Mobile calls
-
ఇదో కొత్తరకం సైబర్ మోసం!
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మొబైల్ ఫోన్‌కు ఎటువంటి సమాచారం రాకుండా చేస్తూ అకౌంట్లో నుంచి డబ్బు దోచేస్తున్నారు. ఈ తరహా మోసం ఇటీవల బిహార్‌లోని పూర్నియాలో వెలుగులోకి వచ్చింది. మొబైల్ ఫోన్‌కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ), బ్యాంక్ నుంచి కాల్ రాకుండా, ఇలా ఎటువంటి క్లూ కూడా లేకుండా డబ్బులు దోచుకున్న ఘటనకు సంబంధించిన వీడియోను హర్యానా ఐపీఎస్ అధికారి పంకజ్ జైన్ సోషల్ మీడియలో పోస్ట్ చేశారు.No OTP,No phone call,No clue,But money was stolen from the bank account...(with the help of Registry papers)Case is of Purnia Bihar . #CyberFraud pic.twitter.com/jeVGqhMWmV— Pankaj Nain IPS (@ipspankajnain) July 11, 2024బిహార్‌లోని పూర్నియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘వెబ్సైట్ నుంచి భూమి రికార్డుల పత్రాల వివరాలు సేకరించి ఆ రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని బ్యాంకులో చొరబడి తారుమారు చేశారు. భూరికార్డుల్లో ఆధార్‌కార్డు, బయోమెట్రిక్‌లను తారుమారు చేసి నకిలీ వేలిముద్రలు సృష్టించారు. ఈ విధంగా మొబైల్ ఫోన్‌కు కాల్, ఓటీపీ రాకుండానే మోసానికి పాల్పడ్డారు’ పోలీసులు తెలిపారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న ముఠాలో 8 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. -
ఈ ఏడాదీ మొబైల్ టారిఫ్‌ల మోత!
న్యూఢిల్లీ: మొబైల్ కాల్ టారిఫ్‌ల మోత మోగించేందుకు టెలికం సంస్థలు సిద్ధమవుతున్నాయి. అవసరమైతే రేట్ల పెంపు విషయంలో మిగతా సంస్థల కన్నా ముందుండాలని భారతీ ఎయిర్టెల్ భావిస్తోంది. ‘2022లో టారిఫ్‌లు పెరగవచ్చని అంచనా వేస్తున్నాను. వృద్ధి అవసరాలు, కనెక్షన్ల స్థిరీకరణ వంటి అంశాల కారణంగా వచ్చే 3–4 నెలల్లో ఇది జరగకపోవచ్చు కానీ.. ఈ ఏడాది ఏదో ఒక సమయంలో రేట్ల పెంపు మాత్రం ఉండవచ్చు. పోటీ సంస్థల పరిస్థితిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఇటీవల చేసినట్లుగా ఈ విషయంలో (రేట్ల పెంపు) అవసరమైతే నేతృత్వం వహించేందుకు మేము సందేహించబోము‘ అని అనలిస్టుల సమావేశంలో భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. 2021 నవంబర్‌లో టారిఫ్‌లను అన్నింటికన్నా ముందుగా 18–25 శాతం మేర ఎయిర్టెల్ పెంచింది. ఇటీవల ప్రకటించిన మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల ప్రకారం యూజర్‌పై కంపెనీకి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 163గా ఉంది. వార్షికంగా చూస్తే 2.2 శాతం తగ్గింది. సంస్థ లాభదాయకతను సూచించే ఏఆర్పీయూను రూ. 200కి పెంచుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది. ఇందులో భాగంగానే టారిఫ్‌ల పెంపును పరిశీలిస్తోంది. ‘2022లోనే పరిశ్రమ ఏఆర్పీయూ రూ. 200 స్థాయికి చేరగలదని.. ఆ తర్వాత మరికొన్నేళ్లకు రూ. 300 చేరవచ్చని ఆశిస్తున్నాం. అప్పుడు పెట్టుబడిపై రాబడి దాదాపు 15 శాతంగా ఉండగలదు‘ అని విఠల్ చెప్పారు. నెట్‌వర్క్‌లు .. డివైజ్‌ల అప్‌గ్రెడేషన్, క్లౌడ్ వ్యాపారాన్ని మెరుగుపర్చుకునేందుకు 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,250 కోట్లు) వెచ్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఆ కాల్స్‌కు ముందుగా ‘0’ నొక్కండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్స్‌కు చేసే కాల్స్‌కు ముందుగా ‘0’ నొక్కాలని టెలికం కంపెనీలు కస్టమర్లను కోరాయి. ఈ మేరకు ల్యాండ్‌లైన్ వినియోగదార్లకు సందేశాలను పంపాయి. గతేడాది నవంబర్‌లో టెలికం శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు 2021 జనవరి 15 నుంచి ఈ నూతన విధానం అమలులోకి వచ్చిందని కంపెనీలు తెలిపాయి. ల్యాండ్‌లైన్ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్ నుంచి మొబైల్‌కు చేసే కాల్స్‌లో ఎలాంటి మార్పు లేదు. -
చౌక కాల్స్, డేటాకు చెల్లు!!
న్యూఢిల్లీ: చౌక మొబైల్ కాల్స్, డేటా విధానానికి స్వస్తి పలుకుతూ .. కనీస చార్జీలు వడ్డించే ప్రతిపాదనలపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి సారించింది. దీనిపై తాజాగా చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఇటు టెల్కోలు, అటు కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టారిఫ్‌ల విషయంలో నియంత్రణ సంస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరంపైనా, మొబైల్ సర్వీసెస్ కనీస చార్జీలను నిర్ణయించడంపైనా సంబంధిత వర్గాల అభిప్రాయాలు కోరింది. ఒకవేళ కనీస చార్జీలు నిర్ణయించాల్సి వస్తే కొత్త ఆపరేటర్లకు అకస్మాత్తుగా లాభాలు వచ్చి పడకుండా అనుసరించతగిన విధానాలపైనా అభిప్రాయాలను ఆహా్వనించింది. ఇందుకు వచ్చే ఏడాది జనవరి 17 దాకా గడువు ఉంటుంది. వీటిపై కౌంటర్–కామెంట్స్ సమరి్పంచడానికి జనవరి 31 ఆఖరు తేది. ‘టెలికం రంగంలో శరవేగంగా మారే టెక్నాలజీలను అందుకోవాలంటే భారీ పెట్టుబడులు కావాలి. ఎకానమీలో వివిధ రంగాలకు కీలకంగా మారిన టెలికం రంగం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. టెలికం రంగ సమస్యలు పరిష్కరించేందుకు, పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత వర్గాలంతా చర్చించాల్సిన అవసరం ఉంది‘ అని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. యూ టర్న్... టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తాజా ట్రాయ్ చర్చాపత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం.. టారిఫ్‌ల విషయంలో టెల్కోలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. టారిఫ్ ప్లాన్లను ప్రకటించిన వారం రోజుల్లోగా ట్రాయ్‌కు తెలిపితే సరిపోతుంది. కాబట్టి యూజర్లను ఆకర్షించేందుకు టెల్కోలు పోటాపోటీగా ఉచిత, అత్యంత చౌక ప్లాన్స్ కూడా అందిస్తూ వచ్చాయి. ఒకవేళ కనీస చార్జీల విధానం గానీ అమల్లోకి వస్తే.. ఉచిత సరీ్వసులకు ఇక కాలం చెల్లినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ.. టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు పరిశీలించతగిన చర్యలంటూ అక్టోబర్‌లో చేసిన సిఫార్సుల్లో ఈ కనీస చార్జీల ప్రతిపాదన కూడా ఉంది. అటు పాత టెల్కోలు కూడా దీన్ని గట్టిగా కోరుతున్నాయి. రిలయన్స్ జియో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత రెండేళ్ల క్రితం టెల్కోలు ఇలాంటి ప్రతిపాదనే చేసినప్పటికీ.. ఇది సాధ్యపడే విషయం కాదని ట్రాయ్ తోసిపుచి్చంది. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో దీన్ని పరిశీలించాలని భావిస్తోంది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టులో ప్రతికూల ఆదేశాలు రావడంతో టెల్కోలు దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సెపె్టంబర్ క్వార్టర్లో వొడాఫోన్ ఐడియా రికార్డు స్థాయిలో రూ. 50,922 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. అటు ఎయిర్టెల్ కూడా రూ. 23,045 కోట్లు నష్టాలు ప్రకటించింది. 2021 దాకా ఐయూసీ కొనసాగింపు న్యూఢిల్లీ: టెలికం సంస్థల ఇంటర్‌కనెక్ట్ యూసేజీ చార్జీల (ఐయూసీ) విధానాన్ని 2021 జనవరి 1 దాకా కొనసాగించాలని ట్రాయ్ నిర్ణయించింది. ఆ తర్వాత నుంచి ఈ చార్జీలు పూర్తిగా ఎత్తివేసేలా ప్రతిపాదనలు చేసింది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి కాల్స్ స్వీకరించినందుకు.. టెల్కోలు వసూలు చేసే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది నిమిషానికి 6 పైసలుగా ఉంది. ఈ విధానాన్ని 2020 జనవరి 1 నుంచి ఎత్తివేసే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ.. దీన్ని 2021 దాకా కొనసాగించాలని ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న టెలికం రంగానికి ఇది కాస్త ఊరటనిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతంలో 14 పైసలుగా ఉన్న ఐయూసీ చార్జీలను ట్రాయ్ 2017 అక్టోబర్‌లో 6 పైసలకు తగ్గించింది. దీంతో టెలికం సంస్థలు రూ. 11,000 కోట్ల మేర నష్టపోయాయని అంచనా. ఒకవేళ 6 పైసల ఐయూసీని కూడా ఎత్తివేసిన పక్షంలో పరిశ్రమపై మరో రూ. 3,672 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడేది. దీనితో పాటు వినియోగదారుల ప్రయోజనాలు, టెలికం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఐయూసీ స్థానంలో కొత్త బీఏకే (బిల్ అండ్ కీప్) విధానం అమలును ఏడాది పాటు వాయిదా వేసినట్లు ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ నిర్ణయాన్ని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ స్వాగతించింది. ఐయూసీని పరిగణనలోకి తీసుకునే టెల్కోలు ఇటీవల చార్జీలను పెంచినందున.. వినియోగదారులపై కొత్తగా దీని ప్రభావమేమీ ఉండబోదని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. -
మెసేజ్, కాల్స్‌తోనూ పర్యావరణానికి ముప్పు
టొరంటో: మెసేజ్, కాల్స్‌తో పర్యావరణానికి నష్టం ఎలాగా అని ఆలోచిస్తున్నారా..? ఈ రెండింటితోనే కాదు.. మీరు డౌన్లోడ్ లేదా అప్లోడ్ చేసే వీడియోలు, వీడియో కాల్స్, ఇంటర్నెట్ వినియోగం వీటన్నిటి వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే వీటిని ప్రాసెస్ చేయడానికి పెద్దఎత్తున డేటా కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిరంతరాయం పనిచేస్తుంటాయి. దీంతో ఈ కేంద్రాల నుంచి భారీగా వెలువడే కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2040 నాటికి పర్యావరణానికి జరిగే నాశనంలో స్మార్ట్‌ఫోన్స్, డేటా సెంటర్లదే అధిక భాగం ఉంటుందని హెచ్చరించారు. దీనిలో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, డెస్క్‌టాప్స్, డేటా సెంటర్లు, ఇతర కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్‌లో వినియోగించే కర్బన ఉద్గారాలపై వారు పరిశోధన చేపట్టారు. ప్రస్తుతం ఈ రంగం నుంచి వెలువడే కర్బన్ ఉద్గారాల శాతం 1.5 గా ఉందని.. 2040 నాటికి 14 శాతానికి చేరుకుంటుందన్నారు. -
జియోకు షాక్: బీఎస్ఎన్ఎల్ ఫ్రీ ఆఫర్
