేజ్ 64జీబీ దాకా విస్తరించుకనే అవకాశం 8+ 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
అద్భుత ఫీచర్లు..బడ్జెట్ ధర: కొత్త ట్యాబ్
సాక్షి, న్యూఢిల్లీ: స్వైప్ టెక్నాలజీస్ బడ్జెట్ ధరలో ట్యాబ్‌ను లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ సామర్ధ్యం, 16జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ ప్రధాన ఫీచర్లుగా స్వైప్ స్లేట్ ప్రొ పేరుతో దీన్ని మార్కెట్లో విడుదల చేసింది. రూ. 8499 ధరలో ఇది ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో లభించనుంది. స్వైప్ స్లేట్ ప్రొ ఫీచర్లు 10.1 హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ మార్షమిల్లౌ 1.1 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 32 జీబా దాకా విస్తరించుకునే అవకాశం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 2 ఎంపీ సెల్ఫీ కెమెరా మరోవైపు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ఫ్లిప్‌కార్ట్ 5శాతం డిస్కౌంట్ అందిస్తోంది. -
స్వైప్ టెక్నాలజీ ‘మేకిన్ ఇండియా’
జనవరిలో తొలి ఉత్పాదన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ టెక్నాలజీ కంపెనీ స్వైప్ టెక్నాలజీస్ పుణే సమీపంలో 20 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటును నిర్మిస్తోంది. ఆరు అసెంబ్లింగ్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రంలో ట్యాబ్లెట్ పీసీలతోపాటు స్మార్ట్ఫోన్లను రూపొందిస్తారు. తయారీ, మార్కెటింగ్‌కుగాను వచ్చే రెండేళ్లలో కంపెనీ రూ.130 కోట్లు ఖర్చు చేస్తోంది. మేకిన్ ఇండియా తొలి ఉత్పాదన జనవరి 1న ఆవిష్కరిస్తామని స్వైప్ వ్యవస్థాపకులు శ్రీపాల్ గాంధీ తెలిపారు. స్మార్ట్ ఫోన్ ఎలీట్-2 మోడల్‌ను బుధవారమిక్కడ ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాగా4జీ స్మార్ట్‌ఫోన్ ఎలీట్-2 ధర రూ.4,666. ఫ్లిప్‌కార్ట్‌లో నవంబరు 8 నుంచి లభిస్తుంది.