credit debit cards
-
గుడ్‌న్యూస్.. రెండున్నర నెలలపాటు భారీ క్యాష్ బ్యాక్
రూపే (RuPay) క్రెడిట్, డెబిట్ కార్డులున్న వారికి శుభవార్త. తమ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక స్కీమ్ కింద రూపే ఇటీవల భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. దాదాపు రెండున్నర నెలలపాటు ఈ కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై భారీగా క్యాష్ బ్యాక్ పొందే వీలు కల్పించింది."ఆఫర్ వ్యవధిలో డిస్కవర్ నెట్వర్క్ లేదా కెనడా, జపాన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, యూఎస్ఏలోని డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లో కార్డులను అంగీకరించే వ్యాపారుల వద్ద చేసిన పాయింట్-ఆఫ్-సేల్ కొనుగోళ్లపై క్వాలిఫైడ్ రూపే కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్లు 25 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు" అని రూపే సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ మే 15 నుంచి జూలై 31 వరకు చెల్లుబాటు అవుతుంది. ఆఫర్ వ్యవధిలో ఒక కార్డ్‌కి ఒక లావాదేవీకి గరిష్ట క్యాష్‌బ్యాక్‌గా రూ. 2,500 లభిస్తుంది. రూపే అనేది డెబిట్, క్రెడిట్, ఇంటర్నేషనల్, ప్రీపెయిడ్, కాంటాక్ట్‌లెస్ కార్డ్. భారతీయులందరికీ దేశీయ చెల్లింపు కార్డులను అందించాలనే ఆర్బీఐ దృష్టిని నెరవేర్చడానికి ఎన్పీసీఐ వీటిని ప్రారంభించింది. -
జల్సాలు, విలాసాల కోసం బ్యాంక్‌కు బురిడీ.. ఎంతో తెలుసా?
సాక్షి, సిటీబ్యూరో: డమ్మీ కంపెనీలు.. నకిలీ ఉద్యోగులు... వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు... ఇలా రంగంలోకి దిగిన ఓ ముఠా అందినకాడికి రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకుంది. ఆ డబ్బుతో జల్సాలు చేస్తూ వాయిదాలు చెల్లించకుండా బ్యాంకును నిండా ముంచింది. దీనిపై నాచారం ఠాణాలో కేసు నమోదు కాగా.. రంగంలోకి దిగిన మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దాదాపు 60 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు రికవరీలపై దృష్టి పెట్టడంతో ఒకటి రెండు రోజుల్లో ముఠా అరెస్టు ప్రకటించనున్నారు. ఈ గ్యాంగ్ బ్యాంకును రూ.2.5 కోట్ల మేర బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. బ్యాంకుల పని తీరు తెలియడంతో... వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు జారీలో బ్యాంకుల వద్ద ఉన్న లోటుపాట్లు తెలుసుకున్నారు. భారీ స్థాయిలో క్రెడిట్‌కార్డులు, రుణాలు తీసుకుని మోసం చేస్తే ‘లాభం’ ఉంటుందని భావించారు. నాచారం ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఓ డమ్మీ కంపెనీ ఏర్పాటు చేశారు. వరంగల్‌కు చెందిన పలువురికి మాయమాటలు చెప్పి ఫొటోలు, ఇతర పత్రాలు సేకరించారు. వారందరూ తన సంస్థలో ఉద్యోగులంటూ ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు. ఈ ‘ఉద్యోగుల్లో’ కొందరు రైతులు, చిన్న చిన్న దుకాణాల యజమానులు కూడా ఉన్నారు. వీరంతా ఉన్నత విద్య అభ్యసించినట్లు నకిలీ వివరాలు సృష్టించిన ముఠా సభ్యులు వాళ్లను సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజినీర్లుగా, హెచ్ఆర్ నిర్వాహకులుగా మార్చారు. వారి పేర్లతో రుణాలు, కార్డులు... వారి వివరాలతో గుర్తింపు కార్డులనూ తయారు చేశారు. ఆపై ఆయా పేర్లతో ఓ బ్యాంకులో శాలరీ అకౌంట్స్ తెరిచారు. ఇలా తెరిచిన శాలరీ అకౌంట్స్ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు, చెక్ పుస్తకాలను తమ వద్దే ఉంచుకున్నారు. దాదాపు మూడు నెలల పాటు జీతాలు వేయడంతో పాటు ఆ మొత్తాలను వీరే డ్రా చేసుకుంటూ గడిపారు. ఇలా రూపొందించిన స్టేట్మెంట్స్, బోగస్ ధ్రువీకరణలను ఆధారంగా చేసుకుని బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు పొందారు. కొందరిని మేనేజ్ చేయడం ద్వారా ఈ క్రెడిట్‌కార్డ్స్, రుణాలు మంజూరయ్యేలా చేశారు. ఇలా మొత్తం దాదాపు రూ.2.5 కోట్ల మేర స్వాహా చేశారు. జల్సాలు, విలాసాలు... క్రెడిట్ కార్డుల్లో వాడిన మొత్తాలు, వ్యక్తిగత రుణానికి సంబం«ధించిన ఈఎంఐలు చెల్లింపులు జరగకపోవడంతో బ్యాంకు అధికారులు ఆరా తీశారు. దీంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి మల్కాజ్గిరి ఎస్ఓటీ బృందం రంగంలోకి దిగింది. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో విచారించింది. ఇలా బ్యాంకు నుంచి కాజేసిన సొమ్ముతో ముఠా సభ్యులు జల్సాలు, విలాసాలు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చదవండి: అప్పు కావాలి.. జూనియర్ ఆర్టిస్ట్‌ను నమ్మించి రూమ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి.. -
సిటీ బస్సుల్లోనూ ‘స్వైపింగ్’
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీలో త్వరలో స్వైపింగ్ మిషన్ లు అందుబాటులోకి రానున్నాయి. అన్ని రకాల క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్ల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో పాటు నగరంలోని సిటీ బస్సుల్లో సైతం స్వైపింగ్ ఆధారిత టిక్కెట్ ఇష్యూయింగ్ (టిమ్స్) మిషన్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఈ దిశగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తో పాటు మరికొన్ని బ్యాంకులతోనూ సంప్రదింపులు ప్రారంభించినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పురుషోత్తమ్ ‘సాక్షి’తో చెప్పారు. ఈ నెల 15 కల్లా మొదటి విడుత స్వైపింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన మార్గాలతో పాటు, బస్‌పాస్ కేంద్రాల్లో కూడా స్వైపింగ్ సేవలను ఏర్పాటు చేస్తారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆక్యుపెన్సీ రేషియో పడిపోయింది. తీవ్రమైన నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆర్టీసీ మరిన్ని నష్టాలను మూటగట్టుకోవలసి వచ్చింది. ప్రజల వద్ద చిల్లర అందుబాటులో లేకపోవడం, పెద్ద నోట్లు రద్దు కావడం,కొత్తవి డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులోకి రాకపోవడం వంటి కారణాల దృష్ట్యా ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. ఆక్యుపెన్సీ రేషియే 69 శాతం నుంచి 65 శాతానికి పడిపోయింది. కేవలం నెల రోజుల వ్యవధిలో ఏకంగా 4 శాతం ఓఆర్ తగ్గిపోవడంతో ఆర్టీసీ గ్రేటర్ అధికారులు ఆలస్యంగానైనా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బస్‌పాస్ కేంద్రాల్లో మొదట ఏర్పాటు... గ్రేటర్ హైదరాబాద్‌లో 8 లక్షల స్టూడెంట్ బస్‌పాస్‌లు, మరో 4 లక్షల సాధారణ బస్‌పాస్‌లు ఉన్నాయి. ఈ బస్‌పాస్‌లపైనే ఆర్టీసీకి ఏటా రూ.20 కోట్ల ఆదాయం లభిస్తుంది. పెద్ద నోట్ల రద్దు తరువాత ఒక్కసారిగా రెన్యూవల్స్ పడిపోయాయి. చాలామంది రెగ్యులర్ ప్రయాణికులు తమ పాస్‌లను పునరుద్ధరించుకొనేందుకు వెనుకడుగు వేశారు. మొదట్లో పాత రూ.500, రూ.1000 నోట్లను కేవలంటిక్కెట్లకు మాత్రమే పరిమితం చేసి పాస్‌లకు నిరాకరించారు. దీంతో చాలామంది రెన్యూవల్ చేసుకోలేపోయారు. పెద్ద నోట్లను రద్దు చేసిన 15 రోజుల తరువాత బస్‌పాస్‌లకు సైతం పాతవాటిని స్వీకరించనున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. కానీ అప్పటికే చాలా నష్టం జరిగింది. పెద్ద నోట్ల రద్దు నుంచి ఇప్పటి వరకు కేవలం బస్‌పాస్‌లపైనే రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టాలను అధిగమించేందుకు నగరంలోని అన్ని బస్‌పాస్ కౌంటర్లలో త్వరలో స్వైపింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి విడతలో సికింద్రాబాద్ రెతిఫైల్ బస్‌స్టేషన్, దిల్సుఖ్నగర్, కోఠీ, చార్మినార్, వీఎస్టీ, సనత్‌నగర్, హయత్‌నగర్, ఉప్పల్, తదితర ప్రాంతాల్లోని ప్రధాన కేంద్రాల్లో స్వైపింగ్ సేవలను అందుబాటులోకి తెస్తారు. దశలవారీగా గ్రేటర్‌లోని 63 కౌంటర్లకు విస్తరించనున్నారు. రిజర్వేషన్ కేంద్రాల్లో ఇలా... మహాత్మాగాంధీ,జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లలోని ఆన్ లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(ఓపీఆర్ఎస్) కౌంటర్లలో కూడా 30 స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ప్రయాణికులు ఇక్కడ నుంచి టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. సిటీ నుంచి ప్రతి రోజు 3500 బస్సులు తెలంగాణ, ఏపీ, ముంబయి, చెన్నై, బెంగళూర్, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. 1.3 లక్షల మంది ప్రయాణికులు ఒక్క ఎంజీబీఎస్ నుంచే బయలుదేరుతారు. నోట్ల రద్దు తరువాత దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. దీంతో స్వైపింగ్ యంత్రాల ద్వారా ప్రయాణికులను తిరిగి ఆకట్టుకొనేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. మరోవైపు నగరంలో ఇప్పుడు వినియోగిస్తున్న టిమ్స్ యంత్రాలకు స్వైపింగ్ మిష¯ŒSలను జోడించి క్యాష్‌లెస్ సేవలను అందుబాటులోకి తేనున్నారు.