రూ.300 రీచార్జ్ చేసుకుంటే రూ. 433 టాక్ టైం
హైదరాబాద్ : కొత్త వినియోగదారులకు మొబైల్ కాల్ రేట్లలో 80 శాతం వరకూ డిస్కౌంట్ ఇస్తున్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తాజాగా నూతన సంవత్సరం కానుకగా వినియోగదారులకు ఎక్స్‌ట్రా టాక్ టైమ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా రూ.290 రీచార్జ్ చేసుకుంటే రూ.320 టాక్టైమ్ను అందిస్తోంది.
అలాగే రూ.300 రీచార్జ్ చేసుకుంటే రూ.433, రూ.890 రీచార్జ్ చేసుకుంటే రూ. 1,000, రూ.2,000 రీచార్జ్ చేసుకుంటే రూ.2,300, రూ.3,000 రీచార్జ్ చేసుకుంటే రూ.3,450, రూ. 5,000 రీచార్జ్ చేసుకుంటే రూ.6,000 టాక్టైమ్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ వచ్చే నెల 2వ తేదీ వరకూ కొనసాగుతుందని తెలిపింది. వివరాలకు 1503కి డయల్ చేయాలని సూచించింది.