దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ సత్తా చాటుతోంది. ఆ సంస్థకు చెందిన గెలాక్సీ ఎస్ 23 ఫోన్‌లు ప్రీ బుకింగ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఒక్కరోజులోనే రూ.1400 కోట్ల విలువైన 1.4 లక్షల యూనిట్ల ప్రీమియం ఫోన్‌లను కొనుగోలు దారులు బుక్ చేసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
శాంసంగ్ ఫిబ్రవరి 1న గెలాక్సీ ఎస్ 23 సిరీస్‌లోని ‘గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా’ అనే మూడు వేరియంట్లు మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి 23 వరకు కొనసాగనున్న ప్రీ బుకింగ్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.
రెండు రెట్లు పెరిగి
ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లాన్ మాట్లాడుతూ.. గతంలో తాము విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 కంటే రెండు రెట్లు పెరిగి సగటున ఫోన్ ధర సుమారు లక్ష రూపాయలు ఉన్న ఈ ఫోన్‌లు 24 గంటల్లో 1.4 లక్షల యూనిట్లు ప్రీ బుకింగ్స్ జరిగినట్లు చెప్పారు.
ఫిబ్రవరి 23 ప్రీబుకింగ్ కొనసాగింపు
ఇక ఈ ఫోన్‌ల ప్రీ బుకింగ్స్ ఫిబ్రవరి 23వరకు కొనసాగుతాయని చెప్పిన పుల్లాన్ .. శాంసంగ్ ఎస్ 23 సిరీస్ ధరలు రూ.75 వేల నుంచి రూ.1.55లక్షల వరకు ఉన్నాయని అన్నారు.
భారత్‌లో తయారీ.. ఎక్కడంటే
దేశీయ మార్కెట్‌లో విడుదలైన శాంసంగ్ ఎస్ 23 ప్రీమియం ఫోన్‌లు నోయిడా ప్లాంట్‌లో తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఇక గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్‌లను మాత్రం వియాత్నం మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌లో తయారు చేసి.. దిగుమతి అనంతరం భారత్‌లో అమ్మకాలు జరిపినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment