మార్కెట్లోకి ‘మోటో ఎం’ | 'Moto M' smartphone 2 variants ,launched in India | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి ‘మోటో ఎం’

Published Wed, Dec 14 2016 1:27 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

మార్కెట్లోకి ‘మోటో ఎం’ - Sakshi

మార్కెట్లోకి ‘మోటో ఎం’

ధర శ్రేణి రూ.15,999–రూ.17,999
ముంబై: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మోటరోలా మొబిలిటీ’ తాజాగా ‘మోటో ఎం’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 32 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 3 జీబీ ర్యామ్‌ ఉన్న వేరియంట్‌ ధర రూ.15,999గా.. 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 4 జీబీ ర్యామ్‌ ఉన్న వేరియంట్‌ ధర రూ.17,999గా ఉంది. ఇక రెండు వేరియంట్లలోనూ 5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 2.2 గిగాహెర్ట్‌›్జ ఆక్టాకోర్‌ ప్రాసెసర్, 16 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3,050 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ వివరించింది. సిటీబ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు యూజర్లు రూ.1,000, పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ చేసుకునేవారు రూ.2,000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చని తెలిపింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులకు డిసెంబర్‌ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement