షావోమీ బడ్జెట్‌ ఫోన్‌ ఫ్లాష్‌ సేల్‌ | Xiaomi Redmi 6a to go on Sale Amazon and Mi com | Sakshi
Sakshi News home page

షావోమీ బడ్జెట్‌ ఫోన్‌ ఫ్లాష్‌ సేల్‌

Published Wed, Nov 28 2018 12:32 PM | Last Updated on Wed, Nov 28 2018 12:33 PM

Xiaomi Redmi 6a to go on Sale Amazon and Mi com  - Sakshi

షావోమీ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ' రెడ్‌మి 6ఎ' ఫోన్లకు బుధవారం (నవంబరు 28) మరోసారి ఫ్లాష్‌సేల్ నిర్వహించనుంది. అమెజాన్‌, ఎంఐ.కామ్ వెబ్‌సైట్లలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్‌సేల్ ప్రారంభం. బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా ఫోన్ కొనుగోలుపై 5 శాతం ఇన్‌స్టెంట్‌ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే జియో వినియోగదారులకు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,200 ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్‌తోపాటు, షరతులతో 100 జీబీ జియో 4జీ డేటా ఉచితం.

ఇక ఈ ఫోన్ ధరల విషయానికొస్తే.. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.600 పెరిగి రూ.6,599గా ఉంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.500 పెరిగి రూ.7,499 వద్ద లభ్యం.

రెడ్‌మీ 6ఎ ఫీచర్లు
5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
18:9 యాస్పెక్ట్ రేషియో
ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10 హీలియో ఏ
22 2జీబీ ర్యామ్,16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
13ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement