రెడ్‌మి 4 కి షాక్‌: భారీ బ్యాటరీతో టర్బో 5 | InFocus launches Redmi 4 competitor Turbo 5 with 5000mAh battery at Rs 6,999 | Sakshi
Sakshi News home page

రెడ్‌మి 4 కి షాక్‌: భారీ బ్యాటరీతో టర్బో 5

Published Wed, Jun 28 2017 4:57 PM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

రెడ్‌మి 4 కి షాక్‌: భారీ బ్యాటరీతో టర్బో 5

రెడ్‌మి 4 కి షాక్‌: భారీ బ్యాటరీతో టర్బో 5

న్యూఢిల్లీ: ఇన్‌ఫోకస్‌  బడ్జెట్‌ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ముఖ్యంగా షియామి  క్రేజీ ఫోన్‌  రెడ్‌ మి 4  కి షాకిచ్చే ధరలో  అత్యధిక పోటీ  మిడ్ రేంజ్  సెగ్మెంట్‌ లో దీన్ని అందుబాటులోకి తెచ్చింది.   భారీ బ్యాటరీతో టర్బో 5 పేరుతో  ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్లలో  విడుదల చేసింది.  2, 3 జీబీ ర్యామ్‌తో,  16జీబీ  అంతర్గత మెమరీతో  అందుబాటులోకి తెచ్చింది. 
ఇవి జూలై 4 నుంచి అమెజాన్‌లో లభించనున్నాయని కంపెనీ ఒక ప్రకటనలోతెలిపింది. ఇక ధరల విషయానికి వస్తే 2జీజీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 6,999, 3 జీబీ  వేరియంట్  ధరను రూ .7,999గా నిర్ణయించింది. 
టర్బో 5  ఫీచర్లు:
5.2 అంగుళాల  డిస్‌ప్లే
1280x720  రిజల్యూషన్‌ 
1.25 క్వాడ్- కోర్ మీడియా టెక్ MT6737 ప్రాసెసర్ 
ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆపరేటింగ్‌ సిస్టం
13 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ  సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ  సామర్ధ్యం
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement