టాప్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్ లివే!
టాప్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్ లివే!
Published Sat, May 20 2017 1:36 PM | Last Updated on Fri, May 25 2018 6:09 PM
డ్యూయల్ కెమెరా.. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. కస్టమర్లను ఆకట్టుకోవడానికి కచ్చితంగా వెనుకవైపు రెండు కెమెరాలను అందించడానికే మొబైల్ తయారీదారులు మొగ్గుచూపుతున్నారు . ఇన్నిరోజులు హై-ఎండ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితమైన ఈ డ్యూయల్ కెమెరా సెటప్, తక్కువ ధరతో మార్కెట్లోకి వచ్చే ఫోన్లకు అందుబాటులోకి వస్తున్నాయి.. దీంతో ప్రస్తుతం అన్ని ధరల రేంజ్ లో స్మార్ట్ ఫోన్లలో ఈ డ్యూయల్ కెమెరా దర్శనమిస్తోంది. అయితే మార్కెట్లో ఉన్న టాప్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్లేమిటో ఓ సారి చూద్దాం...
ఐఫోన్ 7 ప్లస్...
ఇమేజింగ్ విషయంలో ఐఫోన్ 7 ప్లస్ మార్కెట్లో ఉన్న ఒకానొక బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో ఇదీ ఒకటి. ఈ ఫోన్ కు వెనుకవైపు రెండు కెమెరాలున్నాయి. 12మెగాపిక్సెల్ తో రెండు కెమెరాలను ఆపిల్ ఈ ఫోన్ ను గతేడాదే మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిలో ప్రైమరీ వైడ్-యాంగిల్ లెన్స్ ను కలిగి ఉండగా... సెకండరీ టెలిఫోటో లెన్స్ ను కలిగిఉంది. ఎక్కువదూరంలో ఉండే ఫోటోలను జూమ్ మోడ్ లో కూడా అత్యంత స్పష్టంగా క్య్యాప్చర్ చేయడంలో ఇవి సహాయపడతాయి.
ఎల్జీ జీ6...
అద్భుతమైన ఇమేజ్ లను అందించడానికి ఎల్ జీ తన జీ6 స్మార్ట్ ఫోన్ కు వెనుకవైపు రెండు కెమెరాలను అందించింది. అంతేకాక మార్కెట్లో ఉన్న గూగుల్ పిక్సెల్, శాంసంగ్ ఎస్ 8 స్మార్ట్ ఫోన్లకు ఇది గట్టిపోటీ ఇవ్వడానికి సహకరిస్తున్నాయట. ప్రైమరీ లెన్స్ ను, 125 డిగ్రీల్లో వైడ్-యాంగిల్ లెన్స్ లో ఈ ఫోన్ రెండు 13మెగాపిక్సెల్ సెన్సార్లను కలిగి ఉంది. ఎల్జీ జీ5 స్మార్ట్ ఫోన్ కెమెరాను మెరుగుపరుస్తూ జీ6 స్మార్ట్ ఫోన్ కు డ్యూయల్ కెమెరాను కంపెనీ ఆఫర్ చేసింది. తక్కువ వెలుగున్న సమయంలో అద్భుతంగా ఫోటోలు తీయడానికి మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదేనట.
ఎల్జీ వీ20...
ఎల్జీ వీ20 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నోగట్ తో వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ గా మార్కెట్లో పేరుంది. ఈ ఫోన్ కు కూడా 16ఎంపీ ప్రైమరీ 75 డిగ్రీల లెన్స్, సెకండరీ వైడ్-యాంగిల్ 135 డిగ్రీల 8ఎంపీ లెన్స్ తో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి... సెకండరీ వైడ్-యాంగిల్ లెన్స్ కెమెరా విస్తృత పరిధిలో ఉన్న దృశ్యాలను ఇట్టే క్యాప్చర్ చేస్తుంది. అదనంగా ఫోటోలకు ఫిష్ ఐ అపీయరెన్స్ ను కూడా ఇది అందిస్తోంది. గెలాక్సీ ఎస్7 లేదా ఐఫోన్ 7 ప్లస్ ల కంటే మెరుగైన, అద్భుతమైన ఫోటో క్వాలిటీని ఈ 16ఎంపీ సెన్సార్ కలిగి ఉందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
హువావే హానర్ 8...
ఆపిల్, ఎల్జీ స్మార్ట్ ఫోన్లకు విభిన్నంగా హానర్ 8 స్మార్ట్ ఫోన్ కు డ్యూయల్ కెమెరాను హువావే సెట్ చేసింది. రెండు లెన్స్ ద్వారా ఇన్ ఫుట్స్ ను సేకరించి, ఆ రెండింటి ఇమేజ్ లను ఒకదాని తర్వాత ఒకటి కలిపి ఫైనల్ ప్రొడక్ట్ లను మనకు అందించే సాఫ్ట్ వేర్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. హువావే పీ9 మాదిరిగానే ఈ ఫోన్ కు వెనుకవైపు 12ఎంపీ ఆర్జీబీ సెన్సార్, 12ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. రెగ్యులర్ కలర్ సెన్సార్స్ కంటే 200 శాతం ఎక్కువ లైట్, 50 శాతం ఎక్కువ కాంట్రాస్ట్ ను ఈ ఫోన్ లో అందించిన మోనో క్రోమ్ సెన్సార్ యూజర్లకు అందిస్తోంది. ఎక్కువ మొత్తంలో డేటాను కూడా ఈ మోనోక్రోమ్ సెన్సార్ క్యాప్చర్ చేస్తోంది. హానర్ 8 మొబైల్ క్వాలిటీ అత్యంత అద్భుతంగా ఉందని తమ రివ్యూలో తేలినట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
హానర్ 6ఎక్స్....
డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్లలో హానర్ 6ఎక్స్ కు మార్కెట్లో మంచి పేరే ఉంది. 12మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ను ఈ ఫోన్ కు అమర్చారు. ఈ ఫోన్ ధర కూడా అందుబాటులోనే 12,999గా నిర్ణయించినట్టు కంపెనీ చెప్పింది.
Advertisement
Advertisement