ఐఫోన్7 వరస్ట్ ఫీచర్ను అది కాఫీ కొట్టింది!
ఐఫోన్7 వరస్ట్ ఫీచర్ను అది కాఫీ కొట్టింది!
Published Sat, May 20 2017 8:57 AM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM
మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న వన్ ప్లస్... త్వరలోనే ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. వన్ ప్లస్ 5 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేయనుందట. 2017లో తీసుకురాబోతున్నారంటూ ఎక్కువగా అంచనావేసిన ఫోన్లలో ఈ వన్ ప్లస్5 ఒకటి. ఐఫోన్ లెవల్ క్వాలిటీలో దీన్ని లాంచ్ చేస్తారని టెక్ అభిమానులు అంచనావేస్తున్నారు. కొన్ని ఫీచర్లను సైతం ఆపిల్ నుంచి వన్ ప్లస్ కాఫీకొడుతుందని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే భాగంగానే ఐఫోన్ 7లో లేని ఓ ఫీచర్ ను, వన్ ప్లస్5 కూడా తన స్మార్ట్ ఫోన్ లో అందించడం లేదని రిపోర్టులు చెబుతున్నాయి. అదేమిటో తెలుసా? 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్. హెడ్ ఫోన్ జాక్ లేకుండానే ఐఫోన్7 మాదిరిగా వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ కూడా మార్కెట్లోకి రానుందని రిపోర్టులు తెలుపుతున్నాయి. అంటే ఇది కేవలం బ్లూటూత్ హెడ్ ఫోన్లపైనే ఆధారపడి ఉంటుందని చెప్పాయి.
హెడ్ ఫోన్ జాక్ అందించకపోతుండటంతో, ఐఫోన్ 7 మాదిరిగా, వన్ ప్లస్ కూడా తన స్మార్ట్ ఫోన్ లో మరేదైనా సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తారా? అని టెక్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వన్ ప్లస్ 5కు సంబంధించిన ఇమేజ్ లను చైనీస్ సోషల్ మీడియా సైట్ వైబో షేర్ చేసింది. లీక్ చేసిన ఈ ఫోటోలో వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ కు డ్యూయల్ లెన్స్ కెమెరా, విలక్షణమైన వన్ ప్లస్ లోగో కనిపిస్తోంది.. కానీ ఈ విషయంపై వన్ ప్లస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వచ్చే రెండు మూడు నెలల్లోనే ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. అసలు హెడ్ ఫోన్ జాక్ ఇస్తుందా ? లేదా? అన్నది అప్పుడే క్లారిటీగా తెలుస్తుందని టెక్ వర్గాలంటున్నాయి. ఐఫోన్ 7లో హెడ్ ఫోన్ జాక్స్ లేకపోవడం టెక్ అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement