జియో ఫోన్ 2 రెండో ఫ్లాష్ సేల్ నేడే | JioPhone 2 second flash sale today | Sakshi
Sakshi News home page

జియో ఫోన్ 2 రెండో ఫ్లాష్ సేల్ నేడే

Published Thu, Aug 30 2018 10:43 AM | Last Updated on Thu, Aug 30 2018 1:04 PM

JioPhone 2 second flash sale today - Sakshi

సాక్షి,ముంబై: రిలయెన్స్ జియో ఫోన్‌ హై-ఎండ్‌ మోడల్‌ జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్‌  మరోసారి కస్టమర్లను ఊరించనుంది. ఈ రోజు (ఆగస్టు30, గురువారం)  మధ్యాహ్నం 12 గంటలకు  జియో ఫోన్2 ఈ ఫ్లాష్‌సేల్   నిర్వహించనున్నారు. మొదటి  సేల్‌ లో  కొద్ది నిమిషాల్లోనే  రికార్డు అమ్మకాలను నమోదు చేసి  ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌గా  నిలిచింది.  ఈ సేల్‌ద్వారా జియో ఫోన్ 2 ను బుక్ చేసుకున్న కస్టమర్లకు వారం రోజుల్లోగా ఆ ఫోన్లను డెలివరీ చేయనున్నారు.

కాగా ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తూ, అట్టహాసంగా లాంచ్‌ చేసిన జియో మొదటి ఫోన్‌కు మంచి స్పందన రావడంతో, హై-ఎండ్ మోడల్ జియో ఫోన్-2 ను  తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జియో ఫోన్‌ 2 ధర  రూ.2,999 మాత్రమే. క్వెర్టీ కీప్యాడ్, 2.4 అంగుళాల హారిజాంటల్ డిస్‌ప్లే,  4జీ సపోర్ట్‌‌, వీఓవైఫై, బ్లూటూత్, వైఫై, జీపీఎస్‌, ఫేస్‌బుక్, యూట్యూబ్, గూగుల్, వాట్సాప్ సపోర్ట్ ఈ ఫోన్ స్పెషాలిటీలు. అంతేకాదు మెమొరీని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు.

జియో ఫోన్-2 ఫీచర్లు
2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే
512 ఎంబీ ర్యామ్
4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ  వరకువిస్తరించుకునేఅవకాశం
2 ఎంపీ రియర్ కెమెరా
వీజీఏ ఫ్రంట్ కెమెరా
2000 ఎంఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement