ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో విడుదల కానున్న మరో అఫార్డ్‌బుల్ 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం లీకైన ఈ ఫోన్ ఫీచర్స్, ధరలు ఇలా ఉన్నాయి.
లీకైన ఫీచర్లు
ప్రస్తుతం లీకైన శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ స్మార్ట్ ఫోన్ స్మార్ట్‌ఫోన్ 6.48 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీతో విడుదల కానుంది.
ట్రిపుల్ కెమెరా సెటప్, 50ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్, 5ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్, వాటర్-డ్రాప్ నాచ్ ను కలిగి ఉంది. ఆన్‌లీక్స్ ప్రకారం.. లీకైన ఫోన్ 83.4 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నట్లు తెలుస్తోంది.
ధర ఎంతంటే?
వీటితో పాటు ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్‌ఓసీ, 6జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. గెలాక్సీ ఏ13 5జీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫోన్ బాక్స్ లోపల 15W ఛార్జింగ్ ఫ్యాక్‌తో రానుంది.
3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇక ఈ ఫోన్ ధర యూఎస్, కెనడాలలో 18,800ఉండగా ఇండియాలో రూ .16,000కే అందుబాటులోకి రానుండగా..బ్లాక్, రెడ్, వైట్,బ్లూ కలర్ ఆప్షన్ వేరియంట్లలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment