
సాక్షి, ముంబై : ఈ కామర్స్ సంస్థల్లో ప్రత్యేక అమ్మకాల సందడి మొదలైంది. ముఖ్యంగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ను ప్రారంభించింది. నేటి (ఆగస్టు 6) నుంచి కేవలం 48 గంటల పాటు మాత్రమే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లు, యాక్ససరీలు, కిండిల్, ఫైర్ టీవీ స్టిక్స్, ఎల్ఈడీ టీవీలు తదితర అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. అలాగే ట్యాబ్లెట్ పీసీలపై 43 శాతం తగ్గింపు ధరలను అందిస్తోది. టీవీలపై 60 శాతం వరకు డిస్కౌంట్. స్మార్ట్‌బ్యాండ్లు, ఆపిల్ వాచ్‌లను కూడా తగ్గింపు ధరలకు కొనవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు కోనుగోళ్లపై అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్లు మాత్రమే ఈసేల్ లో పాల్గొనే అవకాశం.
స్మార్ట్ ఫోన్లపై కొన్ని ఆకర్షణీయ డీల్స్
ఐఫోన్ 11.. 68,300 రూపాయలు అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్10 8జీబీ ర్యామ్128 జీబీ వేరియెంట్.. 44,999 రూపాయలకు లభ్యం. అసలు ధర 71 వేలు
వన్‌ప్లస్ 8 ప్రో 54,999 రూపాయల నుంచి అందుబాటులో
ఆపిల్ ఐఫోన్ 11 64జీబీ వేరియెంట్ 8,400 రూపాయల తగ్గింపుతో 59,900 లకే లభ్యం
శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ప్లస్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 52,999 రూపాయలు. 12,201 ప్రత్యేక తగ్గింపు
వన్‌ప్లస్ 7టీ ప్రొ 8 జీబీర్యామ్ , 256జీబీ వేరియెంట్ పై 4వేల తగ్గింపుతో 43,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 8 ప్లస్ 64 జీబీ వేరియెంట్ 39,900 ధరకు లభిస్తుండగా, వివో వి19 8 జీబీ, 128 జీబీ ఫోన్ రూ.24,990 ధరకు లభిస్తున్నాయి. అలాగే రెడ్‌మీ కె20 ప్రొ 6జీబీ, 128జీబీ ఫోన్ రూ.22,999 ధరకు, వివో వి17 8జీబీ, 128జీబీ వేరియెంట్ రూ.21,990 ధరకు, శాంసంగ్ గెలాక్సీ ఎం31 రూ.16,499కు లభిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment