
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ కార్డ్ తన కస్టమర్లకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంది. రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో లింకింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీంతో ఎస్‌బీఐ రూపే కార్డుదారులు తమ క్రెడిట్ కార్డు నుంచి కూడా వర్తకులకు యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు.
ఇందుకు రూపే క్రెడిట్ కార్డ్‌ను యూపీఐ యాప్ లతో (పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తదితర) అనుసంధానం చేసుకోవాలని ఎస్‌బీఐ కార్డ్ సూచించింది. ఎస్‌బీఐ కార్డు బ్యాంకింగ్ దిగ్గ జం ఎస్‌బీఐ అనుబంధ సంస్థ అని తెలిసిందే. తాజా నిర్ణయంతో తమ కార్డ్ కస్టమర్లు మరింత సౌకర్యవంతంగా, అవాంతరాల్లేని చెల్లింపుల అనుభవాన్ని పొందొచ్చని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment