
షావోమి ఎంఐ 5ఎక్స్ లాంచ్, స్పెషల్ ఏంటి?
ఛైనీస్ మొబైల్ మేకర్ షావోమి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆధారిత ‘ఎంఐ 5 ఎక్స్’ ను మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. 12 ఎంపీవైడ్‌యాంగిల్ 1.25మైక్రాన్ పిక్సెల్ సెన్సర్, f/2.2 అపెర్చర్ 12-మెగాపిక్సెల్ టెలిఫోటో ద్వంద్వ కెమెరాలను జోడించడం స్పెషల్ ఫీచర్‌గా నిలవనుంది. దీని ధర సుమారుగా రూ. 14,200లు. బ్లాక్, గోల్డ్, పింక్ కలర్ ఆప్షన్స్‌లో ఆగస్టు 1 నుంచి చైనాలో విక్రయాలు ప్రారంభం. రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. కాగా దాదాపు ఎంఐ 6 ను పోలిన ఫీచర్లతో ఐఫోన్ 7 ప్లస్ , వన్‌ప్లస్ 5 లకు గట్టిపోటీ ఇవ్వనుందని అంచనా.
షావోమి ఎంఐ 5ఎక్స్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్,
4 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్,
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12 మెగాపిక్సల్ డబుల్ బ్యాక్ కెమెరాలు,
5మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా,
3080 ఎంఏహెచ్ బ్యాటరీ క్విక్ చార్జ్ 3.0.