రూ.500నోట్లలో తప్పులున్నాయట..!
రూ.500నోట్లలో తప్పులున్నాయట..!
Published Fri, Nov 25 2016 8:41 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
బెంగుళూరు: అధిక విలువ కలిగిన నోట్ల రద్దీ అనంతరం ప్రవేశపెట్టిన కొత్త రూ.500నోట్లలో చిన్నపాటి సమస్యలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అత్యవసరంగా రూ.500 నోట్ల ముద్రణ జరగడం వల్ల వాటిలో ప్రింటింగ్ సమస్యలు ఏర్పడినట్లు చెప్పింది. ఆ కారణం చేతనే కొన్ని రూ.500నోట్లకి ఒకదానికి మరొకదానికి బొత్తిగా పొంతన లేకుండా ఉందని తెలిపింది.
రూ.500నోట్లు ఆర్బీఐ అన్ని రాష్ట్రాలకు పంపిన విషయం తెలిసిందే. కాగా ఆర్బీఐ పంపిన రూ. 500నోట్లలో ఒక నోటుకు మరో నోటుకు పలు రకాల తేడాలు కనిపించాయి. దీంతో ప్రజలు కలవరానికి గురయ్యారు. నోటులోని గాంధీ బొమ్మ నీడలు కనిపించడం, జాతీయ చిహ్నం, సీరియల్ నంబర్ల అలైన్ మెంట్లలో తేడాలు ఉన్నాయి. వాటిని మామూలుగానే వినియోగించుకోవచ్చని లేదా ఆర్బీఐలో ఇచ్చి కొత్త నోటును పొందొచ్చని పేర్కొంది.
Advertisement