సాక్షి, న్యూఢిల్లీ: జియో తన అభిమానులకు మరో శుభవార్త అందించింది. జియోఫోన్ పేరుతో ఉచితంగా ఫోన్ అందిస్తామని గతంలో ప్రకటించిన జియో తన తొలిసేల్‌ను గత ఆగస్టులో నిర్వహించింది. ఈ బిగ్‌సేల్‌లో మూడు రోజుల్లో ఏకంగా దాదాపు 60 మిలియన్ల ఫోన్‌లను అమ్మిన జియో టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది. తొలి విడుత ఫోన్‌ల డెలివరీ సైతం దాదాపు పూర్తి కావచ్చింది. దీంతో రెండో సేల్ నిర్వహించాలని జియో భావిస్తోంది.
దీనికి సంబంధించిన ప్రకటనను త్వరలో విడుదల చేస్తామని జియో ప్రతినిధి వెల్లడించారు. రెండో దశ జియో ఫోన్ బుకింగ్స్‌ను దీపావళి తరువాత ప్రారంభిచవచ్చని, అది అక్టోబర్ చివర లేదా నవంబర్ మొదటి వారం ఉండొచ్చని జియో వర్గాలు ప్రకటించాయి. గత జులైలో జరిగిన రియలన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఫోన్ ఉచితమే అయినప్పటికీ రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత ఆ డబ్బును వినియోగదారులకు వాపసు ఇస్తామని జియో ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment