పేటీఎం మాల్‌ సేల్‌ : ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లు | Paytm Mall Flash Sale Week sale | Sakshi
Sakshi News home page

పేటీఎం మాల్‌ సేల్‌ : ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లు

Published Mon, Sep 24 2018 5:26 PM | Last Updated on Mon, Sep 24 2018 5:26 PM

Paytm Mall Flash Sale Week sale - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  పేటీఎం మాల్‌ మళ్లీ డిస్కౌంట్‌  ధరలకు తెరతీసింది.  ఇటీవలి అన్‌లైన్‌ సేల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకున్న సంస్థ దాజాగా  'ఫ్లాష్  సేల్‌  వీక్' ను తిరిగి ప్రారంభించింది. ఇందులో ల్యాప్‌టాప్‌లపై  క్యాష్‌ బ్యాక్‌లు ఇతర ఆఫర్లను అందిస్తోంది. వారం రోజుల పాటుఈ  సేల్‌ నిర్వహించనున​ ఈ సేల్‌లో దేశంలో టాప్‌ సెల్లింగ్‌ ల్యాప్‌టాప్‌లపై భారీ  డిస్కౌంట్లను, ఈఎంఐ ఆఫర్లను అందిస్తోంది.

 సెప్టెంబర్ 24 -30 వరకు  పేటీఎం మాల్‌  ప్రతి రోజూ సాయంత్రం  4-8 గంటలదాకా  ఫ్లాష్‌ సేల్‌ వీక్‌ కొనసాగనుంది. ముఖ్యంగా  హెచ్‌పీ, డెల్‌, యాసెర్‌, ఆసుస్‌, లెనోవో బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లను  ఈ సేల్‌లో విక్రయిస్తోంది.  రూ. 5,000 వరకు  క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది.

ఇంటెల్‌ కోర్‌ ఐ5, 8జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ స్పేస్‌, 15.6 అంగుళాల డిస్‌ప్లే ,  టర్బో బూస్ట్ టెక్నాలజీతో రూపొందించిన ల్యాప్‌టాప్‌ను రూ. 39,490కే ఆఫర్‌ చేస్తోంది.  దీ ని వాస్తవ ధర  రూ. 45,889. అదే విధంగా, లెనోవా ఇడిప్యాడ్ 320 (ఇంటెల్ ఐ3 ప్రాసెసర్, 4జీబీర్యామ్‌,  1 టిబి హార్డ్ డిస్క్ డ్రైవ్) కొనుగోలుపై  27శాతం  డిస్కౌంట్,  3,500 రూపాయల  క్యాష్‌బ్యాక్‌తో రూ.  21,490లభిస్తుంది.   దీని ధరను వాస్తవ ధర రూ. 34,490.

వీటితోపాటు డెల్, యాసెర్, ఆసుస్‌ లాంటి ఇతర ప్రముఖ బ్రాండ్ల ల్యాప్‌లాప్‌లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement