Jio Phone Bookings
-
జియో ఫోన్ కొనుగోలు దారులకు శుభవార్త!
వినియోగదారులకు జియో శుభవార్త చెప్పింది. ఇన్ని రోజులు ఆన్‌లైన్‌కే పరిమితమైన జియో ఫోన్ నెక్ట్స్ అమ్మకాలు..ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో ప్రారంభమైనట్లు తెలిపింది. కొనుగోలు దారులు దగ్గరలో ఉన్న జియో స్టోర్లలో ఈ జియో ఫోన్‌ను కొనుగోలు చేయోచ్చని సూచించింది. నవంబర్ 4న విడుదల జియో సంస్థ గతేడాది నవంబర్ 4న మార్కెట్లోకి జియో ఫోన్ నెక్ట్స్‌ను విడుదల చేసింది. తొలత ఈ ఫోన్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం కొనుగోలు దారులు ముందస్తుగానే రిజస్ట్రర్ చేసుకుంటేనే ఈ బడ్జెట్ ఫోన్ ను సొంతం చేసుకునే అవకాశం కల్పిచ్చింది. అయితే ఇప్పుడు ఇదే ఫోన్‌ను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయోచ్చని జియో ప్రతినిధులు తెలిపారు. ఫోన్ ధర ఎంతంటే? ఇక ఈ ఫోన్ ధరల విషయానికొస్తే ఫోన్ ధర రూ.6,499 ఉండగా.. ఫోన్ కొనుగోలు కోసం ఈఎంఐ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. డౌన్ పేమెంట్ కింద రూ.1,999, రూ.501 ప్రాసెసింగ్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ ఫీచర్లు ♦ డిస్ప్లే: 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్ (720 X 1440 ) ♦ స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ♦ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ♦ ర్యామ్,స్టోరేజ్ : 2జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు ♦ బ్యాక్ కెమెరా: 13 ఎంపీ ♦ ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ ♦ బ్యాటరీ: 3500 ఎంఏహెచ్ ♦ సిమ్ స్లాట్లు: 2 (డ్యూయల్ సిమ్) ♦ సిమ్ పరిమాణం: నానో ♦ కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం ♦ సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్ చదవండి: ముఖేష్ అంబానీ ముందు చూపు మామూలుగా లేదుగా..ఇక లాభాలే లాభాలు!! -
రూ.500కే జియో స్మార్ట్ ఫోన్ ! షరతులు వర్తిస్తాయి
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీయనుంది. ప్రపంచంలోనే అతి చవకైన ఫోన్ 'జియో ఫోన్ నెక్ట్స్' ఫోన్ అమ్మకాలపై సరికొత్త బిజినెస్ మోడల్‌ను అప్లయ్ చేయనుంది. ఈ 4జీ జియో ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వీలుగా అతి తక్కువ ధరకే అంటే ఫోన్ ధరలో పదోవంతుకే అందివ్వనుంది. 10వేల కోట్ల టార్గెట్ వినాయకచవితి పండగ సందర్బంగా జియో నెక్ట్స్ మార్కెట్లోకి రానుంది. రాబోయే ఆరు నెలల్లో 5 కోట్ల హ్యాండ్ సెట్లు అమ్మడం ద్వారా ఏకంగా రూ. 10 వేల కోట్ల రూపాయల బిజినెస్ చేయాలని రిలయన్స్ జియో లక్క్ష్యంగా పెట్టుకుంది. దీనికి తగ్గట్టు భారీ స్థాయిలో కొనుగోల్లు జరగాలంటే ఫైనాన్స్ సహకారం ఉండటం అవసరం . దీంతో పలు నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫోన్ ధరలో కేవలం పదిశాతం సొమ్ము చెల్లించి హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా కొనుగోలుదారులు చెల్లించే వీలును కల్పిస్తున్నారు. దీనికి అనుగుణంగా రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ భారీ ఎత్తున ప్లాన్ వేస్తున్నారు. ఇందుకోసం ఎస్బీఐ,పిరమల్ క్యాపిటల్, ఐడీఎఫ్సీ ఫస్ట్ అస్యూర్, డీఎంఐ ఫైనాన్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. షరతులు ఇలా వర్తిస్తాయి! సాధారణంగా ఫైనాన్స్ కంపెనీల సాయంతో ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే ఫోన్ ధరలో సగం మొత్తాన్ని డౌన్ పేమెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. కానీ జియో ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే అలాకాదు. రూ.5వేల ఫోన్ ధరపై రూ.500, రూ.7వేల ఫోన్ ధరపై రూ.700 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: జియో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ ఎప్పుడంటే? -
జియో ఫోన్ సెకండ్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా?
-
జియో ఫోన్ సెకండ్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: జియో తన అభిమానులకు మరో శుభవార్త అందించింది. జియోఫోన్ పేరుతో ఉచితంగా ఫోన్ అందిస్తామని గతంలో ప్రకటించిన జియో తన తొలిసేల్‌ను గత ఆగస్టులో నిర్వహించింది. ఈ బిగ్‌సేల్‌లో మూడు రోజుల్లో ఏకంగా దాదాపు 60 మిలియన్ల ఫోన్లను అమ్మిన జియో టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది. తొలి విడుత ఫోన్ల డెలివరీ సైతం దాదాపు పూర్తి కావచ్చింది. దీంతో రెండో సేల్ నిర్వహించాలని జియో భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటనను త్వరలో విడుదల చేస్తామని జియో ప్రతినిధి వెల్లడించారు. రెండో దశ జియో ఫోన్ బుకింగ్స్‌ను దీపావళి తరువాత ప్రారంభిచవచ్చని, అది అక్టోబర్ చివర లేదా నవంబర్ మొదటి వారం ఉండొచ్చని జియో వర్గాలు ప్రకటించాయి. గత జులైలో జరిగిన రియలన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఫోన్ ఉచితమే అయినప్పటికీ రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత ఆ డబ్బును వినియోగదారులకు వాపసు ఇస్తామని జియో ప్రకటించిన విషయం తెలిసిందే. -
వాటిల్లో జియో ఫోన్ బుకింగ్స్ ప్రారంభం
జీరోకే జియో ఫోన్... ప్రస్తుతం ఫీచర్ ఫోన్ మార్కెట్‌ను ఊరిస్తోన్న డివైజ్. ఈ ఫోన్ ఎప్పుడెప్పుడు తమ చేతులోకి వచ్చేస్తుందా అంటూ ఎదురుచూడని కస్టమర్లంటూ లేరు. ఆఫ్‌లైన్, ఆన్లైన్ రెండింట్లోనూ అధికారికంగా ఆగస్టు 24 నుంచి బుకింగ్స్‌ను చేపడతామని ఫోన్ లాంచింగ్ రోజే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. కానీ ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని కొంతమంది ఆఫ్‌లైన్ రిటైలర్లు 10 రోజుల ముందుగానే ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లను ప్రారంభించినట్టు గాడ్జెట్స్ 360 రిపోర్టు చేసింది. ఆఫ్‌లైన్ బుకింగ్ ప్రాసెస్‌లో డాక్యుమెంట్లను సమర్పించి, ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చని రిటైలర్లు చెబుతున్నట్టు పేర్కొంది.. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ను కస్టమర్ల చేతికి అందించేటప్పుడే రూ.1500 రీఫండబుల్ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుందని తెలిసింది. దీంతో ప్రీ-ఆర్డర్ చేసుకునేటప్పుడే ఈ మొత్తాన్ని చెల్లించాల్సినవసరం లేదు. జియోఫోన్ బుకింగ్ విత్ ఆధార్ నెంబర్: జియోఫోన్‌ను బుక్ చేసుకునేటప్పుడు, మీ ఆధార్ కార్డును అధికారిక జియో రిటైలర్ వద్ద సమర్పించాల్సి ఉంటుంది. ఈ అధికారిక జియో రిటైలర్ మీ పక్కనున్న స్టోర్ కావచ్చు లేదా రిలయన్స్ జియో అవుట్లెట్ అయినా అయి ఉండొచ్చు. దేశవ్యాప్తంగా వ్యక్తిగత వినియోగదారులకు ఒక్కో ఆధార్ నెంబర్‌కు కేవలం ఒకే ఒక్క యూనిట్‌ను ప్రీఆర్డర్ చేసుకోవడానికి వీలుంటుంది. వివిధ స్టోర్లలో పలు ఫోన్లను బుక్ చేసుకోవడానికి వీలుండదు. ఆధార్ నెంబర్‌ను సమర్పించాక, జియో సెంట్రలైజడ్ సాఫ్ట్‌వేర్‌లో మీ వివరాలన్నీ నమోదవుతాయి. మీకో టోకెన్ నెంబర్ కూడా అందిస్తారు. ఫోన్‌నే స్వీకరించే ముందు మీరు దాన్ని సమర్పించాల్సి ఉంటుంది. జియో డెలివరీ డేట్ : ప్రస్తుతం జియో ఫోన్ ఆర్డర్‌ను ప్లేస్ చేసిన వారికి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4 మధ్యలో ఈ ఫోన్‌ను డెలివరీ చేస్తారు. ఒకవేళ బుకింగ్స్‌ను వచ్చే వారాల్లో మరింత ఎక్కువైతే, డెలివరీ తేదీలను పొడిగించే అవకాశముంది. అయితే సెప్టెంబర్‌లో జియో ఫోన్‌ను కస్టమర్ల చేతికి అందిస్తామని తెలిపిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, కచ్చితమైన తేదీని వెల్లడించలేదు. వారంలో 50 లక్షల ఫోన్లను డెలివరీ చేయనున్నట్టు మాత్రమే తెలిపారు. మైజియో యాప్ ద్వారా మాత్రం ఆగస్టు 24 నుంచి ఈ హ్యాండ్సెట్ ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయి.