అయోధ్యలో రామ మందిరం నిర్మాణం మొదలు సోషల్ మీడియాలో ప్రతీ వార్త సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలో కొన్ని తప్పుడు వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోటును విడుదల చేయనుందనే వార్త వైరల్‌గా మారింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం, శ్రీరాముడి చిత్రాలతో పాటు రూ.500 నోటు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం రూ.500 నోటుపై జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం ఉండే ప్లేస్‌లో శ్రీరాముడు ఫోటో ఉన్న నోట్లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. దీంతో పలువురు రామభక్తులు జై శ్రీరామ్ అంటూ తెగ ఆనంద పడిపోతున్నారు. జనవరి 22, 2024న శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోట్ల కొత్త సిరీస్‌ను విడుదల చేయబోతోందని, నోటుకు వెనుకవైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ ఫోటోను ఆర్‌బీఐ పొందు పరుస్తోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ బ్యాంకింగ్ రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. కొత్త నోటుకు సంబంధించి ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ఇలాంటి వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు.
Just heard that new 500 Rupees note would be issued on 22nd Jan .. if that’s true it will be a dream come true .. Jai Shree Ram 🙏🌺❤️ pic.twitter.com/Sye3oGpaR3
— 🇮🇳Surya Prakash ☀️🌞🔆🇮🇳 🇺🇸 (@i_desi_surya) January 16, 2024
కాగా జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు హాజరుకాన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో 'అభిజిత్ ముహూర్తం'లో విగ్రహ ప్రతిష్ఠాపనకు మరికొంతమంది కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఇప్పటికే ఆహ్వానాలు కూడా అందుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment