ఒప్పో కొత్త ఫోన్: ఫ్రంట్ కెమెరా ఎంతో తెలుసా?
ఒప్పో కొత్త ఫోన్: ఫ్రంట్ కెమెరా ఎంతో తెలుసా?
Published Tue, Jun 6 2017 1:25 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM
చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో మరో కొత్త సెల్ఫీ ఫోకస్డ్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎన్నో లీకేజీల అనంతరం ఒప్పో ఆర్11 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో అతిపెద్ద ఆకర్షణ. వెనుకవైపు రెండు కెమెరాలు ఉండటంతో పాటు, ముందు వైపు 20 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉండటం. జూన్ 10 నుంచి ఒప్పో ఆర్11 స్మార్ట్ ఫోన్ చైనాలో అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ చెప్పింది. ఈ ఫోన్ లాంచ్ చేసినప్పటికీ, ఇంకా అధికారిక ధరను కంపెనీ ప్రకటించలేదు. మార్కెట్లో వస్తున్న రూమర్ల ప్రకారం ఈ ఫోన్ ధర 485 డాలర్లు ఉండొచ్చని అంటే రూ.31,200గా పేర్కొంటున్నాయి. మూడు రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ వేరియంట్లలో ఇది మార్కెట్లో లభ్యమవుతోంది. వెనుకవైపు అమర్చిన కెమెరా దగ్గర్నే సెంటర్ లో ఒప్పో లోగో ఉంటుంది.
ఈ ఫోన్ ఫీచర్లు...
5.5 అంగుళాల డిస్ ప్లే,
స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
1080x1920 పిక్సెల్స్ రెజుల్యూషన్
4జీబీ ర్యామ్
64జీబీ స్టోరేజ్
ఒకటి 20 మెగాపిక్సెల్, మరొకిటి 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలు
20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ఆండ్రాయిడ్ 7.1 నోగట్
2900ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ ఎల్టీఈ, జీపీఎస్, వై-ఫై, బ్లూటూత్
Advertisement
Advertisement