Festive Season 2021 Offers: Yamaha Scooters Announced, Check Details - Sakshi
Sakshi News home page

Yamaha: బైక్‌ కొనే వారికి యమహా గుడ్‌న్యూస్‌...!

Published Sat, Oct 23 2021 3:14 PM | Last Updated on Sat, Oct 23 2021 3:27 PM

Festive Season Offers On Yamaha Scooters Announced - Sakshi

కొత్తగా బైక్లను కొనే వారికి ప్రముఖ జపానీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం యమహా గుడ్‌న్యూస్‌ను అందించింది. ఫెస్టివల్‌ సీజన్‌లో భాగంగా యమహా స్కూటీలపై సుమారు రూ. 4000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. ఈ ఆఫర్‌ యమహా 125సీసీ స్కూటీ రేంజ్‌పై అందుబాటులో ఉండనుంది. ఫాసినో 125 ఎఫ్‌ఐ(హైబ్రిడ్‌+నాన్‌ హైబ్రిడ్‌), రే జెడ్‌ఆర్‌ 125ఎఫ్‌ఐ, రే జెడ్‌ ఆర్‌ స్ట్రీట్‌ ర్యాలీ 125 ఎఫ్‌ఐ(హైబ్రిడ్‌+నాన్‌ హైబ్రిడ్‌) మోడల్‌ స్కూటీలపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ లభించనుంది. ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 31 వరకు అందుబాటులో ఉండనుంది.


చదవండి:  చైనా బొమ్మల్లో ‘విషం’.. అమెరికా అలర్ట్‌!

యమహా స్కూటీ ధరలు ఇలా..(ఎక్స్‌షోరూమ్‌ ధరలు)

  • యమహా  ఫాసినో 125 ఎఫ్‌ఐ(హైబ్రిడ్‌+నాన్‌ హైబ్రిడ్‌)  ధర రూ. 78,530
  • రే జెడ్‌ ఆర్‌ స్ట్రీట్‌ ర్యాలీ 125 ధర రూ. 79,830


యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ ఫీచర్స్‌..
యమహా బ్లూ కోర్ ఇంజన్ టెక్నాలజీతో కొత్త BS-6-మోడల్‌ ఫాసినో రానుంది, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ (Fi), 125 cc ఇంజిన్‌ను అమర్చారు.  5000 ఆర్‌పీఎమ్‌వద్ద 10.3 ఎన్‌ఎమ్‌ గరిష్ట టార్క్‌ను అందిస్తోంది. ఈ బైక్‌ సుమారు 66కెఎమ్‌పీఎల్‌ మైలేజీను ఇస్తుంది.

చదవండి: ‘ఈవీ’ మేకర్స్‌ ఆశలపై డ్రాగన్‌ నీళ్లు.. సప్లయ్‌ అంతా అటు వైపే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement