
రూపే (RuPay) క్రెడిట్, డెబిట్ కార్డులున్న వారికి శుభవార్త. తమ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక స్కీమ్ కింద రూపే ఇటీవల భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. దాదాపు రెండున్నర నెలలపాటు ఈ కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై భారీగా క్యాష్ బ్యాక్ పొందే వీలు కల్పించింది.
"ఆఫర్ వ్యవధిలో డిస్కవర్ నెట్‌వర్క్ లేదా కెనడా, జపాన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, యూఎస్‌ఏలోని డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నెట్‌వర్క్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లో కార్డులను అంగీకరించే వ్యాపారుల వద్ద చేసిన పాయింట్-ఆఫ్-సేల్ కొనుగోళ్లపై క్వాలిఫైడ్ రూపే కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్‌లు 25 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు" అని రూపే సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ మే 15 నుంచి జూలై 31 వరకు చెల్లుబాటు అవుతుంది. ఆఫర్ వ్యవధిలో ఒక కార్డ్‌కి ఒక లావాదేవీకి గరిష్ట క్యాష్‌బ్యాక్‌గా రూ. 2,500 లభిస్తుంది. రూపే అనేది డెబిట్, క్రెడిట్, ఇంటర్నేషనల్, ప్రీపెయిడ్, కాంటాక్ట్‌లెస్ కార్డ్. భారతీయులందరికీ దేశీయ చెల్లింపు కార్డులను అందించాలనే ఆర్బీఐ దృష్టిని నెరవేర్చడానికి ఎన్‌పీసీఐ వీటిని ప్రారంభించింది.