వన్ ప్లస్ 3టీపై క్యాష్ బ్యాక్ ఆఫర్
వన్ ప్లస్ 3టీపై క్యాష్ బ్యాక్ ఆఫర్
Published Tue, May 30 2017 7:05 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM
మార్కెట్లో విశేష ఆదరణ కలిగిన వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్లు ఇక మార్కెట్లో లభ్యం కావడం కష్టమే. ఉత్పత్తిని ఆపివేసిన కంపెనీ స్టాక్ అయిపోయేంతవరకే విక్రయించనున్నట్టు పేర్కొంది. ఉత్పత్తి ఆపివేయాలని నిర్ణయించిన ఈ ఫోన్ పై కంపెనీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే, రూ.1500 వరకు క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. అయితే వన్ ప్లస్ ఇండియా స్టోర్ లో కొనుగోలు చేసిన ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం ఈ ఫోన్ కు సంబంధించిన 64జీబీ వెర్షన్ స్టాక్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని ధర 29,999 రూపాయలు. వన్ ప్లస్ 3 స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడెట్ వెర్షన్ గా వన్ ప్లస్ 3టీ 2016 జూలైలో మార్కెట్లోకి లాంచ్ అయింది. అదేవిధంగా ఈ ఫోన్ అచ్చం వన్ ప్లస్ 3లాగానే ఉంటుంది. ముందస్తు ఫోన్ తో పోలిస్తే కొత్త ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, మెరుగుపరిచిన ఫ్రంట్ కెమెరా దీనిలో ఉన్నాయి. ఉత్పత్తిని ఆపివేస్తున్నప్పటికీ వన్ ప్లస్ 3టీ ఫోనుకు మరింత సాప్ట్ వేర్ అప్ డేట్లను కంటిన్యూగా తీసుకురానున్నట్టూ కంపెనీ చెప్పింది. వన్ ప్లస్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 5ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది.
Advertisement
Advertisement