చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన షావోమీ 14 సిరీస్ ను మార్కెట్ కు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 7న షావోమీ 14తో పాటు షావోమీ 14 ప్రో, షావోమీ 14 ఆల్ట్రా సహా షావోమీ 14 సిరీస్ ఫోన్లలో తొలుత షావోమీ 14 ఫోన్ మాత్రమే భారత్ మార్కెట్ లో విడుదల చేయనుంది. కాగా, ఈ సిరీస్ ఫోన్లను షావోమీ ఇప్పటికే చైనా మార్కెట్ లో విడుదల చేసింది. ఇప్పుడు గ్లోబుల్ మార్కెట్ లో ఆవిష్కరించనుంది.
షియోమీ 14 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.36 అంగుళాల 1.5 కే ఎల్టీపీఓ ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తున్నది. షావోమీ 14 120హెచ్ జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో 1.5కే ఎల్ టీ పీ ఓ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ డాల్బీ విజన్‌తో పాటు స్టీరియో స్పీకర్‌లతో కూడిన డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేస్తుందని తెలిపింది.
హ్యాండ్‌సెట్ 90డబ్ల్యూ వైర్డ్ హైపర్‌ఛార్జ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ టర్బో ఛార్జ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఫోన్‌ను 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో సున్నా నుండి 50కి ఛార్జ్ చేస్తుందని షావోమీ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇందులో లైకా కో-ఇంజినీర్డ్ కెమెరా సెటప్ ఉంటది. ఓఐఎస్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50-మెగా పిక్సెల్ ఆల్డ్రావైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్పీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా సైతం యూజర్లను అలరిస్తుంది.
షియోమీ 14 ఫోన్ 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4610 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. జేడ్ గ్రీన్, బ్లాక్, వైట్, స్నో మౌంటేన్ పింక్ వేరియంట్స్ కలర్స్ లో రానున్న ఈ ఫోన్ ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల మధ్య ఉండొచ్చునని అంచనా
Comments
Please login to add a commentAdd a comment