దీపావళి పండుగా సందర్భంగా నవంబర్ 4న రిలయన్స్ జియో సంస్థ ప్రపంచంలోనే అత్యంత చవక స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ ను విడుదల చేయనున్నట్లు కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మొబైల్ వినాయక చవితి సందర్భంగా విడుదల కావాల్సి ఉండేది. కానీ, చిప్ కొరత కారణంగా విడుదల తేదీని పొడగించారు. రేపు విడుదల కాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధరల్ని అక్టోబర్ 29న జియో సంస్థ అధికారికంగా ప్రకటించింది. జియో ప్రకటించిన వివరాల ప్రకారం ఫోన్ ధర రూ.6,499గా ఉంది.
అలాగే, రూ.2,500 ముందుగా చెల్లించి ఫోన్ సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని 18 నెలలు/24 నెలల కాల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రేపు విడుదల కాబోతున్న ఈ మొబైల్ ఎలా కొనుగోలు చేయాలి? మీ దగ్గరలోని స్టోర్ లో ఎప్పుడ అందుబాటులోకి వస్తాయి అనే విషయం తెలుసుకుందాం.
(చదవండి: పెట్రో పరుగుకు బ్రేకులు...! వాహనదారులకు కేంద్రం శుభవార్త..!)
మొదట మీరు స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ కోసం రిలయన్స్ జియో సంస్థ అధికారక పోర్టల్ ఓపెన్ చేయండి. పోర్టల్ ఓపెన్ చేశాక జియోఫోన్ నెక్ట్స్ చిత్రం కనిపిస్తుంది. ఆ చిత్రం మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు ఫోన్ చిత్రం పక్కన "I am Interested" అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలు నమోదు చేసి జెనెరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ నమోదు చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఇంటి వివరాలు, ప్రాంతం, పిన్ కోడ్ నమోదు చేయాలి. ఆ తర్వాత మీ ప్రాంతంలో జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ అమ్మకాలు అందుబాటులోకి వస్తే తెలియజేస్తాము అని మెసేజ్ కనిపిస్తుంది.
జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్:
- 5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే
- క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్
- 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
- 3,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
- 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా
- 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
- స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్
- ఆండ్రాయిడ్ ప్రగతి ఓఎస్
- ధర - రూ.6,499
(చదవండి: వాట్సాప్‌లో వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా!)
Comments
Please login to add a commentAdd a comment