4 వారికి బ్యాడ్ అట..అందుకే 5 వస్తోంది
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు 'వన్ ప్లస్' తన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో 2017లో వన్ ప్లస్ 5ను త్వరలో విడుదల చేయనుంది. గతంలో వన్ ప్లస్ 3 వచ్చిన దృష్ట్యా దాని తరువాత వన్ ప్లస్ 4 వస్తుందని అందరూ భావించారు. కానీ, ప్రస్తుతం నెట్ లోహల్‌చల్ చేస్తున్న లీక్స్ ప్రకారం వన్ ప్లస్ సంస్థ యూజర్లందరికీ షాక్ ఇస్తూ త్వరలో వన్ ప్లస్ 5ను విడుదల చేయనుంది.
వన్ ప్లస్ 3టీతో పోలిస్తే కొంచెం ఎక్కువ ధరలోనే దీన్ని లాంచ్ చేయనుంది. అయితే శాంసంగ్, యాపిల్, గూగుల్ తో సమానంగా దూసుకుపోతున్న వన్‌ప్లస్ శాంసంగ్ ఎస్8, ఆపిల్ 7 తో పోలిస్తే రీజనబుల్ ప్రైస్‌లోనే అందించనుందని తెలుస్తోంది. 8జీబీ వేరియంట్‌ను కూడా లాంచ్ చేయనుందని మరోరిపోర్టు నివేదించింది. అధికారికంగా లాంచ్ కాకముందే ఇంకెన్ని రూమర్లు,అంచనాలు చెలురేగుతాయో చూడాలి.
చైనాలో 4 అంకెను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారట. ఆ అంకె వల్ల అంతా చెడు జరుగుతుందని వారు విశ్వసిస్తారట. ఈ నేపథ్యంలోనే చైనా మొబైల్‌దిగ్గజం వన్ ప్లస్ తన ఫోన్ సిరీస్‌లో వన్ ప్లస్ 4ను విడుదల చేయడం లేదని సమాచారం. ఈ ఫ్లాగ్‌షిప్ డివైస్ పై స్పెసిఫికేషన్స్ అంచనాలు ఇలా ఉన్నాయి.
వన్ ప్లస్ 5 ఫీచర్లు
5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే
2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
4జీ, 8 జీబీ ర్యామ్
64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
23 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్ 2.0