బడ్జెట్ ఫోన్ 'జియో ఫోన్ నెక్ట్స్'పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటికే దివాళీ సందర్భంగా విడుదల కానున్న జియో ఫోన్ ధర, ఫీచర్ల గురించి జియో సంస్థ స్పష్టత ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. అందుకు కారణం..దేశంలోనే అతితక్కువ ధరకే ఫోన్ అందిస్తామన‍్న జియో.. ఆ ఫోన్ ధరను రూ.6,499గా నిర్ణయించింది. ఈ ఫోన్ కంటే గతంలో విడుదలైన బడ్జెట్ ఫోన్‌లలో ఫీచర్లు ఎక్కువగా ఉండటమే కాదు ధర సైతం రూ.1500 తక్కువగా ఉందని చర్చించుకుంటున్నారు.
చిప్‌సెట్ ఎఫెక్ట్
పెరుగుతున్న తయారీ, కాంపోనెంట్ ఖర్చుల కారణంగా జియో ఫోన్ ధర కాస్త ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ ధర రూ.6,4999 ఉండగా.. ఈ ఫోన్ కంటే ధర తక్కువగా మనదేశంలో మరో ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం 01 ఉందని గుర్తు చేస్తున్నారు.
జియో ఫోన్ నెక్ట్స్ కంటే తక్కువ ధర ఉన్న ఫోన్ ఇదే
రిలయన్స్ డిజిటల్, ఫ్లిప్‌కార్ట్ లలో జియో ఫోన్ నెక్ట్స్ కంటే శాంసంగ్ గెలాక్సీ ఎం 01 కంటే తక్కువకే అమ్ముతున్నాయి. శాంసంగ్ గెలాక్సీ, జియో ఫోన్ నెక్ట్స్ లో ఒకే విధమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే శాంసంగ్ ఫోన్ ధర తక్కువ ప్రారంభ ధర రూ.4,999కే విక్రయిస్తుంది. జియో ఫోన్ కంటే రూ.1,500 తక్కువకే వస్తుంది.
జియో ఫోన్ నెక్ట్స్ వర్సెస్ శాంసంగ్ గెలాక్సీ
గెలాక్సీ ఎం 01 రెండు వేరియంట్లలో లభిస్తుంది. గెలాక్సీ ఎం 01 బేసిక్ వెర్షన్ 1జీబీ ర్యామ్ ప్లస్ 16జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఇక దీని ధర ఫ్లిప్ కార్ట్‌లో రూ. 4,999, రిలయన్స్ డిజిటల్‌లో రూ.5,199కి అందుబాటులో ఉంది. 2జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజ్ వెర్షన్ ఫోన్ ధర రిలయన్స్ డిజిటల్‌లో రూ. 6,199 గా ఉంది. ఈ రెండు వేరియంట్‌లు జియో ఫోన్ కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
చదవండి: ఆనందంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉక్కిరి బిక్కిరి..ఎందుకంటే
Comments
Please login to add a commentAdd a comment