స్మార్ట్ ఫోన్లపై స్వీటెస్ట్ డీల్స్! | Amazon Great Indian Sale day 1 deals: Moto G4 Plus, Lenovo Z2 Plus, Apple iPhone 5s | Sakshi
Sakshi News home page

స్మార్ట్ ఫోన్లపై స్వీటెస్ట్ డీల్స్!

Published Fri, Jan 20 2017 10:23 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

స్మార్ట్ ఫోన్లపై స్వీటెస్ట్ డీల్స్!

స్మార్ట్ ఫోన్లపై స్వీటెస్ట్ డీల్స్!

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా 2017లో  'గ్రేట్ ఇండియన్ సేల్'  లో  స్మార్ట్ ఫోన్లపై  స్వీటెస్ట్ డీల్స్  ను  ప్రకటించింది.  జనవరి 20  శుక్రవారం అర్థరాత్రి నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు  సాగనున్న సేల్ లో స్మార్ట్ఫోన్లు, లాప్టాప్స్, పీసీలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, స్టేషనరీ ప్రొడక్ట్స్, బుక్స్, టోయ్స్, యాక్ససరీస్ లపై  కంపెనీ డిస్కౌంట్లు అందిస్తోంది.  ముఖ్యంగా  మోటో జీ  ప్లస్, లెనోవా జెడ్2 ప్లస్, ఆపిల్ ఐఫోన్ -5, కిండ్లే పేపర్ వైట్ తదితరాలపై  భారీ ఆఫర్లు ప్రకటించింది.
 

మోటో జీ4  ప్లస్  (16 జీబీ)

మోటో జీ4  ప్లస్  (16 జీబీ)పై రూ. 2 వేలు తగ్గింపు ధరతో రూ.11,499లకే అందించనుంది.  (అసలు ధర రూ.13,499) పాత ఫోన్ తో ఎక్సేంజ్ చేసుకుంటే రూ. 8,550 వరకూ ఆఫర్ అందుబాటులో ఉంది.

లెనోవా జెడ్2 ప్లస్ (64 జీబీ)

లెనోవా జెడ్2 ప్లస్ (64 జీబీ)  ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్  ఇప్పటికే అందించిన 2 వేల తగ్గింపుతో రూ.17,499కు లభ్యం. అలాగే రూ. 8,550 దాకా ఎక్సేంజ్  డిస్కౌంట్ అందిస్తోంది.

ఐ ఫోన్ 5 ఎస్ (64 జీబీ)
యాపిల్ ఐ ఫోన్  5 ఎస్ (64 జీబీ) రూ.15,999 లకే అందిస్తోంది. అసలు ధర  సుమారు రూ.25,000.   క్రెడిట్ కార్డు దారులకు ఈఎంఐ ప్రారంభ ధర రూ.1,428గా ఉంది.  

వన్ ప్లస్ 3 టీ (64 జీబీ)
వన్ ప్లస్ 3 టీ (64 జీబీ) రూ. 29,999 లకు అందుబాటులో ఉంది. అసలు ధరపై రూ.2వేల తగ్గింపుతోపాటు రూ.10,550 దాకా ఎక్సేంజ్ డిస్కౌంట్.

సాన్యో 43 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ టీవీ

మరో స్వీటెస్ట్ డీల్ కూడా అమెజాన్ అందిస్తోంది. సాన్యో 43 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ టీవీపై  రూ.8,500ల భారీ తగ్గింపు ఆఫర్  కల్పించింది. అసలు ధర  రూ.33,990 కాగా అమెజాన్ ఈ ఆఫర్  ద్వారా  రూ.23,490 లకే అందుబాటులోకి  తీసుకొచ్చింది.  అలాగే 18,000 వరకూ ఎక్సేంజ్ డిస్కౌంట్ సౌలభ్యం కూడా ఉంది. ఇవేకాదు.. ఇతర కెమెరాలు,  గేమింగ్ కన్సోల్,  పేపర్ వైట్స్  పై ఆసక్తికర  డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది.  మరిన్ని వివరాలకు అమెజాన్ అధికారిక వెబ్ సైట్ ను గమనించాల్సిందే..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement