రెడ్‌మి నోట్‌ 6 ప్రో సెకండ్‌ ఫ్లాష్‌ సేల్‌ నేడే | Xiaomi Redmi Note 6 Pro to hold its 2nd sale today at 12 PM | Sakshi
Sakshi News home page

రెడ్‌మి నోట్‌ 6 ప్రో సెకండ్‌ ఫ్లాష్‌ సేల్‌ నేడే

Published Wed, Nov 28 2018 12:10 PM | Last Updated on Wed, Nov 28 2018 1:37 PM

Xiaomi Redmi Note 6 Pro to hold its 2nd sale today at 12 PM  - Sakshi

మొదటి సేల్‌లో రికార్డు స్థాయిలో అమ్ముడు బోయిన రెడ్‌మి నోట్‌ 6ప్రో రెండవసారి  వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు (నవంబరు 28) మధ్యాహ్నం 12గంటలనుంచి ఫ్లాష్‌సేల్‌ ప్రారంభం. ఎంఐ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ సేల్‌ ఉంటుంది.

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి నోట్‌ సిరీస్‌లో కొత్త ఫోన్‌ రెడ్‌మి నోట్‌ 6ప్రోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనవంబరు 23న మధ్యాహ‍్నం 12, 3, 6, 9 గంటలకు వరుసగా స్పెషల్‌ సేల్‌  నిర్వహించింది. ఈ సందర్భంగా రికార్డు స్థాయిలో తమ స్మార్ట్‌ఫోన్‌ నిమిషాల్లో ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌గా నిలిచిందని షావోమీ చీఫ్‌ మను జైన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

రెడ్‌మి నోట్‌ 6ప్రో ఫీచర్లు
6.26 ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
2280 x 1080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్‌ 636 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌
3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌
256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
20+2 ఎంపీ రియర్‌ కెమెరాలు
12+2 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement