శాంసంగ్ గెలాక్సీ సీ 8 వచ్చేసింది..
సాక్షి, బీజింగ్: కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ సీరిస్ లో ‘గెలాక్సీ సీ 8’ పేరుతో దీన్ని చైనాలో విడుదల చేసింది. గెలాక్స్ ఎస్ 8, ఎస్ 8ప్లస్ విజయం తరువాత ముఖ్యంగా భారీ సెల్ఫీ కెమెరాతోపాటు, డ్యుయల్ రియర్ కెమెరాలతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ధరను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అలాగే భారత్ లో ఎపుడు లాంచ్ చేసిది కూడా స్పష్టం కాలేదు. ఫింగర్ పింట్ సెన్సార్, ఫేషియల్ రికగ్నిషన్ తదితర ఫీచర్లతో రెండు వేరియంట్లలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, గోల్డ్, పింక్ కలర్స్‌లో ఇది అభ్యం కానుంది.
శాంసంగ్ గెలాక్సీ సీ 8 ఫీచర్లు
5.5 అంగుళాల ఫుడ్ హెచ్‌డీ అమోలెడ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1
1080x1920 పిక్సెల్ రిజల్యూషన్
4 జీబీ ర్యామ్
64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
256 దాకా విస్తరించుకునే అవకాశం
13+5 ఎంపీ డ్యుయల్‌రియర్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