Jio Phone 2
-
జియో యూజర్స్‌కు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: ‘జియో ఫోన్ దీపావళి 2019 ఆఫర్`కు అనూహ్య స్పందన వచ్చిందని రిలయన్స్ తెలిపింది. రూ.1500 విలువ చేసే జియో ఫోన్‌ను కేవలం రూ.699కే అందించి మూడు వారాల పాటు కొనసాగించిన ఈ ఆఫర్‌కు ఊహించనంత డిమాండ్ వచ్చిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్‌ను మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫీచర్ ఫోన్ వినియోగదారులందరూ దీపావళి ఆఫర్‌ను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని పొడిగించినట్టు పేర్కొంది. 2జీ ఫోన్ వినియోగదారులు ఈ పొడిగింపుతో తమ ఖాతాదారులుగా మారతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 4జీ డివైస్ ప్లాట్ఫామ్లో నంబర్‌వన్‌గా రిలయన్స్ జియో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సూపర్ ఆఫర్ ఇలా.. దీపావళి 2019 ఆఫర్లో భాగంగా జియో ఫోన్‌పై రూ. 800 తగ్గింపు, రూ.700 విలువైన డాటా, మొత్తం కలిపి రూ.1500 ప్రయోజనం ప్రతి జియో ఫోన్ వినియోగదారుడికి అందించింది. కొత్తగా కొనుగోలు చేసే జియోఫోన్‌పై రూ.700 విలువ చేసే డాటాను అందిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారుడి చేసుకునే ఒక్కో రీచార్జ్‌కు అదనంగా రూ.99 విలువైన డాటాను జియో అందిస్తుంది. మొదటి ఏడు రీచార్జ్‌లకు రూ.99 విలువైన డాటాను జియో అదనంగా జతచేయనుంది. ఈ డాటాతో ఎంటర్టైన్మెంట్, పేమెంట్స్, ఈకామర్స్, విద్య, శిక్షణ, రైలు, బస్ బుకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌లు మరెన్నో సౌకర్యాలు పొందుతారు. -
జియో ఫెస్టివ్ గిఫ్ట్‌కార్డ్ బొనాంజా
రిలయన్స్ జియో కస్టమర్లకోసం హ్యాపీ న్యూయర్ బొనాంజా ఆఫర్లు కొనసాగుతున్నాయి. తాజాగా ఫెస్టివ్ గిఫ్ట్ కార్డ్ ఆఫర్‌ను జియో ప్రకటించింది. దీని ద్వారా జియో యూజర్లు జియో కొత్త ఫోన్‌తోపాటు, ఆరు నెలలపాటు ఉచిత వాయిస్, డేటా సర్వీసులను పొందవచ్చు. జియో ఫెస్టివ్ గిఫ్ట్‌కార్డ్ విలువ రూ.1095. ఈ మొత్తం రెండు భాగాలుగా విభజించపడతాయి. రూ. 501, రూ. 594 విలువైన కూపన్లు లభిస్తాయి. రూ.501తో జియో ఫీచర్ ఫోన్‌తో పాటు నెలకు రూ.99 విలువైన కూపన్లు ఆరు నెలలకు అన్నమాట. గిఫ్ట్‌కార్డు కొనుగోలు చేసిన కస్టమర్ దగ్గరలోని జియో స్టోర్‌లోగానీ, రిలయన్స్ డిజిటల్లోగాని పాత జియో ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా కొత్త జియో ఫోన్ 2 కోనుగోలు చేయవవచ్చు. మరోవైపు నేడు ( గురువారం, జనవరి 3) మధ్యాహ్నం 12 గంటలనుంచి జియో ఫీచర్ ఫోన్ -2 ఫ్లాష్ సేల్ కూడా ఉంది. ధర. 2,999 జియో ఫోన్ 2 ఫీచర్లు 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే 512 ర్యామ్ 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వీజీఏ ఫ్రంట్ కెమెరా 2000 ఎంఏహెచ్ బ్యాటరీ Flash Sale Alert! Buy your #JioPhone2 today at 12PM. https://t.co/sAJL85V7RF pic.twitter.com/8KfpJyoo1r — Reliance Jio (@reliancejio) January 3, 2019 -
జియో దివాలీ ధమాకా ఆఫర్
సాక్షి, ముంబై: దీపావళి పండుగ సందర్భంగా జియో ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. భారీ అమ్మకాలతో సునామీ సృష్టించిన జియో ఫోన్ 2ను వినియోగదారులకు మరింత చేరువ చేసింది. తొలిసారిగా జియోఫోన్ ఓపెన్ సేల్‌ను ప్రారంభించింది. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ ఫోన్‌కు ఓపెన్ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు జియో తెలిపింది. ఈ ఫోన్‌ను లాంచ్ చేసిన తరువాత ఓపెన్ సేల్ నిర్వహించడం ఇదే తొలిసారి. నవంబరు 5వతేదీ మధ్యాహ్నం 12గంటలనుంచి మొదలైన ఈ ధమాకా సేల్ నవంబర్ 12న ముగుస్తుంది. అలాగే పేటీఎం ద్వారా ఫోన్ కొనుగోలు చేసినవారికి 2వందల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. జియో ఫోన్ 2 ఫీచర్లు 2.4 ఇంచ్ డిస్ప్లే 512 ఎంబీ ర్యామ్ 4 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 2 ఎంపీ రియర్ కెమెరా వీజీఏ సెల్ఫీ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: 2999 రూపాయలు -
జియో ఫోన్ 2 రెండో ఫ్లాష్ సేల్ నేడే
సాక్షి,ముంబై: రిలయెన్స్ జియో ఫోన్ హై-ఎండ్ మోడల్ జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్ మరోసారి కస్టమర్లను ఊరించనుంది. ఈ రోజు (ఆగస్టు30, గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు జియో ఫోన్2 ఈ ఫ్లాష్‌సేల్ నిర్వహించనున్నారు. మొదటి సేల్ లో కొద్ది నిమిషాల్లోనే రికార్డు అమ్మకాలను నమోదు చేసి ఔట్ ఆఫ్ స్టాక్‌గా నిలిచింది. ఈ సేల్‌ద్వారా జియో ఫోన్ 2 ను బుక్ చేసుకున్న కస్టమర్లకు వారం రోజుల్లోగా ఆ ఫోన్లను డెలివరీ చేయనున్నారు. కాగా ఫీచర్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తూ, అట్టహాసంగా లాంచ్ చేసిన జియో మొదటి ఫోన్‌కు మంచి స్పందన రావడంతో, హై-ఎండ్ మోడల్ జియో ఫోన్-2 ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జియో ఫోన్ 2 ధర రూ.2,999 మాత్రమే. క్వెర్టీ కీప్యాడ్, 2.4 అంగుళాల హారిజాంటల్ డిస్ప్లే, 4జీ సపోర్ట్, వీఓవైఫై, బ్లూటూత్, వైఫై, జీపీఎస్, ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్, వాట్సాప్ సపోర్ట్ ఈ ఫోన్ స్పెషాలిటీలు. అంతేకాదు మెమొరీని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. జియో ఫోన్-2 ఫీచర్లు 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే 512 ఎంబీ ర్యామ్ 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకువిస్తరించుకునేఅవకాశం 2 ఎంపీ రియర్ కెమెరా వీజీఏ ఫ్రంట్ కెమెరా 2000 ఎంఏహెచ్ బ్యాటరీ -
‘జియోఫోన్ 2’ తర్వాత సేల్ ఎప్పుడంటే..
రిలయన్స్ జియో తన జియోఫోన్ హై-ఎండ్ మోడల్ జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్‌ను ప్రారంభించింది. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ జియో వెబ్సైట్లో కొనుగోలుకు అందుబాటులోకి తెచ్చింది. జియో.కామ్, రిలయన్స్ జియో వెబ్సైట్లో ఈ ఫోన్ ఫ్లాష్ సేల్‌ను నిర్వహించింది. జియోఫోన్ 2 తొలి సేల్‌ను ముగించి, తర్వాతి ఫ్లాష్ సేల్ ఆగస్టు 30 మధ్యాహ్నం 12 గంటలకు అని కూడా పేర్కొంది. జియో ఫోన్ 2 ధర 2999 రూపాయలు. వినియోగదారులు తమ పాత ఫీచర్ ఫోన్‌ను ఇచ్చి రూ. 501కు కొత్త జియో ఫోన్‌ను పొందవచ్చు. జియో ఫోన్ 2 వినియోగదారుల కోసం కంపెనీ రూ.49, రూ.99, రూ.153 కింద ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. బుధవారం నుంచి జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది. జియోఫోన్ 2 ఫీచర్లు 2.4 అంగుళాల హారిజంటల్ డిస్ప్లేతో పాటు క్వర్టీ కీప్యాడ్ జీపీఎస్, ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్, వాట్సప్ 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమరీ కార్డుతో 128 జీబీ వరకు) 2000ఎంఏహెచ్ బ్యాటరీ వెనక భాగంలో 2 మెగాపిక్సల్ కెమెరా ముందు భాగంలో వీజీఏ సెల్ఫీ కెమెరా 4జీ ఫీచర్, వీఓవైఫై, బ్లూటూత్, వైఫై ‘భారతదేశంలో డిజిటల్ విప్లవాన్ని పెంచేందుకు జియోఫోన్ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప్రతి ఒక్క భారతీయుడికి ఇంటర్నెట్ యాక్సెస్‌ను కల్పించి, డిజిటల్ లైఫ్ ఎంజాయ్ చేసే అవకాశం కల్పించనున్నాం’ అని జియోఫోన్ 2ను అందుబాటులోకి తీసుకొస్తూ రిలయన్స్ జియో ఈ ప్రకటన చేసింది. జియోఫోన్ లేటెస్ట్ ఫీచర్లు... ఆగస్టు 15 నుంచి ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్‌ను జియోఫోన్ కస్టమర్లు పొందుతున్నారు. వాట్సాప్ కూడా బ్యాచ్ వారీగా అందుబాటులోకి వస్తుంది. జియోటీవీ, జియోసినిమా, జియోమ్యూజిక్, జియోఛాట్ అప్లికేషన్ల ప్రీమియం కంటెంట్‌ను పొందడంతో పాటు, ఉచిత వాయిస్ కాల్స్ కూడా పొందుతారు. వాయిస్ కమాండ్ ఫీచర్ ద్వారా కాల్స్ చేసుకోవడం, మెసేజ్‌లు పంపుకోవడం, ఇంటర్నెట్ సెర్చ్ చేసుకోవడం, మ్యూజిక్ ప్లే చేయడం, వీడియోలు చూడటం వంటివి చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్, ఇతర ముఖ్యమైన సర్వీసుల యాక్సస్‌ను పొందవచ్చు. -
జియోఫోన్: యూట్యూబ్ వస్తోంది, మరి వాట్సాప్..
జియోఫోన్.. ఫీచర్ ఫోన్ మార్కెట్లో ఇదో అద్భుతం. స్మార్ట్‌ఫోన్ ప్రముఖ యాప్స్ అయిన వాట్సాప్, యూట్యూబ్‌లను ఈ ఫీచర్ ఫోన్లో అందించడానికి కంపెనీ సిద్ధమైన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఈ యాప్స్ జియోఫోన్‌లో అందుబాటులోకి వస్తాయని 41వ వార్షిక జనరల్ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. కానీ నేటి నుంచి జియోఫోన్‌లో యూట్యూబ్ యాప్ మాత్రమే అందుబాటులోకి వస్తోంది. జియోఫోన్ యూజర్లు ఎంతో కాలంగా వేచిచూస్తున్న వాట్సాప్ యాప్ మాత్రం అందరికీ అందుబాటులోకి రాదని తెలిసింది. ప్రస్తుతం కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ప్రముఖ మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేసి, ఆ అనంతరం కొన్ని రోజుల తర్వాత మిగతా వారికి అందించాలని కంపెనీ చూస్తోందని వెల్లడైంది. దీని కోసం జియోఫోన్ యూజర్లు కొంతకాలం పాటు వేచిచూడాల్సిందేనని గాడ్జెట్స్ 360 రిపోర్టు చేసింది. బ్యాచ్‌ల వారీగా వాట్సాప్‌ను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. యూట్యూబ్‌ను మాత్రం జియో యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు జియోఫోన్ హై ఎండ్ మోడల్ జియోఫోన్ 2 ను కూడా నేటి నుంచే బుక్ చేసుకోవచ్చు. రేపటి నుంచి ఈ ఫీచర్ ఫోన్ జియో.కామ్‌లో ఫ్లాష్ సేల్‌లో లభ్యమవుతుంది. జియోఫోన్ యూజర్ల కోసం గూగుల్ అసిస్టెంట్‌ను కూడా కొన్ని నెలల కిందటే గూగుల్ తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్స్ వెర్షన్‌ను కూడా ఈ ఫీచర్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్, యూట్యూబ్ యాప్‌లను మీ వాయిస్ కమాండ్, టెక్ట్స్‌తో ఎలా వాడాలో రిలయన్స్ జియో డైరెక్టర్లు ఆకాశ్, ఇషా అంబానీలు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. యూట్యూబ్‌లో వీడియోను సెర్చ్ చేసుకునేందుకు మీ వాయిస్‌తో సెర్చ్ చేసుకోవచ్చు. అయితే యూట్యూబ్ వీడియోలను ఆఫ్‌లైన్‌గా చూసుకోవడానికి డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం మాత్రం లేదు. టీ9 కీప్యాడ్‌ను వాడుతూ యూజర్లు వాట్సాప్‌లో మెసేజ్‌ను టైప్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫోన్ యూజర్లకు వాట్సాప్ పేమెంట్స్ ఆప్షన్ అందుబాటులో లేదు. -
ఫ్లాష్ సేల్కు వస్తున్న జియోఫోన్ 2
సాక్షి, ముంబై: జియోఫోన్ హైఎండ్ మోడల్ జియోఫోన్ 2 కోసం ఎదురు చూస్తున్నఅభిమానులకు గుడ్‌న్యూస్. రేపటి నుంచే ఈ డివైజ్ బుకింగ్‌కు అందుబాటులోకి వస్తుంది. ఎల్లుండి అంటే ఆగస్టు 16న ఈ ఫోన్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఆగస్టు 16న మధ్యాహ్నం 12 గంటలకు జియో.కామ్‌లో ఈ ఫీచర్ ఫోన్ ఫ్లాష్ సేల్‌ను నిర్వహించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది జూలైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ జియో ఫోన్ 2ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆగస్టు 15 నుంచి మై జియో యాప్, జియో.కామ్ ద్వారా ఈ ఫోన్‌ను బుకింగ్‌కు అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు. జియో ఫోన్2 ధరను రూ .2999గా రిలయన్స్ నిర్ణయించింది. యూ ట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి ప్రముఖ నెట్వర్కింగ్ సైట్లకు కూడా అనుమతి ఉంది. దీంతోపాటు దేశంలో జియో జిగాఫైబర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా రేపే ప్రారంభం కానుంది. జియోఫోన్ 2 స్పెసిఫికేషన్లు 2.4 అంగుళాల డిస్ ప్లే 240 X 320 పిక్సల్స్ రిసల్యూషన్ 4 జీబీ, 512ఎంబీ స్టోరేజ్ 128జీబీవరకు విస్తరించుకునే అవకాశం 2ఎంపీ రియర్ కెమెరా 0.3 ఎంపీ సెల్పీ కెమెరా 2000 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షిక సమావేశంలో ముకేష్ అంబానీ గత ఏడాది చివరినాటికి 124 మిలియన్ల నుంచి 210 మిలియన్లకు పెరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిక్స్డ్ లైన్ బ్రాండ్ బాండ్ సర్వీసులు జియోగిగా ఫైబర్‌ను కూడా ప్రకటించారు. -
మాన్సూన్ హంగామా ఆఫర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవలే తన 41వ వార్షిక సాధారణ సమావేశాన్ని ముంబైలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కంపెనీ పెద్ద పెద్ద ప్రకటనలో చేసింది. జియో గిగాఫైబర్ లాంచింగ్, జియో ఫోన్ హై ఎండ్ మోడల్ జియో ఫోన్2 విడుదల, జియోఫోన్‌లో వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ యాప్‌లు అందుబాటు వంటి వాటిని ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో జియోఫోన్ మాన్సూన్ హంగామా ఆఫర్ కూడా ఒకటి. అత్యంత తక్కువ ధరకు ఎవరైతే జియోఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికే ఈ జియోఫోన్ మాన్సూన్ హంగామా ఆఫర్. పాత ఫీచర్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే పొందవచ్చు. జూలై 21 నుంచి జియో మాన్సూన్ హంగామా ఆఫర్ అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ రిజిస్ట్రేషన్లను కంపెనీ ప్రారంభించింది. ‘రిజిస్టర్ యువర్ ఇంటరెస్ట్’ గా జియో ఈ ప్రాసెస్‌ను మొదలుపెట్టింది. ఈ ఆఫర్‌ను రిజిస్ట్రర్ చేయాలనుకునే వారు, జియో.కామ్ లేదా మైజియో యాప్‌లోకి లాగిన్ అయి, ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దానిలో అడిగిన వివరాలను నమోదు చేసిన అనంతరం, నియమ, నిబంధనలను అంగీకరించి, వ్యాపారం లేదా వ్యక్తిగతం అనే దాన్ని క్లిక్ చేయాలి. ఆ అనంతరం సబ్మిట్ బటన్ నొక్కాలి. ఈ ప్రక్రియ అనంతరం జియో మాన్సూన్ హంగామా ఆఫర్‌ను రిజిస్టర్ చేసుకున్నట్టు మీ ఈ-మెయిల్‌కు లేదా ఎస్ఎంఎస్ రూపంలో మెసేజ్ వస్తుంది. జియో తొలుత మార్కెట్లో సిమ్ కార్డులను లాంచ్ చేసినప్పటి నుంచి ఇదే ప్రక్రియను అనుసరిస్తోంది. ఎవరైతే ముందస్తు బుకింగ్ లేదా రిజిస్టర్ చేసుకుంటారో వారికి ఇతరుల కంటే ముందుగా ప్రాధాన్యత ఇస్తారు. జియోఫోన్ కూడా ఇదే ప్రక్రియను రిలయన్స్ అనుసరించింది. అయితే తాజాగా చేపడుతున్న రిజిస్ట్రేషన్లు కస్టమర్లను క్యూలైన్ల నుంచి కాపాడలేవని తెలుస్తోంది. ఇది, కేవలం ఆఫర్ అందుబాటులోకి రావడానికి ముందే ఎన్ని డివైజ్‌లు అందుబాటులో ఉంటున్నాయో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిసింది. ఈ రిజిస్ట్రేషన్‌తో ఆఫర్ లైవ్‌లోకి వచ్చే సమయంలో యూజర్లకు నోటిఫికేషన్ అలర్ట్‌ను కంపెనీ పంపిస్తుందని, దీంతో స్టోర్ వద్దకు వెళ్లి త్వరగా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు వీలవుతుందని తెలిసింది. ఆధార్ ఐడీ, పాస్‌పోర్ట్ సైజు ఫోటోను జియో స్టోర్‌కు తీసుకెళ్తే, మాన్సూన్ ఆఫర్లో జియోఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. -
జియోఫోన్-2ను ప్రవేశపెట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్
-
జియోఫోన్ 2 ఫీచర్లు ఇవే!
ముంబై : ప్రస్తుతం ఫీచర్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న జియోఫోన్‌కు సక్ససర్‌గా హై-ఎండ్ మోడల్ జియోఫోన్ 2ను రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పాత ఫోన్‌కు స్మార్టర్‌గా ఈ కొత్త జియోఫోన్ 2ను మార్కెట్లోకి వచ్చింది. అత్యాధునిక స్పెషిఫికేషన్లు, మెరుగైన డిజైన్‌తో జియోఫోన్ 2ను రిలయన్స్ రూపొందించింది. 25 మిలియన్ పాత జియోఫోన్లను విక్రయించినట్టు ప్రకటించిన అనంతరం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా, కొడుకు ఆకాశ్ జియోఫోన్ 2ను లాంచ్ చేశారు. జియోఫోన్ 2 స్పెషిఫికేషన్లు.. డిస్ప్లే : అంతకముందు జియోఫోన్‌కు ఉన్న డిస్ప్లే మాదిరిగానే 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే. కీప్యాడ్ ఏరియాలో మార్పు. బ్లాక్‌బెర్రీ లాంటి క్వర్టీ కీప్యాడ్ సాఫ్ట్వేర్ : జియోఫోన్ 2, అమెరికా కంపెనీ కిఓఎస్ టెక్నాలజీస్ చెందిన కిఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది ర్యామ్ : 512 ఎంబీ ర్యామ్ స్టోరేజ్ : 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ బ్యాటరీ : 2000 ఎంఏహెచ్ బ్యాటరీ కనెక్టివిటీ : వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ వైఫై, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో వెనుక కెమెరా : 2 మెగాపిక్సెల్ సెన్సార్ ముందు కెమెరా : వీజీఏ సెన్సార్ స్పెషల్ ఫీచర్లు... క్వర్టీ కీప్యాడ్ కొత్త జియోఫోన్ 2లో కీలక ఫీచర్. జియోఫోన్‌తో పోలిస్తే మొత్తం డిజైన్‌ను రిలయన్స్ మార్చింది. జియోఫోన్ బేసిక్ ఫీచర్ ఫోన్ మాదిరి ఉంటే, జియోఫోన్ 2 ఎంట్రీ-లెవల్ ఫోన్ల మాదిరిగా ఉంది. జియోఫోన్‌కు హై-ఎండ్ వెర్షన్ జియోఫోన్ 2గా కంపెనీ అభివర్ణించింది. జియోఫోన్ 2 డ్యూయల్ సిమ్ కార్డు సపోర్టుతో మార్కెట్లోకి వచ్చింది. ప్రైమరీ సిమ్ కార్డు స్లాట్ లాక్ చేసి ఉంటుంది. దాన్ని స్పెషల్‌గా జియో సిమ్ కోసమే రూపొందించారు. రెండో సిమ్ కార్డు స్లాట్ అన్‌లాక్‌తో ఉంది. దీనిలో ఇతర నెట్‌వర్క్‌లు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సిమ్‌లు వేసుకోవచ్చు. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ పాపులర్ సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్‌ను ఈ ఫోన్లో అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 15 నుంచి జియోఫోన్ 2 విక్రయాలు కమర్షియల్‌గా ప్రారంభమవుతాయి. జియోఫోన్ 2 లో కూడా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. జియోఫోన్ కోసం మాన్సూన్ హంగామా ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ ఆఫర్ ద్వారా కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే, పాత ఫీచర్ ఫోన్ల ఎక్స్చేంజ్లో కొనుగోలు చేయొచ్చని ప్రకటించారు. ఈ ఆఫర్ జూన్ 21 నుంచి ప్రారంభమవుతుంది. జియోఫోన్ 2 ధర : రూ.2999కే ఈ ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. బ్లాక్ రంగులో ఈ ఫోన్ లభ్యమవుతుంది. జియోఫోన్ 2 రిటైల్ పార్టనర్లు ఎవరన్నది రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించలేదు.