Rs.500 note
-
రూ.500నోట్లపై శ్రీరాముడి చిత్రం.. వైరల్
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం మొదలు సోషల్ మీడియాలో ప్రతీ వార్త సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలో కొన్ని తప్పుడు వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోటును విడుదల చేయనుందనే వార్త వైరల్‌గా మారింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం, శ్రీరాముడి చిత్రాలతో పాటు రూ.500 నోటు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రూ.500 నోటుపై జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం ఉండే ప్లేస్‌లో శ్రీరాముడు ఫోటో ఉన్న నోట్లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. దీంతో పలువురు రామభక్తులు జై శ్రీరామ్ అంటూ తెగ ఆనంద పడిపోతున్నారు. జనవరి 22, 2024న శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోట్ల కొత్త సిరీస్‌ను విడుదల చేయబోతోందని, నోటుకు వెనుకవైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ ఫోటోను ఆర్బీఐ పొందు పరుస్తోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ బ్యాంకింగ్ రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. కొత్త నోటుకు సంబంధించి ఆర్బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ఇలాంటి వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు. Just heard that new 500 Rupees note would be issued on 22nd Jan .. if that’s true it will be a dream come true .. Jai Shree Ram 🙏🌺❤️ pic.twitter.com/Sye3oGpaR3 — 🇮🇳Surya Prakash ☀️🌞🔆🇮🇳 🇺🇸 (@i_desi_surya) January 16, 2024 కాగా జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు హాజరుకాన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో 'అభిజిత్ ముహూర్తం'లో విగ్రహ ప్రతిష్ఠాపనకు మరికొంతమంది కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఇప్పటికే ఆహ్వానాలు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. -
కొత్త రూ.500 నోట్లకు రూ.5000 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన కొత్త రూ.500 నోట్ల ప్రింటింగ్‌కు భారీ ఎత్తునే ఖర్చు అయింది. ఈ నోట్ల ప్రింటింగ్‌కు రూ.5000 కోట్ల వరకు ఖర్చు అయిందని కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభకు తెలిపింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పి. రాధాకృష్ణన్ అందజేసిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడైంది. డిసెంబర్ 8 వరకు 1,695.7 కోట్ల రూ.500 డినామినేషన్ నోట్లను ప్రింట్ చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ నోట్ల మొత్తానికి రూ.4,968.84 కోట్ల వరకు ఖర్చు అయిందని పేర్కొన్నారు. అదేవిధంగా 365.4 కోట్ల రూ.2000 నోట్లను ఆర్బీఐ ప్రింట్ చేసిందని, వీటి కోసం రూ.1,293.6 కోట్లను ఖర్చు చేసినట్టు తెలిపారు. రూ.2000 నోట్లు, రూ.500 నోట్ల అనంతరం చిల్లర సమస్యను పూరించడానికి కొత్తగా తీసుకొచ్చిన రూ.200 నోట్ల ప్రింటింగ్‌కు రూ.522.83 కోట్లు ఖర్చు అయిందని తెలిసింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ.50, 200, 500, 2000 నోట్లను కొత్త డిజైన్‌లో మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్టు మంత్రి లోక్‌సభకు వెల్లడించారు. కాగ, ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి బదిలీ చేసే మిగులు 2016-17 సంవత్సరంలో రూ.35,217 కోట్లకు తగ్గిందని, దీనికి గల ప్రధాన కారణం కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఖర్చులు పెరగడమేనని మరో లిఖిత పూర్వకసమాధానంలో తెలిపారు. 2015-16లో ఆర్బీఐ రూ.65,876 కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేసిందని తన సమాధానంలో వెల్లడించారు. గతేడాది నవంబర్ 8న ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. డిమానిటైజేషన్ అనంతరం ఆర్బీఐ కొత్త కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. ఈ రిమానిటైజేషన్ ప్రక్రియలోనే కొత్తగా రూ.50, 200, 500, 2000 నోట్లు మార్కెట్లోకి వచ్చాయి. -
రూ.500నోట్లలో తప్పులున్నాయట..!
-
రూ.500నోట్లలో తప్పులున్నాయట..!
బెంగుళూరు: అధిక విలువ కలిగిన నోట్ల రద్దీ అనంతరం ప్రవేశపెట్టిన కొత్త రూ.500నోట్లలో చిన్నపాటి సమస్యలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అత్యవసరంగా రూ.500 నోట్ల ముద్రణ జరగడం వల్ల వాటిలో ప్రింటింగ్ సమస్యలు ఏర్పడినట్లు చెప్పింది. ఆ కారణం చేతనే కొన్ని రూ.500నోట్లకి ఒకదానికి మరొకదానికి బొత్తిగా పొంతన లేకుండా ఉందని తెలిపింది. రూ.500నోట్లు ఆర్బీఐ అన్ని రాష్ట్రాలకు పంపిన విషయం తెలిసిందే. కాగా ఆర్బీఐ పంపిన రూ. 500నోట్లలో ఒక నోటుకు మరో నోటుకు పలు రకాల తేడాలు కనిపించాయి. దీంతో ప్రజలు కలవరానికి గురయ్యారు. నోటులోని గాంధీ బొమ్మ నీడలు కనిపించడం, జాతీయ చిహ్నం, సీరియల్ నంబర్ల అలైన్ మెంట్లలో తేడాలు ఉన్నాయి. వాటిని మామూలుగానే వినియోగించుకోవచ్చని లేదా ఆర్బీఐలో ఇచ్చి కొత్త నోటును పొందొచ్చని పేర్కొంది.