
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్స్‌కు చేసే కాల్స్‌కు ముందుగా ‘0’ నొక్కాలని టెలికం కంపెనీలు కస్టమర్లను కోరాయి. ఈ మేరకు ల్యాండ్‌లైన్ వినియోగదార్లకు సందేశాలను పంపాయి. గతేడాది నవంబర్‌లో టెలికం శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు 2021 జనవరి 15 నుంచి ఈ నూతన విధానం అమలులోకి వచ్చిందని కంపెనీలు తెలిపాయి. ల్యాండ్‌లైన్ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్ నుంచి మొబైల్‌కు చేసే కాల్స్‌లో ఎలాంటి మార్పు లేదు.
Comments
Please login to add a commentAdd a comment