నట్టింట్లో ట్రింగ్‌..ట్రింగ్‌! | Landline come to life again with broadband packages | Sakshi
Sakshi News home page

నట్టింట్లో ట్రింగ్‌..ట్రింగ్‌!

Published Wed, Sep 25 2019 3:41 AM | Last Updated on Wed, Sep 25 2019 5:45 AM

Landline come to life again with broadband packages - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒకప్పుడు నట్టింట్లో ట్రింగ్‌.. ట్రింగ్‌.. అంటూ మోగిన ల్యాండ్‌లైన్‌ పోన్లు మళ్లీ మోత మోగించనున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు జియో కూడా వీటికి మళ్లీ జీవం పోస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ దీని కోసం తన నెట్‌వర్క్‌ను నెక్ట్స్‌ జనరేషన్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ ఆధారిత టెక్నాలజీతో అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో ఎలాంటి అంతరాయం లేకుండా క్లియర్‌ వాయిస్, డౌన్‌లోడ్‌ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తోంది. 

బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఇలా...: ల్యాండ్‌లైన్‌ విని యోగదారులకు రోజూ రాత్రి 10.30 నుంచి ఉదయం 6 గంటల వరకు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్స్‌ చేసుకునే అవకాశం. ఆదివారం ఉచితంగా మాట్లాడుకునే సౌకర్యం. నెల రోజులపాటు ఉచిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించడంతోపాటు వినియోగదారులకు రోజుకు 10 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో 5 జీబీ ఉచిత డేటాను అందిస్తోంది. బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ కోసం వినియోగదారులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అయితే సేవల కోసం మోడమ్‌ను మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రతి నెలా 5 రోజులపాటు నగరంలోని ముఖ్యకూడళ్లలో మెగా మేళాలను నిర్వహిస్తోంది. 

నగరంలో 2.60 లక్షల కనెక్షన్లు..:
హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు 2.60 లక్షల ల్యాండ్‌లైన్, 60 వేల బ్రాడ్‌బ్యాండ్, 25 వేలకు పైగా ఎఫ్‌టీటీహెచ్‌ కనెక్షన్లు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొబైల్‌ విప్లవం కంటే ముందు సుమారు 7.50 లక్షలు ఉన్న ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లు లక్ష వరకు పడిపోయాయి. తిరిగి బ్రాడ్‌బ్యాండ్‌ అనుసంధానంతో ల్యాండ్‌లైన్‌ ఫోన్లకు డిమాండ్‌ పెరుగుతోంది.
టారిఫ్‌లు ఇలా..: ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ నెల అర్బన్‌ ప్యాకేజీ రూ.299 కింద ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్‌ చేసుకునే అవకాశం. ప్యాకేజీ రూ.129 కింద మాత్రం బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌కు అపరిమిత కాలింగ్‌ సౌకర్యం. మిగతా నెట్‌వర్క్‌లకు రూ.100 విలువైన కాల్స్‌ చేసుకోవచ్చు. బ్రాడ్‌బ్యాండ్‌ విషయానికొస్తే.. ఒక నెల 349 ప్యాకేజీ కింద 8 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో రోజుకు 2 జీబీ డేటా డౌన్‌లోడ్‌ చాన్స్‌. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్‌ కాల్స్, ఎఫ్‌టీటీహెచ్‌ కనెక్షన్లకు రూ.645 ప్యాకేజీ కింద రోజుకు 40 ఎంబీపీఎస్‌ స్పీడ్, 200 జీబీ డేటాను డౌన్‌లోడ్‌ అవకాశం. అన్‌లిమిటెడ్‌గా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్‌ ‘ఎక్స్‌ట్రీమ్‌’
ఇప్పటికే నగరంలో ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తున్న ఎయిర్‌టెల్‌ హైస్పీడ్‌ సేవలతో ప్లాన్‌ ఎక్స్ర్‌టీమ్‌ ఫైబర్‌ పేరుతో ముందుకొచ్చింది. వన్‌ జీబీపీఎస్‌ నెట్‌వర్క్‌ వేగంతో ఎయిర్‌టెల్‌ హోం బ్రాడ్‌బ్యాండ్‌ను ఆఫర్‌ చేస్తోంది. జియో ఫైబర్‌ తరహాలోనే ప్లాన్‌ ధరను, బెనిఫిట్స్‌ను ఎయిర్‌టెల్‌ నిర్ధారించింది.  ఎక్స్‌ట్రీమ్‌ మల్టీమీడియా స్మార్ట్‌ ఎకోసిస్టమ్‌లో భాగంగా ఫైబర్‌ సర్వీస్‌ను లాంఛ్‌ చేసింది. వినియోగదారులకు వన్‌జీబీపీఎస్‌ నెట్‌వర్క్‌ స్పీడ్‌తో సేవ లు లభిస్తాయి. ఫైబర్‌ ల్యాండ్‌ లైన్‌ కనెక్షన్‌తో అపరిమితకాల్స్‌ను వర్తింపజేస్తోంది.

జియో దూకుడు...
రిలయన్స్‌ జియో ఆప్టికల్‌ ఫైబర్‌ ఆధారిత సేవలు కూడా నగరంలో అందుబాటులోకొచ్చాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో 2 లక్షల గృహాలకు ఫైబర్‌ టు ది హోమ్‌ సేవలను ప్రారంభించింది. ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, జీయో టీవీ ప్లస్‌ సేవలు  అందిస్తోంది. జియో ఫైబ ర్‌ కస్టమర్లకు ల్యాండ్‌లైన్‌ నుంచి జీవితాంతం ఉచిత వాయిస్‌ కాల్స్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమం డ్, ప్లాటినం, టైటానియం పేరుతో 6 ప్లాన్లను పరిచయం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement