సౌత్ కొరియా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త రికార్డ్‌లు క్రియేట్ చేస్తుంది. ఇటీవల శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2022 ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మూడు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సిరీస్ ఫోన్ ప్రీ బుకింగ్స్ శాంసంగ్ ఇండియా ప్రతినిధుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫిబ్రవరి 23నుంచి శాంసంగ్ ప్రీ బుకింగ్స్ ను ప్రారంభించింది. కేవలం 12గంటల్లో 70వేల ఫోన్‌లు ప్రీ బుకింగ్ అయ్యాయి.
ధర ఎంతంటే..?
దేశంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 8జీబీ ర్యామ్ ప్లస్ 128 స్టోరేజ్ ఫోన్ ప్రారంభ ధర రూ.72,999, 8జీబీ ప్లస్ 256 జీబీ మోడల్ ధర రూ.76,999గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్ 8జీబీ ప్లస్ 128జీబీ ధర రూ. 84,999 నుండి ప్రారంభం కానుంది. 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధర రూ.88,999గా ఉంది.
మరోవైపు, శాంసంగ్ గెలాక్సీ ఆల్ట్రా ఎస్22 12జీబీ ప్లస్ 256జీబీ ధర రూ.1,09,999 ఉండగా 12జీబీ ప్లస్ 512జీబీ మోడల్ ధర రూ.1,18,999గా ఉంది.
ఫోన్ బుక్ చేసుకుంటే ఆఫర్ ఎంతంటే?
కంపెనీ ప్రకారం..శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ఆల్ట్రా ఫోన్‌ని బుక్ చేసిన కస్టమర్లు రూ.26,999 విలువైన గెలాక్సీ వాచ్4ని రూ.2999కే సొంతం చేసుకోనున్నారు. అలాగే గెలాక్సీ ఎస్ 22ప్లస్, గెలాక్సీ ఎస్ 22ని ప్రీ బుకింగ్ చేసే కస్టమర్‌లు రూ.11,999 విలువైన గెలాక్సీ బడ్స్2 ని రూ.999కే పొందనున్నారు.
అదనంగా, గెలాక్సీ ఎస్, గెలాక్సీ నోట్ సిరీస్ కస్టమర్‌లు రూ.8000 అప్‌గ్రేడ్ బోనస్, డివైజ్ హోల్డర్‌లు రూ. 5000 అప్‌గ్రేడ్ బోనస్, ప్రత్యామ్నాయంగా శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్ ద్వారా ఫోన్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లు అదనంగా రూ.5000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. .
ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా మార్కెటింగ్ హెడ్ ఆధిత్య బబ్బర్ మాట్లాడుతూ.. దేశంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ఫోన్ ప్రీ బుక్కింగ్స్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారం. వీలైనంత త్వరగా ఆ ఫోన్‌లను కస్టమర్లకు అందిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment