RuPay cardholders
-
గుడ్‌న్యూస్.. రెండున్నర నెలలపాటు భారీ క్యాష్ బ్యాక్
రూపే (RuPay) క్రెడిట్, డెబిట్ కార్డులున్న వారికి శుభవార్త. తమ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక స్కీమ్ కింద రూపే ఇటీవల భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. దాదాపు రెండున్నర నెలలపాటు ఈ కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై భారీగా క్యాష్ బ్యాక్ పొందే వీలు కల్పించింది."ఆఫర్ వ్యవధిలో డిస్కవర్ నెట్వర్క్ లేదా కెనడా, జపాన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, యూఎస్ఏలోని డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లో కార్డులను అంగీకరించే వ్యాపారుల వద్ద చేసిన పాయింట్-ఆఫ్-సేల్ కొనుగోళ్లపై క్వాలిఫైడ్ రూపే కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్లు 25 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు" అని రూపే సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ మే 15 నుంచి జూలై 31 వరకు చెల్లుబాటు అవుతుంది. ఆఫర్ వ్యవధిలో ఒక కార్డ్‌కి ఒక లావాదేవీకి గరిష్ట క్యాష్‌బ్యాక్‌గా రూ. 2,500 లభిస్తుంది. రూపే అనేది డెబిట్, క్రెడిట్, ఇంటర్నేషనల్, ప్రీపెయిడ్, కాంటాక్ట్‌లెస్ కార్డ్. భారతీయులందరికీ దేశీయ చెల్లింపు కార్డులను అందించాలనే ఆర్బీఐ దృష్టిని నెరవేర్చడానికి ఎన్పీసీఐ వీటిని ప్రారంభించింది. -
ఎస్బీఐ కార్డ్ వినియోగదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ఎస్బీఐ కార్డ్ తన కస్టమర్లకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంది. రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో లింకింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీంతో ఎస్బీఐ రూపే కార్డుదారులు తమ క్రెడిట్ కార్డు నుంచి కూడా వర్తకులకు యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇందుకు రూపే క్రెడిట్ కార్డ్‌ను యూపీఐ యాప్ లతో (పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తదితర) అనుసంధానం చేసుకోవాలని ఎస్బీఐ కార్డ్ సూచించింది. ఎస్బీఐ కార్డు బ్యాంకింగ్ దిగ్గ జం ఎస్బీఐ అనుబంధ సంస్థ అని తెలిసిందే. తాజా నిర్ణయంతో తమ కార్డ్ కస్టమర్లు మరింత సౌకర్యవంతంగా, అవాంతరాల్లేని చెల్లింపుల అనుభవాన్ని పొందొచ్చని వివరించింది. -
రూపే క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు శుభవార్త, ఆ ఛార్జీలు లేవండోయ్!
రూపే క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్. ఇకపై రూపే క్రెడిట్ కార్డు ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు జరిపితే ఎలాంటి ఛార్జీలు ఉండవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. ఈ నిబంధన రూ.2000 వరకు జరిపే లావాదేవీలకు వర్తిస్తుందని తెలిపింది. రూపే క్రెడిట్ కార్డ్ గత నాలుగు సంవత్సరాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. అన్ని ప్రధాన బ్యాంకులు ఈ కార్డు సేవలను అందిస్తున్నాయి. వీటితో పాటు వాణిజ్య, రిటైల్ విభాగాల కోసం ప్రత్యేకంగా ఇంక్రిమెంటల్ కార్డ్‌లు కూడా జారీ చేస్తున్నాయి. ప్రజల ఆర్థిక వ్యవహారాలలో రూపే కార్డ్ విడదీయరాని బంధం ఏర్పరుచుకుంది. ఆర్బీఐ కొత్త నిబంధన.. ఎలంటి చార్జీలు లేవు! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐకి లావాదేవీలకు రూపే క్రెడిట్ కార్డులను లింక్ చేసేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ లింకింగ్ ప్రక్రియ ద్వారా క్రెడిట్ కార్డ్ వినియోగం పెంచాలని భావిస్తోంది ఆర్బీఐ. ఈ నిబంధన వల్ల క్రెడిట్ కార్డులను కస్టమర్లు వారి వర్చువల్ పేమెంట్ అడ్రస్‌కు లింక్ చేస్తారు. దీని ద్వారా.. ఏటీఎం కార్డ్ వినియోగదారలు యూపీఐ లావాదేవీలు ఎలా చేస్తున్నారో, క్రెడిట్ కార్డ్ ఉన్నవారు కూడా తమ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ నుంచి యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. ఈ నిబంధన ద్వారా రూ.2,000 లేదా అంతకన్నా తక్కువ లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తించదు. అంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. దీని వల్ల తక్కువ మొత్తంలో లావాదేవీలు చేసే కస్టమర్లకు, చిరు వ్యాపారులకు కూడా మేలు జరుగుతుంది. చదవండి: Airtel 5g: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదంట! -
20% జీఎస్టీ క్యాష్‌బ్యాక్
