JioPhone Next Now Available at an Offline Store - Sakshi
Sakshi News home page

జియో ఫోన్‌ కొనుగోలు దారులకు శుభవార్త!

Published Sun, Mar 6 2022 1:15 PM | Last Updated on Sun, Mar 6 2022 2:07 PM

jiophone Next Now Available At An Offline Store - Sakshi

వినియోగదారులకు జియో శుభవార్త చెప్పింది. ఇన్ని రోజులు ఆన్‌లైన్‌కే పరిమితమైన జియో ఫోన్‌ నెక్ట్స్‌ అమ్మకాలు..ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో ప్రారంభమైనట్లు తెలిపింది. కొనుగోలు దారులు దగ్గరలో ఉన్న జియో స్టోర్‌లలో ఈ జియో ఫోన్‌ను కొనుగోలు చేయోచ్చని సూచించింది. 

నవంబర్‌ 4న విడుదల 
జియో సంస్థ గతేడాది నవంబర్‌ 4న మార్కెట్‌లోకి జియో ఫోన్‌ నెక్ట్స్‌ను విడుదల చేసింది. తొలత ఈ ఫోన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం కొనుగోలు దారులు ముందస్తుగానే రిజస్ట్రర్‌ చేసుకుంటేనే ఈ బడ్జెట్‌ ఫోన్‌ ను సొంతం చేసుకునే అవకాశం కల్పిచ్చింది. అయితే ఇప్పుడు ఇదే ఫోన్‌ను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయోచ్చని జియో ప్రతినిధులు తెలిపారు. 

ఫోన్‌ ధర ఎంతంటే?
ఇక ఈ ఫోన్‌ ధరల విషయానికొస్తే ఫోన్‌ ధర రూ.6,499 ఉండగా.. ఫోన్‌ కొనుగోలు కోసం ఈఎంఐ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. డౌన్‌ పేమెంట్‌ కింద రూ.1,999, రూ.501 ప్రాసెసింగ్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 

ఫోన్‌ ఫీచర్లు

డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ రిజెల్యూషన్ (720 X 1440 )

స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్‌ ప్రింట్ కోటింగ్

ప్రాసెసర్‌:  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్‌

 ర్యామ్‌,స్టోరేజ్‌ : 2జీబీ ర్యామ్‌, 32 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌ 512 జీబీ వరకు

బ్యాక్‌ కెమెరా: 13 ఎంపీ

ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ

బ్యాటరీ: 3500 ఎంఏహెచ్‌

సిమ్‌ స్లాట్లు: 2 (డ్యూయల్ సిమ్)

సిమ్‌ పరిమాణం: నానో

కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్‌బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం

సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్

చదవండి: ముఖేష్‌ అంబానీ ముందు చూపు మామూలుగా లేదుగా..ఇక లాభాలే లాభాలు!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement