న్యూడిల్లీ: నోకియా 6 స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సేల్ మరోసారి ప్రారంభం. నోకియా బ్రాండ్ లైసెన్స్ పొందిన హెచ్‌ఎండీ గ్లోబల్ ఎఫర్డబుల్ మిడ్-రేంజ్ హ్యాండ్ సెట్‌ను కొనుగోలు చేయడానికి భారతీయ వినియోగదారులకు అవకాశం కల్పిస్తుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ఇండియాలో ఈ హ్యాండ్ సెట్ ప్రత్యేకంగా కొనుగోలుకు లభ్యమవుతుంది. ఫస్ట్ సేల్ ( ఆగష్టు 23న) సందర్భంగా ఒకే ఒక్క నిమిషంలో మొత్తం ఫోన్‌లన్నీ అమ్ముడుపోయాయి. మరి ఈసారి ఎన్ని నిమిషాల్లో ముగుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రూ.14,999ధరలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ మాట్ట్ బ్లాక్, సిల్వర్, కాపర్ వైట్, టెంపర్డ్ బ్లూ, కలర్ వేరియంట్లలో లభిస్తోంది.
ఆగస్టు 28 న సోమవారం ఇ-కామర్స్ సైట్లో రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ఈ అమ్మకం. అలాగే ఆగస్టు 23 లేదా ఆగస్టు 30న రిజిష్టర్ చేసుకున్నవారు సెప్టెంబరు 6 న జరగబోయే తరువాతి సేల్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరోవైపు ఈ ఫ్లాష్ సేల్ సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందిస్తోంది.
నోకియా 6 సేల్ ఆఫర్స్
అమెజాన్ పే ద్వారా నోకియా 6ను కొనుగోలు పై అమెజాన్ ప్రైమ్ యూజర్లకు రూ.1000 డిస్కౌంట్. కిండ్లే యాప్ ద్వారా ఈ-బుక్స్ పై 80శాతం రాయితీ(దాదాపు రూ.300దాకా) . రూ.2500 మేక్ మై ట్రిప్ డిస్కౌంట్ (రూ. 1,800 హోటళ్లు, విమానాల మీద రూ .700), ఐదు నెలల కాలంలో 45జీబి వొడాఫోన్ ఉచిత 4జీడేటా ఉచితం
నోకియా 6 ఫీచర్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే
రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్
విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం
క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్
3జీబి ర్యామ్
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్
128జీబి వరకు విస్తరించుకునే అవకాశం
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
8 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
నోకియా 6 ష్లాష్ సేల్: స్పెషల్ ఆఫర్స్
Published Thu, Aug 31 2017 9:00 AM | Last Updated on Tue, Sep 12 2017 1:29 AM
Advertisement
Advertisement