న్యూఢిల్లీ: నగదురహిత లావాదేవీలు జరిపే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. రుపే కార్డులు, భీమ్ యాప్, యూపీఐ వ్యవస్థల ద్వారా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో నగదురహిత లావాదేవీలు జరిపే వారికి ప్రయోగాత్మకంగా ప్రోత్సాహకాలివ్వాలని నిర్ణయించింది. రాష్ట్రాలే ఈ చెల్లింపులు జరపాలని శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయించారు. జీఎస్టీఎన్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఓ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి గోయల్ చెప్పారు. ఒక్కసారి ఈ విధానం అమల్లోకి వస్తే రూపే కార్డు, భీమ్ యాప్, యూపీఐల ద్వారా చెల్లింపులు జరిపే వారు జీఎస్టీలో 20% క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇది గరిష్టంగా రూ.100 వరకు ఉండొచ్చు. ‘ఈ ప్రయత్నాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించాం. రూపే కార్డు, భీమ్ యాప్, ఆధార్, యూపీఐ, యూఎస్ఎస్డీ లావాదేవీలు జరిపే వారికి ప్రోత్సాహకాలిస్తాం. ఎందుకంటే వీటిని పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా వాడతారు’ అని ఆయన చెప్పారు. బిహార్ ఆర్థిక మంత్రి సుశీల్ మోదీ నేతృత్వంలోని మంత్రుల బృందం క్యాష్‌బ్యాక్ విధానంపై అధ్యయనం చేసి నివేదికను జీఎస్టీ మండలికి అందజేసింది. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి శివ్‌ప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేశారు. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆర్థిక నిపుణులు స్వాగతిస్తున్నారు. భవిష్యత్తులో 3 జీఎస్టీ శ్లాబులే వస్తుసేవల పన్ను శ్లాబుల సంఖ్య భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు సంజీవ్ సన్యాల్ వెల్లడించారు. ప్రస్తుతమున్న నాలుగు శా>్లబుల (5, 12, 18, 28%) విధానం (పన్నురహిత శ్లాబు మినహాయించి) దీర్ఘకాలంలో మూడు శ్లాబులకు (5, 15, 25%) మారే అవకాశం ఉందన్నారు. 12%, 18% శ్లాబులను కలుపుకుని 15% మార్చే సూచనలున్నాయని భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో సన్యాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. -
నోట్ బ్యాన్ ముందు వీటి పరిస్థితేమిటి?
-
నోట్ బ్యాన్ ముందు వీటి పరిస్థితేమిటి?
ముంబై : పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం ప్రకటించడంతో కార్డు ద్వారా జరిగే లావాదేవీలు ఒక్కసారిగా ఎగబాకాయి. మూలన పడ్డ కార్డులను కూడా కస్టమర్లు బయటికి తీసి వాడుతున్నారు. అయితే నోట్ బ్యాన్‌కు ముందు ఎన్ని కార్డులు ఉన్నాయి. వాటి లావాదేవీలు ఎలా జరిగేయో ఓ సారి పరిశీలిద్దాం.. పెద్దనోట్ల రద్దుకు ముందు 71 కోట్ల మేర డెబిట్ కార్డులు దేశీయంగా ఉండేవట. వాటిలో కేవలం నెలకు 13 కోట్ల డెబిట్ కార్డుల లావాదేవీలు మాత్రమే జరిగేవని తెలిసింది. చాలామంది కార్డు పేమెంట్ చేయడం అయిపోయాక, వాటిని పక్కన పట్టేసేవారట. దీని ప్రకారం సంవత్సరానికి ఆశించిన స్థాయిలో డెబిల్ కార్డుల వాడకం పెరగక, కేవలం 2.2 సార్లు మాత్రమే యూసేజ్ పెరిగేదట. ఇక 30 కోట్ల రూపే కార్డు హోల్డర్స్‌లో 29 కోట్ల హోల్డర్స్ అసలు పాయింట్ ఆఫ్ సేల్స్ వద్ద కాని, కార్డు స్వైప్ మిషన్ల వద్ద కాని వాడేవారు కాదని గణాంకాలు చెబుతున్నాయి.. ఆ గణాంకాలన్ని కేవలం ప్రభుత్వం నోట్లను రద్దు చేసేంత వరకే. ప్రధాని ఎప్పుడైతే నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం ప్రకటించారో అప్పటినుంచి ఇప్పటివరకు రూపే డెబిట్ కార్డుల స్వైప్ 2.5 టైమ్స్ పెరిగినట్టు తెలిసింది. కొన్ని బ్యాంకులకైతే ఎప్పుడూ చూడనంతా కార్డుల వాడకం నాలుగింతల స్థాయిలో నమోదైనట్టు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.. డెబిట్ కార్డుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా.. వాటి వాడకంపై సర్వీసు చార్జీని ఈ ఏడాది చివరివరకు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా పీఓఎస్ టెర్మినల్స్‌ను మరిన్ని ఇన్స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన సంక్షోభానికి వీలుగా కార్డు స్వైప్, డెబిట్ కార్డుల యూసేజ్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో కార్డు స్వైపింగ్ మిషన్ల వద్ద డిమాండ్ 2000 శాతం పెరిగినట్టు ఇండియా మార్ట్ తెలిపింది. వ్యాపారాల వద్ద డెబిట్ కార్డుల లావాదేవీలు, క్రెడిట్ కార్డుల లావాదేవీలు చాలా చౌకగా జరుగుతున్నాయి. దీంతో కార్డుల వాడకం విపరీతంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది.