Lenovo Z2 Plus
-
స్మార్ట్ ఫోన్లపై స్వీటెస్ట్ డీల్స్!
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా 2017లో 'గ్రేట్ ఇండియన్ సేల్' లో స్మార్ట్ ఫోన్లపై స్వీటెస్ట్ డీల్స్ ను ప్రకటించింది. జనవరి 20 శుక్రవారం అర్థరాత్రి నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాగనున్న సేల్ లో స్మార్ట్ఫోన్లు, లాప్టాప్స్, పీసీలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, స్టేషనరీ ప్రొడక్ట్స్, బుక్స్, టోయ్స్, యాక్ససరీస్ లపై కంపెనీ డిస్కౌంట్లు అందిస్తోంది. ముఖ్యంగా మోటో జీ ప్లస్, లెనోవా జెడ్2 ప్లస్, ఆపిల్ ఐఫోన్ -5, కిండ్లే పేపర్ వైట్ తదితరాలపై భారీ ఆఫర్లు ప్రకటించింది. మోటో జీ4 ప్లస్ (16 జీబీ) మోటో జీ4 ప్లస్ (16 జీబీ)పై రూ. 2 వేలు తగ్గింపు ధరతో రూ.11,499లకే అందించనుంది. (అసలు ధర రూ.13,499) పాత ఫోన్ తో ఎక్సేంజ్ చేసుకుంటే రూ. 8,550 వరకూ ఆఫర్ అందుబాటులో ఉంది. లెనోవా జెడ్2 ప్లస్ (64 జీబీ) లెనోవా జెడ్2 ప్లస్ (64 జీబీ) ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే అందించిన 2 వేల తగ్గింపుతో రూ.17,499కు లభ్యం. అలాగే రూ. 8,550 దాకా ఎక్సేంజ్ డిస్కౌంట్ అందిస్తోంది. ఐ ఫోన్ 5 ఎస్ (64 జీబీ) యాపిల్ ఐ ఫోన్ 5 ఎస్ (64 జీబీ) రూ.15,999 లకే అందిస్తోంది. అసలు ధర సుమారు రూ.25,000. క్రెడిట్ కార్డు దారులకు ఈఎంఐ ప్రారంభ ధర రూ.1,428గా ఉంది. వన్ ప్లస్ 3 టీ (64 జీబీ) వన్ ప్లస్ 3 టీ (64 జీబీ) రూ. 29,999 లకు అందుబాటులో ఉంది. అసలు ధరపై రూ.2వేల తగ్గింపుతోపాటు రూ.10,550 దాకా ఎక్సేంజ్ డిస్కౌంట్. సాన్యో 43 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ టీవీ మరో స్వీటెస్ట్ డీల్ కూడా అమెజాన్ అందిస్తోంది. సాన్యో 43 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ టీవీపై రూ.8,500ల భారీ తగ్గింపు ఆఫర్ కల్పించింది. అసలు ధర రూ.33,990 కాగా అమెజాన్ ఈ ఆఫర్ ద్వారా రూ.23,490 లకే అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే 18,000 వరకూ ఎక్సేంజ్ డిస్కౌంట్ సౌలభ్యం కూడా ఉంది. ఇవేకాదు.. ఇతర కెమెరాలు, గేమింగ్ కన్సోల్, పేపర్ వైట్స్ పై ఆసక్తికర డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. మరిన్ని వివరాలకు అమెజాన్ అధికారిక వెబ్ సైట్ ను గమనించాల్సిందే.. -
ఈ స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గాయోచ్!
ముంబై: ప్రముఖ చైనా మొబైల్ మేకర్ లెనోవో రెండు స్మార్ట్ ఫోన్(రెండు వేరియంట్ల) ధరలను తగ్గించింది. జెడ్ 2ప్లస్ స్మార్ట్ ఫోన్ ధరలను భారత్ మార్కెట్ లో తగ్గించిన ధరలనుప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం 12 తరువాత నుంచి ఇవి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. లాంచింగ్ ధరనుంచి 2-3 వేలకు తగ్గించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో బ్లాక్ అండ్ వేరియంట్లలో వీటిని అందుబాటులో ఉంచింది. జెడ్ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్ 32జీబీ మోడల్ తగ్గింపు ధర రూ.14,999. లాంచింగ్ ధర రూ.17,999 (తగ్గింపు రూ.3వేలు) జెడ్ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్ 64జీబీ మోడల్ తగ్గింపు ధర రూ.17,499. లాంచింగ్ ధర ధర రూ.19,999, (తగ్గింపు రూ.2500) లెనోవో జెడ్ 2 ప్లస్ ఫీచర్లు డ్యూయల్ సిమ్ 4జీ + 3జీ, 5 హెచ్ డీ స్క్రీన్ 1080x1920 పిక్సల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 820 ప్రాసెసర్ 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ 64 జీబీ 13 ఎంపీ రియర్ కెమెరా 8ఎంపీ ఫ్రంట్ కెమెరా 3500ఎంఏహెచ్ బ్యాటరీ కాగా లెనోవా జెడ్ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్లను గత ఏడాది సెప్టెంబర్ లో భారత మార్కట్లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
లెనోవా కొత్త ఫోన్ రేటెంతంటే...
లెనోవా గతేడాది చైనాలో ఆవిష్కరించిన జుక్ జెడ్2కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను గురువారం భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. జెడ్2 ప్లస్ పేరుతో ఈ ఫోన్‌ను కంపెనీ భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా.. 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా అమెజాన్ ఇండియా ఫ్లాట్‌ఫామ్‌పై ఈ ఆదివారం అర్థరాత్రి నుంచి అందుబాటులో ఉండనుంది. నలుపు, తెలుపు రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది. లెనోవా జెడ్2 ప్లస్ ఫీచర్స్... 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 6.0.1 ఓఎస్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ 1080x1920 పిక్సెల్స్ రెజుల్యూషన్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 3జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నెల్ మెమెరీ 4జీబీ ర్యామ్/ 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ విస్తరణ మెమరీకి అవకాశం లేదు డ్యుయల్ నానో-సిమ్ స్లాట్స్(3జీ, 4జీ సపోర్టు) 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్‌ప్రింట్ స్కానర్