న్యూడిల్లీ: ఉచిత ఆఫర్లతో టెలికాం రంగంలో సంచలనానికి తెరతీసింది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్. దీంతో జియో పోటీని తట్టుకునేందుకు వీలుగా దేశీయ టెలికాం కంపెలు అనేక ఆఫర్లతో ముందుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో జియోకు చెక్ పెట్టేలా, జియో తాజా ఆఫర్ కు దీటుగా ప్రభుత్వం రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దూసుకు వస్తోంది. తమ చందాదారులకు నెలకు ఉచిత వాయిస్ కాల్స్ , ఇతర ఫ్రీ ఆఫర్లతో కొత్త మంత్లీ ప్లాన్ ను పరిచయం చేయబోతోంది. జనవరి 1 నుంచి ఈ బంపర్ ఆఫర్ ను వినియోగదారులకు అందించనుంది. నెలకు రూ.149 రీచార్జ్ తో ఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్ లోకల్ అండ్ నేషనల్ వాయిస్ కాల్స్ తోపాటు 300 ఎంబీ డాటా సదుపాయంతో ఈ ప్లాన్ ను లాంచ్ చేయనుంది. నెల రూ 149 వద్ద భారతదేశం అంతటా ఏ నెట్వర్క్ వద్ద మొబైల్ చందాదారులకు అపరిమిత వాయిస్ కాల్స్ ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. జియో వ్యూహాత్మక ధరలు, ప్రధాన ప్రత్యర్థులు భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా సెల్యులార్ ఆఫర్ల నేపథ్యంలో కొత్త చందాదారులను ఆకట్టుకోవడంతోపాటు ఇప్పటికే ఉన్న వినియోగదారులను నిలబెట్టుకోవడంపై దృష్టిపెట్టినట్టు ఆయన చెప్పారు. కాగా 2015-16 సంవత్సరానికి గాను బీఎస్ఎన్ఎల్ సుమారు ఆరు రెట్ల వృద్ధితో రూ. 3,855కోట్ల నికర లాభాలను ప్రకటించింది. జియో 28-రోజుల వాలిడిటీతో , 300 ఎంబీ డేటా , అన్ లిమిటెడ్ కాల్స్ , 100 లోకల్ అండ్ నేషనల్ ఎస్ఎంఎస్ లను రూ.149 రీచార్జ్ ప్లాన్ లో అందిస్తున్న సంగతి తెలిసిందే. -
నేను మీ అభ్యర్థిని..
హోరెత్తుతోన్న ఐవీఆర్ఎస్ ప్రచారం ఓటర్లకు వెల్లువెత్తుతోన్న మొబైల్ కాల్స్ సామాజిక సైట్లలోనూ అదే జోరు సిటీబ్యూరో: ‘నేను ------- మీ పార్టీ అభ్యర్థిని. మీ డివిజన్ నుంచి పోటీచేస్తున్నాను. నన్ను గెలిపిస్తే డివిజన్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించాలి. మీరు తప్పకుండా ఫిబ్రవరి 2న మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి’. ఏంటీ సందేశం అనుకుంటున్నారా.. ఇప్పుడు ఇంటింటి ప్రచారం మాటెలా ఉన్నా.. ఓటర్ల మొబైల్ ఫోన్లకు పోటీచేస్తున్న అభ్యర్థుల తరఫు నుంచి ఈ తరహా ఫోన్ రికార్డు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ మోగితే చాలు సిటీజన్లు ఇది ఏ అభ్యర్థి రికార్డు సందేశమో అని నిట్టూరుస్తున్నారు గ్రేటర్ సిటీజన్లు. ఈ తరహా ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ప్రచారం జోరు ఇపుడు సిటీలో పతాక స్థాయికి చేరింది. అభ్యర్థుల అవసరాలకు తగ్గట్టుగా పలు ప్రైవే టు ఏజెన్సీలు రంగంలోకి దిగి ఈ తరహా ప్రచారం చేసిపెడుతున్నాయి. ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడుడు అందరు ఓటర్లను కలుసుకోలేకపోయినా.. ఈ ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ముందుగా రికార్డు చేసిన సందేశాన్ని యువకులు, ఉద్యోగులు, కార్మికులకు వినిపిస్తే వారి ఓటు తమ ఖాతాలో పడుతుందని భావిస్తున్నారు మన నేతశ్రీలు. మహానగరంలో సొంత వాహనం లేకున్నా సెల్‌ఫోన్ లేని వారు అరుదు. దీంతో పలు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ తరహా ప్రచారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఇక పనిలోపనిగా సంక్షిప్త సందేశాల ద్వారా కూడా ‘మీ ఓటు మాకే వేయాలన్న’ సందేశాలను పంపిచేస్తున్నారు. ఇక సోషల్ మీడియా సైట్లు ఫేస్బుక్, వాట్సప్ గ్రూపులు సైతం ఎన్నికల ప్రచారానికి కరదీపికలుగా మారడం ఈసారి గ్రేటర్ ఎన్నికల వైచిత్రి. ఫలానా అభ్యర్థికి మీ అమూల్యమైన ఓటేయాలని ఫేస్బుక్లో ఎవరైనా పోస్టు చేస్తే చాలు లైకులే లైకులు.. కామెంట్లే కామెంట్లు. ఇక వాట్సప్ గ్రూపుల్లోనూ చాంతాడంత సందేశాలతో పలు గ్రూపుల్లో ఉన్న మహానగర ఓటరు మహాశయులు ఎన్నికల ప్రచారంలో తరిస్తున్నారు మరి. అభ్యర్థుల గుణగణాలు, వ్యక్తిత్వం, చేస్తున్న ఖర్చు, గతంలో అభ్యర్థులు స్థానికంగా చేసిన సేవలు.. విద్యార్హతలు, ఆస్తిపాస్తులు ఒక్కటేమిటి ఇప్పుడిలాంటి అంశాలన్నీ సామాజిక సైట్లలో హాట్ టాపిక్‌గా మారి చర్చోపచర్చలకు దారితీస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ హైటెక్ ప్రచార బాణీ చూసి సామాన్యుడు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నాడు. -
రూ.300 రీచార్జ్ చేసుకుంటే రూ. 433 టాక్ టైం
హైదరాబాద్ : కొత్త వినియోగదారులకు మొబైల్ కాల్ రేట్లలో 80 శాతం వరకూ డిస్కౌంట్ ఇస్తున్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తాజాగా నూతన సంవత్సరం కానుకగా వినియోగదారులకు ఎక్స్ట్రా టాక్ టైమ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా రూ.290 రీచార్జ్ చేసుకుంటే రూ.320 టాక్‌టైమ్‌ను అందిస్తోంది. అలాగే రూ.300 రీచార్జ్ చేసుకుంటే రూ.433, రూ.890 రీచార్జ్ చేసుకుంటే రూ. 1,000, రూ.2,000 రీచార్జ్ చేసుకుంటే రూ.2,300, రూ.3,000 రీచార్జ్ చేసుకుంటే రూ.3,450, రూ. 5,000 రీచార్జ్ చేసుకుంటే రూ.6,000 టాక్‌టైమ్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ వచ్చే నెల 2వ తేదీ వరకూ కొనసాగుతుందని తెలిపింది. వివరాలకు 1503కి డయల్ చేయాలని సూచించింది. -
తగ్గనున్న మొబైల్ రోమింగ్ చార్జీలు
కాల్స్‌పై 35%, ఎస్ఎంఎస్లపై 80 శాతం దాకా తగ్గుదల: ట్రాయ్ ప్రతిపాదనలు న్యూఢిల్లీ: రోమింగ్‌లో మొబైల్ కాల్స్, ఎస్ఎంఎస్ల చార్జీలను సుమారు 35 శాతం నుంచి 80 శాతం దాకా తగ్గించే దిశగా టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదనలు రూపొందించింది. టెలికం కంపెనీలు వసూలు చేసే రోమింగ్ చార్జీలపై గరిష్ట పరిమితుల్లో మార్పులు చేస్తూ టెలికమ్యూనికేషన్ టారిఫ్ ఆర్డరుకు సవరణలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం రోమింగ్‌లో ఉన్నప్పుడు చేసే ఔట్‌గోయింగ్ లోకల్ కాల్స్‌కి ప్రస్తుతం నిమిషానికి రూ.1గా ఉన్న గరిష్ట టారిఫ్ పరిమితిని 65 పైసలకు తగ్గించాల్సి ఉంటుంది. ఇక నిమిషానికి రూ. 1.5గా ఉన్న ఎస్టీడీ కాల్స్ చార్జీలు కూడా రూ.1కి తగ్గుతాయి. మరోవైపు ఇన్కమింగ్ కాల్స్‌కి సంబంధించి ప్రస్తుతం టెల్కోలు గరిష్టంగా 75 పైసలు వసూలు చేస్తుండగా దీన్ని 45 పైసలకు తగ్గించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. అలాగే, లోకల్ ఎస్ఎంఎస్లకు ప్రస్తుతం రూ. 1గా ఉన్న టారిఫ్‌ను 20 పైసలకు తగ్గించాలని పేర్కొంది. ఈ సిఫార్సులపై టెల్కోలు మార్చి 13లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది.