Jio Phone Next
-
ఎక్ఛేంజ్: జియో ఫోన్ నెక్ట్స్‌పై బంపరాఫర్!
యూజర్లకు జియో బంపరాఫర్ ప్రకటించింది. ఎక్ఛ్సేంజ్ ఆఫర్‌పై జియో ఫోన్ నెక్ట్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ పరిమిత కాల ఎక్ఛ్సేంజ్ ఆఫర్లో కొనుగోలు దారులు రూ.4,499తో జియో ఫోన్ నెక్ట్స్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్లో కొనుగోలు దారులు 4జీ ఫీచర్‌ఫోన్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను ఎక్ఛేంజ్ చేసుకొని జియో ఫోన్ నెక్ట్స్‌ను సొంతం చేసుకోవచ్చని జియో ప్రతినిధులు తెలిపారు. ఒకవేళ వద్దనుకుంటే రూ.6,499కే జియో ఫోన్ నెక్ట్స్ కొనుగోలు చేయోచ్చని జియో సంస్థ వెల్లడించింది. జియో ఫోన్ నెక్ట్స్ ఫీచర్లు డిస్ప్లే: 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్ (720 X 1440 ) స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ర్యామ్,స్టోరేజ్ : 2జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు బ్యాక్ కెమెరా: 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ బ్యాటరీ: 3500 ఎంఏహెచ్ సిమ్ స్లాట్లు: 2 (డ్యూయల్ సిమ్) సిమ్ పరిమాణం: నానో కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్ అంతేకాదు ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్ ను గూగుల్ డెవలప్ చేసింది. జియో ఫోన్ నెక్ట్స్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ పెద్దగా చదవడం, ట్రాన్స్‌లేట్ చేసుకునేలా ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. జియో ఫోన్ నెక్ట్స్ మై జియో, జియో సినిమా,జియో టీవీ, జియో సావన్‌తో పాటు మరికొన్ని యాప్‌లను ఇన్స్టాల్ చేసుకునే సదుపాయం ఉంది. -
జియో ఫోన్ కొనుగోలు దారులకు శుభవార్త!
వినియోగదారులకు జియో శుభవార్త చెప్పింది. ఇన్ని రోజులు ఆన్‌లైన్‌కే పరిమితమైన జియో ఫోన్ నెక్ట్స్ అమ్మకాలు..ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో ప్రారంభమైనట్లు తెలిపింది. కొనుగోలు దారులు దగ్గరలో ఉన్న జియో స్టోర్లలో ఈ జియో ఫోన్‌ను కొనుగోలు చేయోచ్చని సూచించింది. నవంబర్ 4న విడుదల జియో సంస్థ గతేడాది నవంబర్ 4న మార్కెట్లోకి జియో ఫోన్ నెక్ట్స్‌ను విడుదల చేసింది. తొలత ఈ ఫోన్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం కొనుగోలు దారులు ముందస్తుగానే రిజస్ట్రర్ చేసుకుంటేనే ఈ బడ్జెట్ ఫోన్ ను సొంతం చేసుకునే అవకాశం కల్పిచ్చింది. అయితే ఇప్పుడు ఇదే ఫోన్‌ను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయోచ్చని జియో ప్రతినిధులు తెలిపారు. ఫోన్ ధర ఎంతంటే? ఇక ఈ ఫోన్ ధరల విషయానికొస్తే ఫోన్ ధర రూ.6,499 ఉండగా.. ఫోన్ కొనుగోలు కోసం ఈఎంఐ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. డౌన్ పేమెంట్ కింద రూ.1,999, రూ.501 ప్రాసెసింగ్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ ఫీచర్లు ♦ డిస్ప్లే: 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్ (720 X 1440 ) ♦ స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ♦ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ♦ ర్యామ్,స్టోరేజ్ : 2జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు ♦ బ్యాక్ కెమెరా: 13 ఎంపీ ♦ ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ ♦ బ్యాటరీ: 3500 ఎంఏహెచ్ ♦ సిమ్ స్లాట్లు: 2 (డ్యూయల్ సిమ్) ♦ సిమ్ పరిమాణం: నానో ♦ కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం ♦ సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్ చదవండి: ముఖేష్ అంబానీ ముందు చూపు మామూలుగా లేదుగా..ఇక లాభాలే లాభాలు!! -
జియో ఫోన్ అమ్మకాలు ప్రారంభం, ఎలా కొనాలో తెలుసా..?
జియో ఫోన్ నెక్ట్స్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఫోన్ కొనుగోలు కోసం స్టోర్ కు వెళ్లేముందే వాట్సాప్, లేదంటే కంపెనీ వెబ్ సైట్ (https://www.jio.com/next)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా ఫోన్ కొనే సౌకర్యం లేదని జియో ప్రతినిధులు తెలిపారు. రిజిస్ట్రేషన్ పక్కా జియో ఫోన్ నెక్ట్స్ కొనుగోలు కోసం ముందుగా 70182 70182కు హాయ్ మెసేజ్ పెట్టాలి. అనంతరం అదే నెంబర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సందర్భంగా వినియోగదారులు తమ లొకేషన్ ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత స్టోర్‌కు వెళ్లి జియో ఫోన్ నెక్ట్స్ కొనుక్కోవచ్చంటూ వినియోగదారులకు మెసేజ్ వెళుతుంది. అలా మెసేజ్ వస్తే స్టోర్‌లో జియో ఫోన్నెక్ట్స్ను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ధరల విషయానికొస్తే ఫోన్ ధర రూ.6,499 ఉండగా.. ఫోన్ కొనుగోలు కోసం ఈఎంఐ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. డౌన్ పేమెంట్ కింద రూ.1,999, రూ.501 ప్రాసెసింగ్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 30వేల ఔట్లెట్లు జియో ఫోన్ కొనుగోలు కోసం రిలయన్స్ దేశ వ్యాప్తంగా 30,000కు పైగా రిటైల్ అవుట్ లెట్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా కొనుగోలు దారులు ఈ ఫోన్‌ను ఔట్లెట్లలో సొంతం చేసుకోవచ్చు. జియో ఫోన్ నెక్ట్స్ ఫీచర్లు ♦ డిస్ప్లే: 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్ (720 X 1440 ) ♦ స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ♦ ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ♦ ర్యామ్,స్టోరేజ్ : 2జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు ♦ బ్యాక్ కెమెరా: 13 ఎంపీ ♦ ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ ♦ బ్యాటరీ: 3500 ఎంఏహెచ్ ♦ సిమ్ స్లాట్లు: 2 (డ్యూయల్ సిమ్) ♦ సిమ్ పరిమాణం: నానో ♦ కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం ♦ సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్ చదవండి: నెలకు రూ.300 చెల్లిస్తే చాలు జియో ఫోన్ మీ సొంతం..! ఫోన్ ధర ఎంతంటే..! -
రిలయన్స్ జియోఫోన్ ఎలా కొనాలో తెలుసా..?
దీపావళి పండుగా సందర్భంగా నవంబర్ 4న రిలయన్స్ జియో సంస్థ ప్రపంచంలోనే అత్యంత చవక స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ ను విడుదల చేయనున్నట్లు కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మొబైల్ వినాయక చవితి సందర్భంగా విడుదల కావాల్సి ఉండేది. కానీ, చిప్ కొరత కారణంగా విడుదల తేదీని పొడగించారు. రేపు విడుదల కాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధరల్ని అక్టోబర్ 29న జియో సంస్థ అధికారికంగా ప్రకటించింది. జియో ప్రకటించిన వివరాల ప్రకారం ఫోన్ ధర రూ.6,499గా ఉంది. అలాగే, రూ.2,500 ముందుగా చెల్లించి ఫోన్ సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని 18 నెలలు/24 నెలల కాల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రేపు విడుదల కాబోతున్న ఈ మొబైల్ ఎలా కొనుగోలు చేయాలి? మీ దగ్గరలోని స్టోర్ లో ఎప్పుడ అందుబాటులోకి వస్తాయి అనే విషయం తెలుసుకుందాం. (చదవండి: పెట్రో పరుగుకు బ్రేకులు...! వాహనదారులకు కేంద్రం శుభవార్త..!) మొదట మీరు స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ కోసం రిలయన్స్ జియో సంస్థ అధికారక పోర్టల్ ఓపెన్ చేయండి. పోర్టల్ ఓపెన్ చేశాక జియోఫోన్ నెక్ట్స్ చిత్రం కనిపిస్తుంది. ఆ చిత్రం మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫోన్ చిత్రం పక్కన "I am Interested" అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలు నమోదు చేసి జెనెరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ నమోదు చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఇంటి వివరాలు, ప్రాంతం, పిన్ కోడ్ నమోదు చేయాలి. ఆ తర్వాత మీ ప్రాంతంలో జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ అమ్మకాలు అందుబాటులోకి వస్తే తెలియజేస్తాము అని మెసేజ్ కనిపిస్తుంది. జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్: 5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 3,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్ ఆండ్రాయిడ్ ప్రగతి ఓఎస్ ధర - రూ.6,499 (చదవండి: వాట్సాప్‌లో వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా!) -
జియో నెక్ట్స్ ఫోన్ కొంటున్నారా.. అయితే ఇవి కూడా చూడండి!
దీపావళి పండుగా సందర్భంగా రిలయన్స్ జియో సంస్థ ప్రపంచంలోనే అత్యంత చవక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేయనున్నట్లు కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొబైల్ ఎప్పుడో లాంచ్ అవ్వాల్సి ఉంది. కానీ, చిప్ కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్ వెంటనే అమ్మకానికి రాలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 29న జియో సంస్థ ఫోన్ ఫీచర్లు, ధరల్ని అధికారికంగా ప్రకటించింది. జియో ప్రకటించిన ఫోన్ ధర రూ.6,499 చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. అలాగే, ఈఎమ్ఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడే చాలా మంది జియో మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ ఈఎమ్ఐ ఆప్షన్ కింద ఎంచుకోవాలంటే ముందుగా రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని వారు ఇచ్చిన ఈఎమ్ఐ ఆప్షన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకుంటే రెడ్మీ 9ఏ, రియల్మీ సీ11 కంటే ఎక్కువ అవుతున్నట్లు పేర్కొంటున్నారు. (చదవండి: గ్రిడ్ 2.0 ఈవీ స్టేషన్స్ లాంచ్ చేసిన అథర్ ఎనర్జీ) ట్విటర్ వేదికగా జియో సంస్థను ప్రశ్నిస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ కంటే ఈ రెండింటిలో ఉత్తమ స్పెసిఫికేషన్స్ ఉన్నట్లు తెలుపుతున్నారు. ప్రస్తుతం రెడ్మీ 9ఏ స్మార్ట్ ఫోన్ ధర రూ.6,999గా ఉంది. అదే రియల్మీ సీ11 ధర రూ.6799గా ఉంది. మీరు గనుక జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ కొనాలని చూస్తుంటే ఇవి దాని కంటే ఉత్తమ స్పెసిఫికేషన్స్ ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. రెడ్మీ 9ఏ, రియల్మీ సీ11, జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్: 5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 3,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్ ఆండ్రాయిడ్ ప్రగతి ఓఎస్ ధర - రూ.6,499 రెడ్మీ 9ఏ ఫీచర్స్: 6.53 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 5 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ధర - రూ.6,999 రియల్మీ సీ11: 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 5 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ధర - రూ.6,799 -
'జియో ఫోన్ నెక్ట్స్' కంటే ధర తక్కువగా ఉన్న ఫోన్ ఇదే..!
బడ్జెట్ ఫోన్ 'జియో ఫోన్ నెక్ట్స్'పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటికే దివాళీ సందర్భంగా విడుదల కానున్న జియో ఫోన్ ధర, ఫీచర్ల గురించి జియో సంస్థ స్పష్టత ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. అందుకు కారణం..దేశంలోనే అతితక్కువ ధరకే ఫోన్ అందిస్తామన్న జియో.. ఆ ఫోన్ ధరను రూ.6,499గా నిర్ణయించింది. ఈ ఫోన్ కంటే గతంలో విడుదలైన బడ్జెట్ ఫోన్లలో ఫీచర్లు ఎక్కువగా ఉండటమే కాదు ధర సైతం రూ.1500 తక్కువగా ఉందని చర్చించుకుంటున్నారు. చిప్సెట్ ఎఫెక్ట్ పెరుగుతున్న తయారీ, కాంపోనెంట్ ఖర్చుల కారణంగా జియో ఫోన్ ధర కాస్త ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ ధర రూ.6,4999 ఉండగా.. ఈ ఫోన్ కంటే ధర తక్కువగా మనదేశంలో మరో ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం 01 ఉందని గుర్తు చేస్తున్నారు. జియో ఫోన్ నెక్ట్స్ కంటే తక్కువ ధర ఉన్న ఫోన్ ఇదే రిలయన్స్ డిజిటల్, ఫ్లిప్‌కార్ట్ లలో జియో ఫోన్ నెక్ట్స్ కంటే శాంసంగ్ గెలాక్సీ ఎం 01 కంటే తక్కువకే అమ్ముతున్నాయి. శాంసంగ్ గెలాక్సీ, జియో ఫోన్ నెక్ట్స్ లో ఒకే విధమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే శాంసంగ్ ఫోన్ ధర తక్కువ ప్రారంభ ధర రూ.4,999కే విక్రయిస్తుంది. జియో ఫోన్ కంటే రూ.1,500 తక్కువకే వస్తుంది. జియో ఫోన్ నెక్ట్స్ వర్సెస్ శాంసంగ్ గెలాక్సీ గెలాక్సీ ఎం 01 రెండు వేరియంట్లలో లభిస్తుంది. గెలాక్సీ ఎం 01 బేసిక్ వెర్షన్ 1జీబీ ర్యామ్ ప్లస్ 16జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఇక దీని ధర ఫ్లిప్ కార్ట్‌లో రూ. 4,999, రిలయన్స్ డిజిటల్లో రూ.5,199కి అందుబాటులో ఉంది. 2జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజ్ వెర్షన్ ఫోన్ ధర రిలయన్స్ డిజిటల్లో రూ. 6,199 గా ఉంది. ఈ రెండు వేరియంట్లు జియో ఫోన్ కంటే తక్కువగా ఉండటం గమనార్హం. చదవండి: ఆనందంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉక్కిరి బిక్కిరి..ఎందుకంటే -
నెలకు రూ.300 చెల్లిస్తే చాలు జియో ఫోన్ మీ సొంతం..! ఫోన్ ధర ఎంతంటే..!
మరో వారంలో ప్రపంచంలో అత్యంత చవకైన ఫోన్ 'జియో ఫోన్ నెక్ట్స్' విడుదల కానున్న విషయం తెలిసిందే. జియో- గూగుల్ సంయుక్తంగా రూరల్ ఏరియాల్ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్‌ను విడుదల చేయడంపై వినియోగదారులు ఈ ఫోన్ ధర, ఫీచర్స్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వారి ఆసక్తిని రెట్టింపు చేస్తూ తక్కువ డౌన్ పేమెంట్‌తో పాటు కేవలం రూ.300 నెలవారీ ఈఎంఐని చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. దీపావళి సందర్భంగా విడుదల కానున్న ఈ ఫోన్ ఈఐఎంఐతో పాటు వాయిస్ కాల్స్, డేటా వివరాల గురించి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా వెల్లడించారు. జియో వివరాల ప్రకారం భారత్‌లో విడుదల చేయనున్న 4జీ జియో ఫోన్ నెక్ట్స్‌ను జియో సంస్థ కేవలం రూ.1,999 చెల్లించి సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని 18 నెలలు లేదంటే 24 నెలల కాల వ్యవధిలో చెల్లించే సౌకర్యాన్ని అందిస్తుంది. జియో ఫోన్ ధర చిప్ సెట్ల కొరత కారణంగా భారత్‌లో కాస్త ఎక్కువ ధరకే జియో ఫోన్ మార్కెట్ లో విడుదల కానుంది. మన దేశంలో జియో ఫోన్ ధర రూ.6,499గా నిర్ణయించింది. అయితే, కస్టమర్లు బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే రూ.1,999 ను డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని 18-24 నెలల్లోగా పే చేయాలి. ఇందుకోసం జియో నాలుగు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. జియో ఫోన్ నెక్ట్స్ : కస్టమర్ల కోసం నాలుగు ప్లాన్లు మొదటి ప్లాన్ : ఆల్వేస్ ఆన్ ప్లాన్ కింద 18 లేదా 24 నెలల కాల వ్యవధిలో కస్టమర్లు ఎంపిక చేసుకున్న ఈఎంఐని బట్టి రూ.350 లేదా రూ.300 మాత్రమే చెల్లించాలి. ఇందులో వినియోగదారులు నెలకు 5జీబీ డేటా ప్లస్ 100నిమిషాల టాక్‌టైమ్‌ను కూడా పొందుతారు. రెండవ ప్లాన్ : జియో ఫోన్ నెక్ట్స్ లార్జ్ ప్లాన్ కింద కస్టమర్లు 18 నెలలకు రూ.500, 24 నెలలకు రూ.450 చెల్లించాలి. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌ను పొందవచ్చు. మూడో ప్లాన్ : జియో ఫోన్ నెక్ట్స్ కోసం జియో మూడవ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎక్స్ఎల్ అని పిలిచే మూడో ప్లాన్‌లో వినియోగదారులు 18 నెలలకు రూ. 550 లేదా 24 నెలలకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు ప్రతిరోజూ 2జీబీ హై స్పీడ్ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. నాల్గవ ప్లాన్ : చివరిగా నాల్గవ ప్లాన్ ఎక్స్ ఎక్స్ఎల్ ప్లాన్. ఈ ప్లాన్‌లో జియో ఫోన్ కొనుగోలుదారులు నెలకు రూ. 600 చొప్పున 18 నెలల పాటు లేదా 24 నెలల పాటు రూ. 550 చెల్లించాలి. ఈ ఆఫర్ వినియోగదారులకు 24 నెలల పాటు అపరిమిత వాయిస్ కాల్లతో పాటు రోజుకు 2.5జీబీ 4జీ డేటాను పొందవచ్చు. జియో ఫోన్ నెక్ట్స్ ఫీచర్లు డిస్ప్లే: 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్ (720 X 1440 ) స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ర్యామ్,స్టోరేజ్ : 2జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు బ్యాక్ కెమెరా: 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ బ్యాటరీ: 3500 ఎంఏహెచ్ సిమ్ స్లాట్లు: 2 (డ్యూయల్ సిమ్) సిమ్ పరిమాణం: నానో కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్ అంతేకాదు ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్ ను గూగుల్ డెవలప్ చేసింది. జియో ఫోన్ నెక్ట్స్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ పెద్దగా చదవడం, ట్రాన్స్‌లేట్ చేసుకునేలా ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. జియో ఫోన్ నెక్ట్స్ మై జియో, జియో సినిమా,జియో టీవీ, జియో సావన్‌తో పాటు మరికొన్ని యాప్‌లను ఇన్స్టాల్ చేసుకునే సదుపాయం ఉంది. చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..!