two variants
-
కాక్టైల్ వ్యాక్సిన్ సరైంది కాదు
పుణె: ఒక వ్యక్తికి రెండు వేర్వేరు కంపెనీల కోవిడ్–19 వ్యాక్సిన్లు ఇవ్వడానికి తాను వ్యతిరేకమని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుని అందుకున్న సందర్భంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్ల అవసరం లేదని అన్నారు. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా వ్యాక్సిన్లను మిశ్రమంపై ప్రయోగాలకు అనుమతులు ఇచ్చిన అంశంపై ఆయన మాట్లాడుతూ ‘‘ఇలా రెండు రకాల వ్యాక్సిన్లు ఇచ్చాక మెరుగైన ఫలితాలు రాకపోతే సీరమ్, ఇతర కంపెనీ వ్యాక్సినే మంచిది కాదని అనే అవకాశం ఉంది. అదే విధంగా ఆ కంపెనీ కూడా సీరమ్‌ని నిందించే అవకాశం ఉంటుంది’’అని అన్నారు. రెండు వ్యాక్సిన్ల మిశ్రమాల ఫలితాలపై సరైన డేటా కూడా లేదని పూనావాలా గుర్తు చేశారు. రెడ్ టేపిజం బాగా తగ్గింది కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ టేపిజం, లైసెన్స్ రాజ్ బాగా తగ్గిపోయాయని పూనావాలా కొనియాడారు. అంతకు ముందు పారిశ్రామిక రంగం ఎన్నో గడ్డు రోజుల్ని ఎదుర్కొందని చెప్పారు. అధికారుల నుంచి వేధింపులు, అనుమతులు లభించడంలో జాప్యం వంటి వాటితో పారిశ్రామికవేత్తలు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నారని అన్నారు. గతంలో బ్యూరోక్రాట్లు, ఔషధ నియంత్రణ అధికారుల కాళ్ల మీద పడినంత పని అయ్యేదని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ యుద్ధ ప్రాతిపదికన మార్కెట్లోకి రావడమే దీనికి నిదర్శనమని పూనావాలా చెప్పారు. -
రెడ్మి 4 కి షాక్: భారీ బ్యాటరీతో టర్బో 5
న్యూఢిల్లీ: ఇన్ఫోకస్ బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా షియామి క్రేజీ ఫోన్ రెడ్ మి 4 కి షాకిచ్చే ధరలో అత్యధిక పోటీ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. భారీ బ్యాటరీతో టర్బో 5 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. 2, 3 జీబీ ర్యామ్‌తో, 16జీబీ అంతర్గత మెమరీతో అందుబాటులోకి తెచ్చింది. ఇవి జూలై 4 నుంచి అమెజాన్‌లో లభించనున్నాయని కంపెనీ ఒక ప్రకటనలోతెలిపింది. ఇక ధరల విషయానికి వస్తే 2జీజీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 6,999, 3 జీబీ వేరియంట్ ధరను రూ .7,999గా నిర్ణయించింది. టర్బో 5 ఫీచర్లు: 5.2 అంగుళాల డిస్ప్లే 1280x720 రిజల్యూషన్ 1.25 క్వాడ్- కోర్ మీడియా టెక్ MT6737 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆపరేటింగ్ సిస్టం 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం Introducing #InFocusTurbo5 that allows you to #ChargeLessDoMore, starting at just INR 6999!! Open sale: 4th July'17 only on @amazonIN pic.twitter.com/ANwc1N8jJH — InFocus India (@InFocus_IN) June 28, 2017 -
మార్కెట్లోకి ‘మోటో ఎం’
ధర శ్రేణి రూ.15,999–రూ.17,999 ముంబై: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మోటరోలా మొబిలిటీ’ తాజాగా ‘మోటో ఎం’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3 జీబీ ర్యామ్ ఉన్న వేరియంట్ ధర రూ.15,999గా.. 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 4 జీబీ ర్యామ్ ఉన్న వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. ఇక రెండు వేరియంట్లలోనూ 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 2.2 గిగాహెర్ట్›్జ ఆక్టాకోర్ ప్రాసెసర్, 16 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,050 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ వివరించింది. సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు రూ.1,000, పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకునేవారు రూ.2,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చని తెలిపింది. కాగా ఈ స్మార్ట్ఫోన్లు వినియోగదారులకు డిసెంబర్ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. -
రూ.500నోట్లలో తప్పులున్నాయట..!
-
రూ.500నోట్లలో తప్పులున్నాయట..!
బెంగుళూరు: అధిక విలువ కలిగిన నోట్ల రద్దీ అనంతరం ప్రవేశపెట్టిన కొత్త రూ.500నోట్లలో చిన్నపాటి సమస్యలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అత్యవసరంగా రూ.500 నోట్ల ముద్రణ జరగడం వల్ల వాటిలో ప్రింటింగ్ సమస్యలు ఏర్పడినట్లు చెప్పింది. ఆ కారణం చేతనే కొన్ని రూ.500నోట్లకి ఒకదానికి మరొకదానికి బొత్తిగా పొంతన లేకుండా ఉందని తెలిపింది. రూ.500నోట్లు ఆర్బీఐ అన్ని రాష్ట్రాలకు పంపిన విషయం తెలిసిందే. కాగా ఆర్బీఐ పంపిన రూ. 500నోట్లలో ఒక నోటుకు మరో నోటుకు పలు రకాల తేడాలు కనిపించాయి. దీంతో ప్రజలు కలవరానికి గురయ్యారు. నోటులోని గాంధీ బొమ్మ నీడలు కనిపించడం, జాతీయ చిహ్నం, సీరియల్ నంబర్ల అలైన్ మెంట్లలో తేడాలు ఉన్నాయి. వాటిని మామూలుగానే వినియోగించుకోవచ్చని లేదా ఆర్బీఐలో ఇచ్చి కొత్త నోటును పొందొచ్చని పేర్కొంది.