ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ.. షావోమీ రెడ్‌మీ నోట్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసింది. షావోమీ 12 సిరీస్ సూపర్ హిట్ కావడంతో.. లేటెస్ట్ సిరీస్ షోవోమీ 13పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 13, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ మోడళ్లను సెప్టెంబర్ 22న చైనాలో లాంచ్ చేసింది. రేపటి నుంచి ఈ సిరీస్ ఫోన్‌ల అమ్మకాలు ప్రారంభమవుతున్నాయి.
రెడ్‌మీ నోట్ 13 స్పెసిఫికేషన్లు
6.67-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉన్న రెడ్‌మీ నోట్ 13లో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC, 12జీబీ ర్యామ్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది. దీంతో పాటు ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 100-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్లు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెన్సార్ సౌకర్యం ఉండగా..ఫోన్ 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
రెడ్‌మీ నోట్ 13 ప్రో స్పెసిఫికేషన్లు
ప్రో మోడల్‌లో 6.67-అంగుళాల 1.5కే హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ ప్యానల్,120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 చిప్‌సెట్‌తో పాటు 16జీబీ ర్యామ్ 512జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ విభాగంలో నోట్ 13 ప్రో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 200-మెగాపిక్సెల్ శాంసంగ్ ISOCELL హెచ్‌పీ3 ప్రైమరీ రియర్ సెన్సార్, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, ఫ్రంట్ అండ్ బ్యాక్ 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుండగా 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు.
రెడ్‌మీ నోట్ 13ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు
ఈ రెడ్‌మీ నోట్ 13 ప్రో+ రేర్‌లో లో 200ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ షూటర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 16ఎంపీ కెమెరా వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్, 16జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్, 5జీ, వైఫై-6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ సైతం ఉన్నాయి.
రెడ్‌మీ నోట్ 13, రెడ్ మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ ధరలు
రెడ్‌మీ నోట్ 13, 6జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ఫోన్ ధర దాదాపు రూ. 13,900, 8జీబీ ప్లస్ 128 జీబీ, 8జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్‌ల ఫోన్ ధరలు రూ. 15,100, రూ. 17,400గా ఉంది. 12జీబీ ప్లస్ 256 జీబీ ఫోన్ ధర రూ. 19,700గా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రెడ్‌మీ నోట్ 13 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ వేరియంట్ ఫోన్‌ల ధరలు రూ. 17,400, రూ. 19,700 వద్ద అందుబాటులో ఉన్నాయి.
నోట్ 13 ప్రో 12జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ రూ. 22,000, 12జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. 23,100కే కొనుగోలు చేయొచ్చు.హై-ఎండ్ ప్రో మోడల్ 16జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. రూ. 24,300గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment