Landline phone
-
ఒకప్పటి స్టేటస్ సింబల్.. నేడు మ్యూజియంలో వస్తువుగా..
ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా): ట్రింగ్ ట్రింగ్... ట్రింగ్ ట్రింగ్.. అంటూ మార్మోగిన ల్యాండ్‌లైన్ ఫోన్ క్రమక్రమంగా అదృశ్యమవుతోంది. రెండు దశాబ్దాల క్రితం స్టేటస్ సింబల్‌గా పిలుచుకునే టెలిఫోన్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా డెడ్ కాగా.. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కాస్త తన ఉనికిని కాపాడుకునేందుకు ఊగిసలాడుతోంది. కాలగమనంలో అరచేతిలోకి సెల్‌ఫోన్ వచ్చి చేరడంతో ల్యాండ్‌లైన్‌కు ఆదరణ కరువైంది. ఒకప్పుడు ఇళ్లల్లో రాజసానికి సింబాలిక్‌గా నిలిచిన ‘ల్యాండ్‌లైన్ ఫోన్’.. సెల్‌ఫోన్ సునామీతో నేడు మ్యూజియంలో వస్తువుగా మారింది. చదవండి: హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి.. కాలం గడుస్తున్నకొద్దీ మనం రోజూ వాడే వస్తువులకు కూడా కాలం చెల్లుతుంది. సేవలు కూడా కనుమరుగైపోతాయి. శతాబ్దాలుగా పట్టణాలకే పరిమితమైన టెలిఫోన్ సౌకర్యం 1988లో మండలాలు, పెద్దపెద్ద గ్రామ పంచాయతీలకు వచ్చింది. ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే పోస్టాఫీసుకు వెళ్లి ట్రంక్ కాల్ బుక్ చేసుకుని గంటల తరబడి కూర్చొని మాట్లాడి వచ్చేవారు. 2000 సంవత్సరం వరకు ఓ వెలుగు వెలిగిన బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ సేవలు ఏటికేటికీ తగ్గుముఖం పడుతూ 2006 సంవత్సరం నుంచి తన ఉనికిని పూర్తిగా కోల్పోవడం మొదలు పెట్టింది. 2009లో మొబైల్ ఫోన్‌కు 3జీ సెక్టార్ రావడంతో ఎక్కడి నుంచైనా మాట్లాడుకునే సౌకర్యం ఉండటం, మెసేజ్‌లు పంపుకునే వీలు కలగడంతో దాదాపు అందరూ అటువైపు మొగ్గు చూపారు. అంతవరకు కాస్తో కూస్తో ఉన్న ల్యాండ్‌లైన్ కనెక్షన్లను 2015లో వచ్చిన జియో బాగా దెబ్బతీసింది. గ్రామగ్రామానా జియో టవర్లు ఏర్పాటు చేయడంతో పాటు సుమారు రెండు సంవత్సరాలు జియో 4జి సేవలు పూర్తి ఉచితంగా అందించడంతో ఆ సునామీలో ల్యాండ్‌లైన్ నిలువలేక పోయింది. 2000 సంవత్సరం వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 1.5 లక్షల బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 7,500 పడిపోయింది. అది ఒకప్పటి స్టేటస్ సింబల్ సుమారు మూడు దశాబ్దాల క్రితం ఏదైనా గ్రామంలో టెలిఫోన్ ఎక్సేంజి ఉందంటే అది పెద్ద వ్యాపార లావాదేవీలు ఉన్న గ్రామంగా గుర్తించేవారు. ఎవరింట్లోనైనా టెలిఫోన్ ఉందంటే వారిని భూస్వాములుగానో, రాజకీయ నాయకులుగానో,పెద్ద వ్యాపారవేత్తలుగానో చెప్పుకునేవారు. వారిని ఆ ఊరంతా సంపన్నులుగా భావించేవారు. ఆ ఊర్లో వాళ్లకు వారి బంధువులు ఏమైనా శుభవార్త అయినా.. అశుభ వార్త అయినా ఈ ఫోన్‌కు కాల్ చేసి చెబితే వారు పిలిపించి మాట్లాడించేవారు. అందుకే ఫోన్ ఇంట్లో ఉన్న వారితో ఇరుగు పొరుగు అంతా బాగా కలిసి ఉండేవారు. కొంత కాలానికి ల్యాండ్‌లైన్ ఫోన్ మధ్యతరగతి వారి ఇళ్లకూ చేరింది. తమ పిల్లలు, బంధువుల యోగక్షేమాలు తెలుసుకోవాలంటే ఫోన్ తప్పసరి కావడంతో ల్యాండ్‌ఫోన్ పెట్టించుకునేవారు. అయితే కాలగమనంలో అతి తక్కువ ధరకు సెల్ఫోన్లు రావడంతో పాటు ఇంట్లో ఉన్న వారు ఫోన్ మాట్లాడేందుకు ఎవరికి వారు ప్రైవసీకి అలవాటు పడటంతో ల్యాండ్‌లైన్ ఫోన్లు ఆదరణ కోల్పోయాయి. ఉపాధికి కేరాఫ్‌గా ఎస్టీడీ బూత్‌లు ఓ 20 సంవత్సరాల క్రితం చదువుకుని ఉద్యోగం రాని నిరుద్యోగ యువత పట్టణాల్లో ఎస్టీడీ బూత్‌లు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేవారు. వీటిలో షిఫ్ట్‌ల పద్ధతిలో వేలాది మంది పనిచేసేవారు. కాలక్రమేణా ల్యాండ్‌లైన్ స్థానంలో కాయిన్‌బాక్స్‌లు రావడంతో పట్టణం నుంచి పల్లెల్లో వీధివీధినా ముఖ్యంగా దుకాణాల దగ్గర ఎక్కడ చూసినా రూపాయి కాయిన్ బాక్స్ ఉండేవి. అంతే స్పీడుగా స్మార్ట్ ఫోన్ సేవలు అందుబాటులోకి రావడంతో ఆ సేవలన్నీ కనిపించకుండా పోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణాల్లోనే.. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌ఫోన్ల సంఖ్య భారీగా తగ్గింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2006 వరకు సుమారు 1.5 లక్షల కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం 7,500కు తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ల్యాండ్‌లైన్ కనుమరుగు అవగా పట్టణాల్లో ప్రభుత్వ కార్యాలయాలైన విద్యుత్, పోలీస్, రెవెన్యూ, హాస్పిటల్, బ్యాంకులు, పెద్దపెద్ద వ్యాపార సంస్థల్లో మాత్రమే ల్యాండ్ఫోన్లు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా కనుమరుగై పోవడంతో ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2015 నుంచి డౌన్‌ఫాల్ 2000 సంవత్సరం నుంచి బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారుడికి ల్యాండ్‌ఫోన్ ఉచితంగా ఇవ్వడం మానేసింది. డబ్బులిచ్చి ఫోన్ కొనుక్కోవాలి. ల్యాండ్‌ఫోన్ కనెక్షన్‌కు డిపాజిట్ కట్టి ఫోన్ కొనుగోలు చేసే సొమ్ముకు సెల్ ఫోన్ వస్తుండటంతో అందరూ అటువైపు మొగ్గుచూపారు. దీనికి తోడు 2015లో జియో 4జి రావడం.. ఒకటి, రెండేళ్లు ఉచితంగా అపరిమిత సేవలు అందించడంతో ప్రజలు మొత్తం సునామీలా అందులోకి డైవర్ట్ అయ్యారు. అప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్లకు డౌన్‌ఫాల్ మొదలైంది. – రామాంజనేయరెడ్డి, ఎస్‌డీఓటీ, ఆళ్లగడ్డ అందరూ ప్రైవసీకి అలవాటు పడ్డారు ల్యాండ్‌ఫోన్ ఖర్చుతో పోల్చితే మొబైల్ ఖర్చు చాలా తక్కువగా ఉంటోంది. దీనికి తోడు ల్యాండ్‌ఫోన్ ఓ చోట ఉంటే అందరూ అక్కడికి వచ్చి అందరి ముందు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ప్రైవసీకి అలవాటు పడ్డారు. మొబైల్ అయితే వారికి అనువుగా ఉన్నచోట కూర్చొని రహస్యంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే ల్యాండ్‌లైన్ ఫోన్లు ఎవరూ ఇష్ట పడ్డం లేదు. – రమణ, అహోబిలం -
ఆ కాల్స్‌కు ముందుగా ‘0’ నొక్కండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్స్‌కు చేసే కాల్స్‌కు ముందుగా ‘0’ నొక్కాలని టెలికం కంపెనీలు కస్టమర్లను కోరాయి. ఈ మేరకు ల్యాండ్‌లైన్ వినియోగదార్లకు సందేశాలను పంపాయి. గతేడాది నవంబర్‌లో టెలికం శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు 2021 జనవరి 15 నుంచి ఈ నూతన విధానం అమలులోకి వచ్చిందని కంపెనీలు తెలిపాయి. ల్యాండ్‌లైన్ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్ నుంచి మొబైల్‌కు చేసే కాల్స్‌లో ఎలాంటి మార్పు లేదు. -
నట్టింట్లో ట్రింగ్..ట్రింగ్!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు నట్టింట్లో ట్రింగ్.. ట్రింగ్.. అంటూ మోగిన ల్యాండ్‌లైన్ పోన్లు మళ్లీ మోత మోగించనున్నాయి. బీఎస్ఎన్ఎల్తో పాటు జియో కూడా వీటికి మళ్లీ జీవం పోస్తోంది. బీఎస్ఎన్ఎల్ దీని కోసం తన నెట్‌వర్క్‌ను నెక్ట్స్ జనరేషన్ ఆప్టికల్ ఫైబర్ ఆధారిత టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేసింది. దీంతో ఎలాంటి అంతరాయం లేకుండా క్లియర్ వాయిస్, డౌన్లోడ్ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్లో ఇలా...: ల్యాండ్‌లైన్ విని యోగదారులకు రోజూ రాత్రి 10.30 నుంచి ఉదయం 6 గంటల వరకు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం. ఆదివారం ఉచితంగా మాట్లాడుకునే సౌకర్యం. నెల రోజులపాటు ఉచిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడంతోపాటు వినియోగదారులకు రోజుకు 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 5 జీబీ ఉచిత డేటాను అందిస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం వినియోగదారులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అయితే సేవల కోసం మోడమ్‌ను మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ ప్రతి నెలా 5 రోజులపాటు నగరంలోని ముఖ్యకూడళ్లలో మెగా మేళాలను నిర్వహిస్తోంది. నగరంలో 2.60 లక్షల కనెక్షన్లు..: హైదరాబాద్‌లో బీఎస్ఎన్ఎల్కు 2.60 లక్షల ల్యాండ్‌లైన్, 60 వేల బ్రాడ్‌బ్యాండ్, 25 వేలకు పైగా ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొబైల్ విప్లవం కంటే ముందు సుమారు 7.50 లక్షలు ఉన్న ల్యాండ్‌లైన్ కనెక్షన్లు లక్ష వరకు పడిపోయాయి. తిరిగి బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానంతో ల్యాండ్‌లైన్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. టారిఫ్‌లు ఇలా..: ల్యాండ్‌లైన్ ఫోన్ నెల అర్బన్ ప్యాకేజీ రూ.299 కింద ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ చేసుకునే అవకాశం. ప్యాకేజీ రూ.129 కింద మాత్రం బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు అపరిమిత కాలింగ్ సౌకర్యం. మిగతా నెట్‌వర్క్‌లకు రూ.100 విలువైన కాల్స్ చేసుకోవచ్చు. బ్రాడ్‌బ్యాండ్ విషయానికొస్తే.. ఒక నెల 349 ప్యాకేజీ కింద 8 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రోజుకు 2 జీబీ డేటా డౌన్లోడ్ చాన్స్. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లకు రూ.645 ప్యాకేజీ కింద రోజుకు 40 ఎంబీపీఎస్ స్పీడ్, 200 జీబీ డేటాను డౌన్లోడ్ అవకాశం. అన్‌లిమిటెడ్‌గా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ‘ఎక్స్ట్రీమ్’ ఇప్పటికే నగరంలో ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తున్న ఎయిర్టెల్ హైస్పీడ్ సేవలతో ప్లాన్ ఎక్స్ర్టీమ్ ఫైబర్ పేరుతో ముందుకొచ్చింది. వన్ జీబీపీఎస్ నెట్వర్క్ వేగంతో ఎయిర్టెల్ హోం బ్రాడ్‌బ్యాండ్‌ను ఆఫర్ చేస్తోంది. జియో ఫైబర్ తరహాలోనే ప్లాన్ ధరను, బెనిఫిట్స్‌ను ఎయిర్టెల్ నిర్ధారించింది. ఎక్స్ట్రీమ్ మల్టీమీడియా స్మార్ట్ ఎకోసిస్టమ్‌లో భాగంగా ఫైబర్ సర్వీస్‌ను లాంఛ్ చేసింది. వినియోగదారులకు వన్‌జీబీపీఎస్ నెట్వర్క్ స్పీడ్‌తో సేవ లు లభిస్తాయి. ఫైబర్ ల్యాండ్ లైన్ కనెక్షన్‌తో అపరిమితకాల్స్ను వర్తింపజేస్తోంది. జియో దూకుడు... రిలయన్స్ జియో ఆప్టికల్ ఫైబర్ ఆధారిత సేవలు కూడా నగరంలో అందుబాటులోకొచ్చాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 2 లక్షల గృహాలకు ఫైబర్ టు ది హోమ్ సేవలను ప్రారంభించింది. ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, జీయో టీవీ ప్లస్ సేవలు అందిస్తోంది. జియో ఫైబ ర్ కస్టమర్లకు ల్యాండ్‌లైన్ నుంచి జీవితాంతం ఉచిత వాయిస్ కాల్స్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమం డ్, ప్లాటినం, టైటానియం పేరుతో 6 ప్లాన్లను పరిచయం చేసింది. -
మొబైల్‌ఫోన్, ల్యాండ్‌లైన్ సేవలు రీస్టార్ట్!
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లదాఖ్ విభజన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భారీగా భద్రతా బలగాలను మోహరించి.. నిషేధాజ్ఞలను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో, ముఖ్యంగా కశ్మీర్ లోయలో 144 సెక్షన్ అమల్లో ఉంచి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, భారీ నిరసనలు జరగకుండా ముందజాగ్రత్త చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. కేంద్రం నిర్ణయాల నేపథ్యంలో భద్రతా దళాల నీడలో ఉన్న కశ్మీర్ లోయలో జనజీవనం పలు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్, ల్యాండ్‌లైన్ సేవలు నిలిపేయడం, ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేయడంతో బయటి ప్రపంచానికి కశ్మీర్‌తో దాదాపుగా సంబంధాలు తెగిపోయాయి. దీంతో లోయలోని తమ వారి యోగక్షేమాలు తెలియక బయట ఉన్న కశ్మీరీలు ఆందోళన చెందుతుండగా.. బయట ఏం జరుగుతుందో తెలియ లోయ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజనపై కశ్మీర్లో పెద్దగా నిరసనలు.. అలజడి చెలరేగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తోంది. శనివారం సాయంత్రం కల్లా జమ్మూకశ్మీర్‌లో మొబైల్ ఫోన్ వాయిస్ కాల్ సేవలు, లాండ్‌లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా 144 సెక్షన్ అమలులోనూ సడలింపులు ఇచ్చే అవకాశముంది. ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు మాత్రం కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. -
బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్.. అపరిమిత ఉచిత కాల్స్
-
బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్.. అపరిమిత ఉచిత కాల్స్
రాత్రి 9 గం. నుంచి ఉదయం 7 గం.లోపు * ఏ ల్యాండ్‌లైన్/మొబైల్ నెట్‌వర్క్‌కైనా * వచ్చేనెల 1 నుంచి అమల్లోకి... న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి రాత్రి వేళల్లో అపరిమిత ఉచిత కాల్స్ చేసుకునే ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఈ ఆఫర్ వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. తమ ల్యాండ్‌లైన్ నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు దేశంలోని ఏ ప్రాంతానికైనా ఏ నెట్వర్క్ ల్యాండ్‌లైన్‌కైనా, ఏ మొబైల్ నెట్వర్క్ ఫోన్లకైనా ఉచితంగా ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చని వివరించింది. అన్ని ల్యాండ్‌లైన్ సాధారణ ప్లాన్లకు (గ్రామీణ, పట్టణ) ల్యాండ్‌లైన్ స్పెషల్ ప్లాన్లు, కాంబో ప్లాన్(ల్యాండ్‌లైన్, బ్రాండ్‌బాండ్ కలగలిపిన).. ఏ ప్లాన్లకైనా ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ల్యాండ్‌లైన్ వ్యాపారానికి జోష్‌నిచ్చే దిశగా బీఎస్ఎన్ఎల్ ఈ ఉచిత అపరిమిత కాల్స్ ఆఫర్‌ను అందిస్తోంది. దేశీయ ల్యాండ్‌లైన్ మార్కెట్లో అధిక మార్కెట్ వాటా (దాదాపు 62 శాతం)ఉన్న బీఎస్ఎన్ఎల్ నుంచి ల్యాండ్‌లైన్ కనెక్షన్ల ఉపసంహరణ అధికంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1.62,556 మంది బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ కనెక్షన్లకు గుడ్‌బై చెప్పారు. దీనిని నివారించడానికి కూడా ఈ అపరిమిత ఉచిత కాల్స్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారుల సంఖ్య 1.66 కోట్లుగా ఉంది.